ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

America: భారత్, అమెరికాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయన్న వార్తలను ఖండించిన అగ్రరాజ్యం

ABN, First Publish Date - 2023-10-05T18:56:37+05:30

కెనడా భారత్(Canada - India) ల మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నడుమ అమెరికా(America), ఇండియాకు గ్యాప్ పెరుగుతుందని ఓ నివేదిక రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఈ విషయాన్ని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది.

న్యూయార్క్:కెనడా భారత్(Canada - India) ల మధ్య తలెత్తిన ఉద్రిక్త పరిస్థితుల నడుమ అమెరికా(America), ఇండియాకు గ్యాప్ పెరుగుతుందని ఓ నివేదిక రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఈ విషయాన్ని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించింది. ఇరుదేశాల నడుమ ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం(America Embassy) ఓ ప్రకటన జారీ చేసింది. భారత్-కెనడా మధ్య ఘర్షణ భారత్-అమెరికా సంబంధాలను మరింత దిగజార్చుతుందన్న వార్తలను కార్యాలయం తోసిపుచ్చింది. ఇరు దేశాల మధ్య బంధం బలపడేందుకు రెండు ప్రభుత్వాలు నిరంతరం క‌ృషి చేస్తున్నాయని తెలిపింది. భారత్ తో వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకు వెళ్లేందుకు తాము కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావక్కర్లేదని స్పష్టం చేసింది.


ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్(Khalistani Terrorist) హత్య అనంతరం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో(Justine Trudo) ఆ హత్య భారత్ చేయించిందిగా ఆరోపించారు. ఈ ఆరోపణలను ఖండించిన భారత్ తామే హత్య చేయించామనడానికి సాక్ష్యాలు చూపించాలని ప్రశ్నించింది. అలా ఇరు దేశాల మధ్య మాటా మాటా పెరిగి.. దౌత్య సంబంధాలు దెబ్బ తిన్నాయి. అదే టైంలో కెనడా.. అమెరికా మధ్య దగ్గరి సంబంధాలు ఉండటం.. ఇండియాను అగ్రదేశం దూరం పెడుతుందా అనే సందేహాలు లేవనెత్తెలా చేశాయి. ఈ డౌబ్ట్స్‌కి ఫుల్ స్టాప్ పెడుతూ అమెరికా రాయబార కార్యాలయం ఇవాళ ప్రకటన విడుదల చేసింది.

Updated Date - 2023-10-05T18:58:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising