ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

G20 Summit: ఉక్రెయిన్ సంక్షోభంపై జీ20 తీర్మానం.. రష్యా పేరు ఎత్తకుండానే సభ్య దేశాలు ఏకాభిప్రాయం.. ఉక్రెయిన్ స్పందన ఏమిటంటే?

ABN, First Publish Date - 2023-09-09T21:45:06+05:30

భారతదేశంలో ఢిల్లీ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సమావేశాల్లో భాగంగా.. సభ్య దేశాలు తొలి రోజు కొన్ని కీలక అంశాలపై చర్చలు జరపడంతో పాటు మరికొన్ని విషయాలపై ఆమోదం...

భారతదేశంలో ఢిల్లీ వేదికగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన జీ20 సమావేశాల్లో భాగంగా.. సభ్య దేశాలు తొలి రోజు కొన్ని కీలక అంశాలపై చర్చలు జరపడంతో పాటు మరికొన్ని విషయాలపై ఆమోదం తెలిపాయి. ఇందులో ఉక్రెయిన్ సంక్షోభం అంశం కూడా ఉంది. ఉక్రెయిన్‌లో శాశ్వతమైన శాంతి నెలకొనాలనే తీర్మానాన్ని జీ20 సదస్సు ఆమోదించింది. భూభాగాల దురాక్రమణ కోసం బలవంతపు బెదిరింపులను మానుకోవాలని జీ20 నేతలు అన్ని దేశాలకు సూచనలు ఇచ్చాయి. అంతేకాదు.. అణ్వాయుధాల ముప్పు కూడా ఉండకూడదని కోరాయి. రష్యా పేరు ఏమాత్రం ఎత్తకుండానే.. ఇది యుద్ధాల యుగం కాదని సభ్య దేశాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.


ఈ తీర్మానంలో రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం అంశాన్ని నాలుగు సార్లు ప్రస్తావించడం జరిగింది. అయితే.. అందులో రష్యా పేరుని మాత్రం ప్రస్తావించలేదు. ఐరాస ఛార్టర్‌కు అనుగుణంగా ఏదైనా ప్రాదేశిక సమగ్ర, సార్వభౌమత్వానికి, రాజకీయ స్వేచ్ఛకు భంగం కలిగించకుండా.. ప్రాదేశిక దురాక్రమణలకు దూరంగా ఉండాలని పేర్కొంది. అణ్వాయుధాల్ని చూపించి బెదిరించడం.. ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వెల్లడించింది. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా ఆహార-ఇంధన సంక్షోభాలు, పంపిణీ వ్యవస్థల ఛిన్నాభిన్నం, ఆర్థిక అస్థిరత, ద్రవ్యోల్బణం వంటివి ఆయా దేశాల పాలనను కష్టతరం చేస్తున్నాయని తెలిపింది. రష్యన్‌ ఫెడరేషన్‌, ఉక్రెయిన్‌ నుంచి ధాన్యం, ఆహార పదార్థాలు, ఇతర ముడి పదార్థాలను ఎటువంటి అడ్డుంకులు లేకుండా సరఫరా చేయాలని కోరింది. సంక్షోభాలకు శాంతియుత పరిష్కారాలు, చర్చలు చాలా ముఖ్యమైనవని ఈ డిక్లరేషన్‌ అభిప్రాయపడింది.

అయితే.. ఈ తీర్మానంపై ఉక్రెయిన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రష్యా పేరుని ప్రస్తావించకుండా డాక్యుమెంటేషన్ చేసి ఆమోదం పొందడంలో గొప్పేముందంటూ ఉక్రెయిన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒలెగ్ నికోలెంకో ట్విటర్ (ఎక్స్ ప్లాట్‌ఫామ్) మాధ్యమంగా నిప్పులు చెరిగారు. తొలుత తమ ప్రస్తావన తీసుకొచ్చినందుకు జీ20 సభ్య దేశాలకు కృతజ్ఞతలు తెలిపిన ఆయన.. తమకు సమావేశాల్లో పాల్గొనే అవకాశం కల్పించి ఉంటే, ఉక్రెయిన్‌లోని పరిస్థితుల్ని కళ్లకు కట్టినట్టు చెప్పేవాళ్లమని అన్నారు. డాక్యుమెంటేషన్‌లో రష్యా పేరుని జోడించడంతోపాటు కొన్ని మార్పులు చేసి.. డిక్లరేషన్‌లో ఈ విధంగా పదాల్ని వాడి ఉంటే వాస్తవానికి దగ్గరగా ఉండేదని చెప్పారు.

Updated Date - 2023-09-09T21:45:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising