Vande Bharat train: వందేభారత్ రైలు బెళగావి వరకు పొడిగింపు
ABN, First Publish Date - 2023-11-17T13:03:17+05:30
బెంగళూరు సిటీ-ధార్వాడల మధ్య సంచరిస్తున్న వందేభారత్ రైలు(Vande Bharat train)ను బెళగావి వరకు విస్తరించారు. ఈ రైలుకు
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): బెంగళూరు సిటీ-ధార్వాడల మధ్య సంచరిస్తున్న వందేభారత్ రైలు(Vande Bharat train)ను బెళగావి వరకు విస్తరించారు. ఈ రైలుకు ప్ర యాణీకుల నుంచి ఉత్తమ స్పందన లభిస్తోందని ప్ర స్తుతం సీట్ల ఆక్యుపెన్సీ 98 శాతం వరకు ఉందని నైరుతి రైల్వే వెల్లడించింది. బెంగళూరు సిటీ నుంచి ధార్వాడకు గత జూన్‌లో వందేభారత్ రైలును ప్రారంభించిన సంగతి విదితమే. ఈ రైలు సేవలను బెళగావి(Belagavi)కి విస్తరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు కేంద్ర రైల్వేశాఖా మంత్రికి ఇటీవల ఒక వినతి పత్రం కూడా అందజేశారు. బెంగళూరు(Bangalore)లో ప్రతిరోజూ ఉదయం 5-45కు బయల్దేరి హుబ్బళ్ళికి 10-50కు చేరుకోనుంది. తిరిగి హుబ్బళ్ళిలో ఉదయం 10-55కు బయల్దేరి 11-20కు ధార్వాడ చేరుకుంటుంది. అక్కడి నుంచి బెళగావికి మధ్యాహ్నం 1-30 కు చేరుకోనుంది. బెళగావిలో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటలకు బయల్దేరి అదే రోజు రాత్రి 10-10 గంటలకు బెంగళూరు నగరానికి చేరుకుంటుందని రైల్వే వర్గాలు వెల్లడించాయి. వచ్చే సోమవారం నుంచే ఈ రైలు విస్తరణ అమల్లోకి రానుంది.
Updated Date - 2023-11-17T13:03:18+05:30 IST