ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

PM Modi In US: ప్రధాని మోదీకి బైడెన్ విందు..స్పెషల్స్ ఇవే..!

ABN, First Publish Date - 2023-06-22T12:54:10+05:30

ప్రధాని మోదీకోసం అమెరికా అధ్యక్షుడు ప్రధాని మోదీ అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. జో బైడెన్ దంపతులు ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. విందు ఏర్పాట్లను ఫస్ట్ లేడీ జిల్ బైడెన్ స్వయంగా పర్వవేస్తున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రధాని మోదీ(PM Modi) అమెరికాలో(America) పర్యటిస్తున్న విషయం తెలిసిందే. పర్యటనలో భాగంగా వైట్ హౌజ్(White House)చేరుకున్న మోదీకి జో బైడెన్ దంపతులు ఘనస్వాగతం పలికారు. అనంతరం ప్రధాని మోదీ(PM Modi), జోబైడెన్(Joe Biden) సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్- అమెరిక రక్షణ సహకారంపై చర్చలు జరిపారు. ప్రధాని మోదీకోసం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ దంపతులు ప్రత్యేక విందును(Lavish Dinner) ఏర్పాటు చేశారు. విందు ఏర్పాట్లను ఫస్ట్ లేడీ జిల్ బైడెన్(Jill Biden) స్వయంగా పర్వవేస్తున్నారు. రుచికరమైన శాఖాహార వంటలను సిద్ధం చేయాలని చీఫ్ చెఫ్ నీనా కర్టెస్‌కు జిల్ బైడెన్ ఆదేశించారు. భారత ప్రధాని మోదీ శాఖాహారి కావడంతో పూర్తిగా శాఖాహార వంటకాలు ఏర్పాటు చేశారు.

సంగీత కార్యక్రమం

గురువారం రాత్రి (భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం) ప్రధాని మోదీ గౌరవార్ధం బైడెన్ దంపతులు అధికారిక విందును ఏర్పాటు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ కార్యక్రమంలో గ్రామీ అవార్డ్ విన్నర్ జోషువా బెల్, దక్షిణాసియా మ్యూజిక్ గ్రూప్ పెన్ మాసలాల సంగీత ప్రదర్శన ఉంటుందని జిల్ బైడెన్ తెలిపారు. మోదీకి అందిస్తున్న ఆతిథ్యం గురించి ఆమె యూఎస్ మీడియాకు వివరించారు. విందు అనంతరం ఈ సంగీత కార్యక్రమం టుందన్నారు.

భారతీయ జెండా రంగులతో పూలు

విందు జరిగే ప్రదేశం అమెరికా, భారత దేశ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా ఉంటుందని జిల్ బైడెన్ తెలిపారు. భారత జాతీయ జెండాలోని రంగులైన తెలుపు, ఆకుపచ్చ, కాషాయ రంగులను ప్రతిబింబించేలా ఆయా రంగుల పూలను ప్రతీ టేబుల్ పై అలంకరిస్తామని వెల్లడించారు. ప్రపంచంలోని అత్యంత పురాతన ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోని అత్యంత పెద్దదైన ప్రజాస్వమ్య దేశం.. ఈ రెండింటి కలయిక అని ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా పర్యటనను జిల్ బైడెన్ అభివర్ణించారు.

Updated Date - 2023-06-22T12:54:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising