ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Vande Bharat Express: తొమ్మిది వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించిన మోదీ

ABN, First Publish Date - 2023-09-24T15:29:04+05:30

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆదివారంనాడు ప్రారంభించారు. రైల్వే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ దేశవ్యాప్తంగా రైళ్లను అనుసంధానించే లక్ష్యంలో భాగంగా ఈ కొత్త రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రదాని పచ్చజెండా ఊపి ప్రారంభించారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) తొమ్మిది వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను (Vande Bharat Express trains) ఆదివారంనాడు ప్రారంభించారు. రైల్వే ప్రయాణికులకు ప్రపంచ స్థాయి సౌకర్యాలు కల్పిస్తూ దేశవ్యాప్తంగా రైళ్లను అనుసంధానించే లక్ష్యంలో భాగంగా ఈ కొత్త రైళ్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రదాని పచ్చజెండా ఊపి ప్రారంభించారు.


దేశంలోని 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలకు అనుగుణంగా వేగం, మౌలిక వసతుల కల్పనల సమతూకంతో ఈ రైళ్లను ప్రవేశపెడుతున్నట్టు ప్రధాని ఈ సందర్భంగా తెలిపారు. వందేభారత్ రైళ్ల పాపులారిటీ పెరుగుతోందని, ఒక కోటి 11 లక్షల మంది ప్రయాణికులు ఇప్పటికే ఈ రైళ్లలో ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే 25 వందే భారత్ రైళ్లు నడుస్తున్నానని, ఇప్పుడు మరో 9 రైళ్లు ప్రవేశపెడుతున్నామని, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాలకూ ఈ రైళ్లు అనుసంధానించే రోజు ఎంతో దూరంలో లేదని తెలిపారు.


''గత చాలా సంవత్సరాలుగా పలు రైల్వే స్టేషన్లు అభివృద్ధి కాలేదనే విషయం మన అందరికీ తెలుసు. ఆయా స్టేషన్ల అభివృద్ధి పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఆజాదీకీ అమృత్‌కాల్‌లో ఈ పనులు జరుగుతున్నాయి. వీటిని అమృత్ భారత్ స్టేషన్లుగా పిలుస్తున్నాం'' ప్రధాని తెలిపారు. కాగా, కొత్తగా ప్రవేశపెట్టిన 9 రైళ్లు 11 రాష్ట్రాలను అనుసంధానిస్తూ రాకపోకలు సాగించనున్నాయి. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల ద్వారా దేశవ్యాప్తంగా పర్యాటకరంగ అభివృద్ధి మోదీ ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.


కొత్త రైళ్లు ఇవే..

కొత్తగా ప్రవేశపెట్టిన తొమ్మిది రైళ్లలో ఉదయపూర్-జైపూర్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్, తిరునల్వేలి-మదురై-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్, హైదరాబాద్-బెంగళూరు వందే భారత్ ఎక్స్‌ప్రెస్, విజయవాడ-చెన్నై (వయా రేణిగుంట) వందే భారత్ ఎక్స్‌ప్రెస్, పాట్నా-హౌరా వందే భారత్ ఎక్స్‌ప్రెస్, కాసరగాడ్-తిరునల్వేలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్, రూర్కెలా-భువనేశ్వర్-పూరి వందేభారత్ ఎక్స్‌ప్రెస్, రాంచీ-హౌరా వందేభారత్ ఎక్స్‌ప్రెస్, జామ్‌నగర్-అహ్మదాబాద్ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ఉన్నాయి. ఇవి...రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, బీహార్, పశ్చిమబెంగాల్, కేరళ, ఒడిశా, జార్ఖాండ్, గుజరాత్ సహా 11 రాష్ట్రాల మధ్య నడుస్తాయి.

Updated Date - 2023-09-24T15:29:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising