ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Modi letter MP voter: మధ్యప్రదేశ్ ఓటర్లకు ప్రధాని లేఖ... చౌహాన్ భవితవ్యంపై సస్పెన్స్..!

ABN, First Publish Date - 2023-10-20T17:09:35+05:30

మధ్యప్రదేశ్ ఎన్నికల్లో ఓటరు తీర్పుపై ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. గెలుపు కోసం అందివచ్చిన ఏ అవకాశాన్నీ ప్రధాన పార్టీలు వదులుకోకపోవడం లేదు. మధ్యప్రదేశ్‌లో గెలుపు ద్వారా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో గట్టి పట్టు సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ ఓటర్లకు ప్రధాని ఒక బహిరంగ లేఖ రాశారు.

భోపాల్: మధ్యప్రదేశ్ (Madhya pradesh) ఎన్నికల్లో ఓటరు తీర్పుపై ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఉత్కంఠ పెరుగుతోంది. గెలుపు కోసం అందివచ్చిన ఏ అవకాశాన్నీ ప్రధాన పార్టీలు వదులుకోకపోవడం లేదు. మధ్యప్రదేశ్‌లో గెలుపు ద్వారా రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో గట్టి పట్టు సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ పట్టుదలగా ఉన్నారు. ఇందులో భాగంగా మధ్యప్రదేశ్ ఓటర్లకు ప్రధాని ఒక బహిరంగ లేఖ రాశారు. ఒకవైపు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్‌ను ప్రశంసిస్తూనే, తన పేరు (మోదీ) మీద ఓటు వేయాలని ఓటర్లను ఆ లేఖలో ప్రధాని కోరారు. దీంతో సీఎంను ప్రశంసించడం, పీఎంను చూసి ఓటేయమనడంలో మోదీ ఆంతర్యం ఏమై ఉండవచ్చనే విషయంపై రాజకీయ పండితులు విశ్లేషణలో పడ్డారు.


మోదీ తన లేఖలో ఏమన్నారు?

మోదీ తన లేఖలో మధ్యప్రదేశ్ రాష్ట్రంపై తనకున్న అనుబంధాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. 2014, 2019 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని మరిచిపోలేనని అన్నారు. ప్రజలు ఇచ్చిన బలమైన తీర్పుతోనే అస్వస్థతతో కూడిన రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపామని, సమర్ధవంతమైన నాయకత్వం వల్లే ఇది సాధ్యమైందన్నారు. బీజేపీ మరోసారి పటిష్ట ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రజలు ఇదే నమ్మకాన్ని కనబరుస్తారన్న ఆశాభావాన్ని మోదీ వ్యక్తం చేశారు. సీఎం శివరాజ్ చౌహాన్ సాధించిన విజయాలను ప్రధాని ప్రశంసిస్తూనే, మోదీ పేరు చూసి ఓటువేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


మధ్యప్రదేశ్ రాజకీయ చరిత్రను ఒకసారి చూస్తే, గత రెండు దశాబ్దాల్లో అనేక ట్విస్టులు, మలుపులు కనిపిస్తాయి. రాష్ట్రాన్ని 15 ఏళ్లుగా పాలించిన కాంగ్రెస్‌ నుంచి బీజేపీ అధికారం దక్కించుకోవడంతో అప్పట్లో ఉమాభారతి సీఎంగా పగ్గాలు చేపట్టారు. అయితే లీగల్ చిక్కులు ఎదురవుతుండతో ఆమె పదవి నుంచి దిగిపోయారు. ఆసక్తికరంగా 2005లో శివరాజ్ సింగ్ చౌహాన్ సీఎం అయ్యారు. ప్రజల నాడి పట్టుకోవడంలో సమర్ధుడైన శివరాజ్ సింగ్ గట్టి సీఎంగా నిలదొక్కుకున్నారు. ప్రజలంతా ఆప్యాయంగా "మామా'' అనే పిలిచేంత దగ్గరయ్యారు. 2008, 2013 అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి బీజేపీ విజయాలు సాధించింది. 2018లో మెజారిటీ కంటే ఒకింత ఎక్కువ సీట్లు కాంగ్రెస్ సాధించడంతో అధికారంలోకి వచ్చింది. అయితే, రాజకీయ పరిణామాల నేపథ్యంలో బీజేపీ తిరిగి అధికారంలోకి వచ్చింది. శివరాజ్ సీఎంగా మరోసారి పగ్గాలు చేపట్టారు. అయితే ఈసారి మాత్రం శివరాజ్‌కు సొంత పార్టీ నుంచే గట్టి పోటీదారులు కనిపిస్తున్నారు. నరేంద్ర సింగ్ తోమర్, జ్యోతిరాదిత్య సింధియా, నరోత్తమ్ మిశ్రా వంటి దిగ్గజ నేతలు తమ ఉనికిని బలంగా చాటుకుంటున్నారు. ఈ క్రమంలో శివరాజ్‌‌కు ఎలాంటి ప్రాధాన్యం ఉండబోతోందనే ఊహాగానాలు కూడా గత కొంతకాలంగా వినిపిస్తున్నాయి. శివరాజ్‌ను బహిరంగ ప్రదర్శనల్లో మోదీ ప్రశంసించిన సందర్భాలు కూడా ఇటీవల అంతగా లేవనే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మోదీ లేఖ మరిన్ని ఊహాగానాలకు తావిస్తోంది. శివరాజ్‌ను ప్రశంసిస్తూనే, తన పేరు చూసి ఓటేయమని మోదీ కోరడంలో ఆంతర్యం ఏమిటనేది దానిపై ప్రస్తుతం విశ్లేషణలు జరుగుతున్నాయి. మధ్యప్రదేశ్ ఎన్నికల తర్వాత శివరాజ్ సింగ్ పొజిషన్‌పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2023-10-20T17:10:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising