Vande Bharat Train: ‘వందే భారత్’ రైలు వచ్చేస్తోంది.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే...
ABN, First Publish Date - 2023-08-10T10:43:25+05:30
రాష్ట్రంలో మరో వందే భారత్ రైలు(Vande Bharat Train) పట్టాలెక్కనుంది.
బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మరో వందే భారత్ రైలు(Vande Bharat Train) పట్టాలెక్కనుంది. బెంగళూరు - గోవా మధ్య వయా మంగళూరు(Mangalore) మీదుగా వందేభారత్ రైలు సంచరించనుంది. ఇదే విషయాన్ని దక్షిణకన్నడ ఎంపీ నళిన్‌కుమార్ కటీల్(MP Nalin Kumar Katil) వెల్లడించారు. బుధవారం ఆయన కార్యాలయం నుంచి ఒక ప్రకటన విడుదలైంది. దేశవ్యాప్తంగా అమృత్ భారత్ రైల్వేస్టేషన్ల అభివృద్ధికి ఇటీవల శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. బెంగళూరు - మంగళూరు మధ్య 90కిలో మీటర్ల మేర విద్యుద్దీకరణ పనులు సాగుతున్నాయని, ముగియగానే ‘వందే భారత్’ రైలు సంచరిస్తుందన్నారు. బెంగళూరు నుంచి గోవా దాకా మంగళూరు మీదుగా సంచరింపచేయడం ద్వారా ప్రయాణికులకు అనుకూలంగా ఉంటుందన్నారు.
Updated Date - 2023-08-10T10:49:03+05:30 IST