PM Modi: వారణాసితో తమిళ ప్రజల బంధం ప్రత్యేకం..
ABN, Publish Date - Dec 17 , 2023 | 08:54 PM
కన్యాకుమారి, వారణాసి మధ్య నడిచే కాశీ తమిళ్ సంగమం ఎక్స్‌ప్రెస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. తమిళనాడు, వారణాసి ప్రజల మధ్య ప్రత్యేక అనుబంధం ఉందన్నారు.
వారణాసి: కన్యాకుమారి, వారణాసి మధ్య నడిచే కాశీ తమిళ్ సంగమం ఎక్స్‌ప్రెస్ (Kashi Tamil Sangamam Express)ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ఆదివారంనాడిక్కడ జరిగిన కార్యక్రమంలో పచ్చజెండా ఊపి ప్రారంభించారు. తమిళనాడు, వారణాసి ప్రజల మధ్య ప్రత్యేక అనుబంధం ఉందన్నారు. వారణాసి నుంచి తమిళనాడుకు ప్రయాణించడాన్ని మహదేవుడు ఒక ఇంటి నుంచి మరో ఇంటికి వెళ్లడంగా ఆయన అభివర్ణించారు. వారణాసిలో ప్రధాని రెండ్రోజుల పర్యటనలో భాగంగా రూ.19,500 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నారు.
కాగా, ఆదివారంనాడు వారణాసి పర్యటనలో భాంగా 'వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర' ఎగ్జిబిషన్‌ను ప్రారంభించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ప్రభుత్వంతో దేశ ప్రజలంతా కలిసి వికసిత్ సంకల్ప్ యాత్రను విజయవంతానికి తమ వసమయాన్ని వెచ్చిస్తున్నారని, ఎంపీ వారణాసిగా తాను కూడా ఈ కార్యక్రమానికి సమయాన్ని వెచ్చించడం తన బాధ్యత అని అన్నారు. సంకల్ప యాత్రలో పాల్గొన్న వారు అతిథులు కంటే ఎక్కువగా, వారంతా తన కుటుంబ సభ్యులని అన్నారు. కాశీ తమిళ్ సంగమ్‌కు వారినంతా తాను ఆహ్వానిస్తున్నానని చెప్పారు.
మోదీకి స్వాగతం పలికిన యోగి
దీనికి ముందు, యోగి ఆదిత్యనాథ్ ఒక ట్వీట్‌లో ప్రధాని మోదీ వారణాసి పర్యటనకు ఓ ట్వీట్‌లో స్వాగతం పలికారు. నవభారత నిర్మాతకు రాష్ట్రంలోని 25 కోట్ల ప్రజలు అభినందన పూర్వక స్వాగతం పలుకుతున్నారని, రెండ్రోజుల పాటు ప్రధానమంత్రి కాశీ విశ్వనాథుని నగరం (వారణాసి)లో జరిపే పర్యటనలో ఏక్ భారత్-శ్రేష్ట భారత్ స్ఫూర్తితో కాశీ తమిళ్ సంగమం సెకెండ్ ఎడిషన్‌ను ప్రారంభించనున్నారని (కన్యాకుమారి-వారణాసి) తమిళ్ సంగమం రైలును ప్రారంభిస్తారని తెలిపారు.
Updated Date - Dec 17 , 2023 | 08:54 PM