ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Gyanvapi Case : ‘జ్ఞానవాపి’పై అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తాం : వారణాసి కోర్టు

ABN, First Publish Date - 2023-05-23T18:06:23+05:30

ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు-శృంగార గౌరి ఆరాధన వివాదంపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారణాసి : ఉత్తర ప్రదేశ్‌లోని వారణాసిలో ఉన్న జ్ఞానవాపి మసీదు-శృంగార గౌరి ఆరాధన వివాదంపై దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి విచారిస్తామని వారణాసి కోర్టు మంగళవారం తెలిపింది. గతంలో దాఖలైన ఏడు పిటిషన్లతోపాటు ప్రస్తుతం ఈ మసీదు ప్రాంగణంలో కనిపించిన ‘శివలింగం’ వయసును నిర్థరించేందుకు కార్బన్ డేటింగ్‌ పరీక్షలు చేయాలన్న కోర్టు ఆదేశాలపై దాఖలైన పిటిషన్‌ను కూడా కలిపి విచారిస్తామని తెలిపింది. వేర్వేరు న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న ఏడు పిటిషన్లను వారణాసి జిల్లా కోర్టుకు బదిలీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై విచారణ జరిపి ఈ నిర్ణయం తీసుకుంది.

శృంగార గౌరి-జ్ఞానవాపి కేసులో పిటిషనర్లు లక్ష్మీ దేవి, రేఖా పాఠక్, సీత సాహు, మంజు వ్యాస్ ఈ పిటిషన్లన్నిటినీ కలిపి విచారించాలని కోరారు. జ్ఞానవాపి, ఆది విశ్వేశ్వర్ కేసుల ప్రత్యేక న్యాయవాది రాజేశ్ మిశ్రా మాట్లాడుతూ, ఎదుటి పక్షం అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, ఈ ఏడు పిటిషన్లను కలిపి, ఒకే కోర్టులో విచారించాలని జిల్లా జడ్జి ఏకే విశ్వేశ్ నిర్ణయించినట్లు తెలిపారు.

జిల్లా జడ్జి విశ్వేశ్ ఇచ్చిన ఆదేశాల్లో, ఈ కేసులు వేర్వేరు కోర్టుల్లో పెండింగ్‌లో ఉంటే, పరస్పర విరుద్ధమైన ఆదేశాలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఈ కేసులన్నీ ఒకే కోర్టులో విచారణ జరిగితే, వీటిలో వేర్వేరు, పరస్పర విరుద్ధమైన ఆదేశాలు వచ్చే అవకాశం ఉండదన్నారు. ఒకే కోర్టులో రెండు లేదా అంతకన్నా ఎక్కువ కేసులు పెండింగ్‌లో ఉంటే, న్యాయ ప్రయోజనాల కోసం వీటిని కలిపి విచారించాలని కోర్టు అభిప్రాయపడితే, ఆ విధంగా ఆదేశించవచ్చునని సీపీసీలోని ఆర్డర్ 4ఏ చెప్తోందన్నారు. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా ఈ పిటిషన్లన్నిటినీ కలిపి విచారిస్తామని చెప్పారు.

జ్ఞానవాపి మసీదు ప్రాంగణం మొత్తాన్ని సర్వే చేయాలని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై ముస్లిం పక్షం తన అభ్యంతరాలను సోమవారం వారణాసి జిల్లా కోర్టులో దాఖలు చేసింది.

ముస్లిం పక్షం తరపున వాదనలు వినిపించిన న్యాయవాది మహమ్మద్ తోహిద్ ఖాన్ అన్ని పిటిషన్లను కలిపి విచారించాలని కోరడాన్ని వ్యతిరేకించారు. వీటిని కలిపి విచారించాలనే నిర్ణయం తీసుకోవడానికి తగిన దశ ఇంకా రాలేదని తెలిపారు. అన్ని కేసుల్లోనూ ప్రవేశపెట్టిన సాక్ష్యాధారాలను కోర్టు పరిశీలించి ఉండవలసిందన్నారు. సాక్ష్యాధారాలు ఒకే విధంగా ఉంటే, అన్ని పిటిషన్లను కలిపి విచారించాలని తీర్పు చెప్పడం న్యాయమవుతుందన్నారు.

ఇవి కూడా చదవండి :

Sitting Long Hours: గంటల తరబడి అదే పనిగా కూర్చోవడం స్మోకింగ్ కంటే డేంజరట.. సైడ్ ఎఫెక్ట్స్ ఇవే.

Modi Vs Sisodia : మోదీ దురహంకారి : సిసోడియా

Updated Date - 2023-05-23T18:06:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising