Vande Bharat Trains: వారాంతపు వందే భారత్ రైళ్లు వచ్చేస్తున్నాయ్.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..
ABN, First Publish Date - 2023-11-29T06:54:24+05:30
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చెన్నై సెంట్రల్ - మైసూరు(Chennai Central - Mysore) మధ్య వారాంతపు వందే భారత్ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ
పెరంబూర్(చెన్నై): ప్రయాణికుల రద్దీ దృష్ట్యా చెన్నై సెంట్రల్ - మైసూరు(Chennai Central - Mysore) మధ్య వారాంతపు వందే భారత్ రైళ్లు నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది. నెం.06037 చెన్నై సెంట్రల్ - మైసూరు వందేభారత్ స్పెషల్(Vande Bharat Special) ఈ నెల 29, డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో ఉదయం 5.50 గంటలకు చెన్నై సెంట్రల్‌లో బయల్దేరి మధ్యాహ్నం 12.20 గంటలకు మైసూరు చేరుకుంటుంది. అలాగే, నెం.06038 మైసూరు - చెన్నై సెంట్రల్ వారాంతపు ప్రత్యేక వందేభారత్ ఈ నెల 29, డిసెంబరు 6, 13, 20, 27 తేదీల్లో మధ్యాహ్నం 1.05 గంటలకు మైసూరులో బయల్దేరి రాత్రి 7.20 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. ఈ రైళ్లు కాట్పాడి, కేఎస్‌ఆర్ బెంగుళూరు స్టేషన్లలో ఆగనున్నాయి.
Updated Date - 2023-11-29T06:54:26+05:30 IST