ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Opposition unity: ఒంటరిగానే తేల్చుకుంటాం: టీఎంసీ

ABN, First Publish Date - 2023-07-02T19:51:45+05:30

పశ్చిమబెంగాల్‌లో సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే సత్తా తమకు ఉందని, విపక్షాల ఐక్యతా కూటమి అవసరం లేదని తృణమూల్ కాంగ్రెస్ తెగేసి చెప్పింది. బీజేపీ సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమికి వ్యతిరేకంగా విపక్షాల జాతీయ కూటమి ఏర్పాటుకు విపక్ష దిగ్గజనేతలు విస్తృత ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో టీఎంసీ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసి గెలిచే సత్తా తమకు ఉందని, విపక్షాల ఐక్యతా కూటమి (Rainbow Alliance) అవసరం లేదని తృణమూల్ కాంగ్రెస్ (TMC) తెగేసి చెప్పింది. బీజేపీ సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి (NDA)కు వ్యతిరేకంగా విపక్షాల జాతీయ కూటమి ఏర్పాటుకు విపక్ష దిగ్గజనేతలు విస్తృత ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో టీఎంసీ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.

టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ ఆదివారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ, పశ్చిమబెంగాల్‌కు జరిగే పార్లమెంటు ఎన్నికల్లో విపక్షాల ఐక్య కూటమి అవసరం లేకుండానే ఒంటరిగా పోటీ చేసే సత్తా తమ పార్టీకి అందని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కేంద్ర బలగాల మోహరింపు విషయంలో టీఎంసీకి, ప్రధాన విపక్షమైన బీజేపీకి మధ్య జరుగుతున్న మాటల యుద్ధంపై ఆయన ఘాటుగా స్పందించారు. రాష్ట్రంలో కేంద్ర బలగాలను ఎక్కడెక్కడ మోహరించాలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత ముజుందార్ నిర్దేశించాల్సిన అవసరం లేదన్నారు. పశ్చిమబెంగాల్ ఎన్నికల్లో కేంద్ర బలగాల మోహరింపుపై కోల్‌కతా హైకోర్టు ఆదేశాలిచ్చిందని, ఆ ఆదేశాలు అమలు చేసేందుకు టీఎంసీ ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్ (ఎస్‌ఈసీ) కట్టుబడి ఉన్నాయని చెప్పారు. ఎక్కడెక్కడ అవసరమో అక్కడ కేంద్ర పారా మిలటరీ బలగాలను ఎస్ఈసీ మోహరిస్తుందని, సుకాంత్ మజుందార్ నిర్దేశించాల్సిన పనిలేదని అన్నారు. ఇందుకు సంబంధించిన నిర్ణయాధికారం ఎస్‌ఈసీకి ఉంటుందని సౌగర రాయ్ చెప్పారు.

13,14 తేదీల్లో బెంగళూరులో విపక్ష పార్టీల సమావేశం

విపక్షాల ఐక్యతా కూటమి యత్నాల్లో భాగంగా పాట్నాలో గత నెలలో విపక్ష పార్టీల సమావేశం జరగగా, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ సైతం బీజేపీపై పోరుకు ఐక్యకూటమి అవసరాన్ని బలంగా చెప్పారు. విపక్ష పార్టీలన్నీ తమ మధ్య ఉన్న విభేదాలను పక్కనపెట్టి వచ్చే ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీపై ఐక్యపోరాటానికి సిద్ధం కావాలని సమావేశానంతరం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. ఐక్యతా కూటమి ఏర్పాటు యత్నాల్లో భాగంగా తదుపరి సమావేశం బెంగళూరులో జూలై 13,14 తేదీల్లో జరుగనుంది.

Updated Date - 2023-07-02T20:03:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising