ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Uddhav Thackeray : ఎన్డీఏ వైపా.. ఇండియా వైపా...

ABN, First Publish Date - 2023-08-28T02:21:22+05:30

చోటామోటా నాయకులైనా సరే.. మహారాష్ట్రకు చెందినవారిని ఏకంగా ప్రగతిభవన్‌కు పిలిచి కండువా కప్పి బీఆర్‌ఎ్‌సలో చేర్చుకుంటూ..

కేసీఆర్‌ ఏదో ఒకటి స్పష్టం చేయండి.. ఓట్లు మాత్రం చీల్చొద్దు

తెలంగాణ సీఎంను ఉద్దేశించి

ఉద్ధవ్‌ ఠాక్రే తీవ్ర వ్యాఖ్యలు

రాహులే ప్రధాని అభ్యర్థి

వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థి రాహుల్‌ గాంఽధీయేనని రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గెహ్లోత్‌ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కూటమిలోనూ చర్చించినట్లు పేర్కొన్నారు. రాహుల్‌ అభ్యర్థిత్వానికి అన్ని పార్టీలు అంగీకారం తెలిపాయని కూడా వివరించారు. కాగా ఇండియా కూటమిలోకి త్వరలో ఎన్డీఏలోని నాలుగైదు పార్టీలు చేరతాయని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి అలోక్‌శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో ఇటీవల 38 పార్టీలతో జరిగిన ఎన్డీఏ సమావేశంలో ఇవి కూడా పాల్గొన్నాయని పేర్కొన్నారు. ముంబైలో కీలక నిర్ణయాలు తీసుకుంటామని వివరించారు.

హింగోలీ, న్యూఢిల్లీ, పట్నా, ఆగస్టు 27: చోటామోటా నాయకులైనా సరే.. మహారాష్ట్రకు చెందినవారిని ఏకంగా ప్రగతిభవన్‌కు పిలిచి కండువా కప్పి బీఆర్‌ఎ్‌సలో చేర్చుకుంటూ, ఆ రాష్ట్రంలో విస్తృత స్థాయిలో పోటీకి సిద్ధమంటూ ప్రకటనలు చేస్తున్న సీఎం కేసీఆర్‌పై మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్‌ థాక్రే తీవ్రంగా మండిపడ్డారు. అసలు కేసీఆర్‌ ఉద్దేశమేమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. దేశం బాగు కోసం పోరాడతారా? లేక బీజేపీకి మద్దతిస్తారా? స్పష్టం చేయాలని కోరారు. మహారాష్ట్రలోని హింగోలీలో ఆదివారం నిర్వహించిన ర్యాలీలో ఉద్ధవ్‌ మాట్లాడారు. ‘‘కేసీఆర్‌.. మీరు ఎన్డీఏ వైపా? ఇండియా పక్షమా? తేల్చి చెప్పండి. ‘ఇండియా’.. ప్రజాస్వామ్యాన్ని, దేశాన్ని రక్షించాలని కోరుకునే జాతీయవాద పార్టీల కూటమి. కానీ, ఎన్డీఏలో చాలా పక్షాలు విద్రోహ, సొంత పార్టీలను చీల్చినవే. అందుకే అది నిర్దిష్ట రూపంలేని అమీబా. ఒకవేళ మీరు దేశం వైపు ఉంటే ఇండియాలో చేరండి. లేదా బీజేపీతో మీ పొత్తును బహిరంగంగా ప్రకటించండి. ఓట్లను మాత్రం చీల్చకండి’’ అని సూచించారు. తెలంగాణలో పరిస్థితులు ఏమీ బాగోలేదని.. మహారాష్ట్రలో పోటీ చేయడం సంగతి అటుంచి సొంత రాష్ట్రంపై దృష్టిపెట్టాలని కూడా కోరారు. ఎన్డీఏను నిర్దిష్ట రూపం అంటూ ఉండని అమీబాగా, గర్విష్టుల కూటమి (ఘమా-ఎన్డీఏ)గా ఉద్ధవ్‌ పేర్కొన్నారు.

‘ఇండియా’ ముంబై భేటీ ఎజెండా ఖరారు!

ప్రధాని మోదీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏకతాటిపైకి రావడంలో విపక్షాలు తొలిభేటీలో విజయవంతమయ్యారు.. మలి సమావేశంలో కూటమికి ఓ పేరు పెట్టారు.. మూడో విడతలో.. చిహ్నం (లోగో), సీట్ల పంపకం సహా పలు వ్యూహాత్మక, కీలక అంశాల మీద అవగాహనకు రానున్నారు. ఈ నెల 31, సెప్టెంబరు 1న ముంబైలో జరగనున్న ప్రతిపక్షాల ‘ఇండియా’ సమావేశానికి ఇదే ఎజెండా కానుంది. కూటమికి సమన్వయ కమిటీ నియామకం, కన్వీనర్‌ ఎన్నిక కూడా జరిగే వీలుందని తెలుస్తోంది. 26 పార్టీలున్న ‘ఇండియా’లోకి మరికొన్ని ప్రాంతీయ పార్టీలు వచ్చే అవకాశం ఉందని.. బిహార్‌ సీఎం, ప్రతిపక్షాలను ఏకం చేస్తున్న నీతీశ్‌కుమార్‌ ఆదివారం వ్యాఖ్యానించారు. ఈ పార్టీలు ఏవనేది ఆయన చెప్పలేదు. ముంబై సమావేశంలో సీట్ల పంపకం సహా ఎన్నికలకు సంబంధించిన పలు వ్యూహాలపై తుది నిర్ణయానికి వస్తామని నీతీశ్‌ పేర్కొన్నారు. కాగా, లోక్‌సభ ఎన్నికలకు సీట్ల పంపకం చాలా రాష్ట్రాల్లో దాదాపు కొలిక్కి వచ్చిందని, కొన్నిచోట్ల మాత్రమే సమయం పడుతుందని ముంబై భేటీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కాంగ్రెస్‌ నేత మిలింద్‌ దేవ్‌రా వ్యాఖ్యానించారు. ముంబై సమావేశానికి కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఖర్గేతో పాటు అగ్ర నేతలు సోనియా, రాహుల్‌ హాజరవుతారని శివసేన (ఉద్ధవ్‌) ఎంపీ సంజయ్‌ రౌత్‌ తెలిపారు. కూటమి లోగో.. దేశాన్ని, ఐక్యతను ప్రతిబింబించేలా అందుకు కావాల్సిన శక్తిని అందించేలా ఉంటుందని చెప్పారు.

Updated Date - 2023-08-28T05:10:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising