ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

West Bengal polls: టీఎంసీ అభ్యర్థి విజయకేతనం

ABN, First Publish Date - 2023-09-08T16:11:38+05:30

లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లా ధూప్‌గురి అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ పెట్టుకున్న ఆశలపై తృణమూల్ కాంగ్రెస్ నీళ్లుచల్లింది. ధూప్‌‌గురి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్ 4,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు.

కోల్‌కతా: లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పశ్చిమబెంగాల్‌లోని జల్‌పాయ్‌గురి జిల్లా ధూప్‌గురి (Dhupguri) అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ (BJP) పెట్టుకున్న ఆశలపై తృణమూల్ కాంగ్రెస్ (TMC) నీళ్లుచల్లింది. ధూప్‌‌గురి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ అభ్యర్థి నిర్మల్ చంద్ర రాయ్ 4,000 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. 2021లో జమ్మూకశ్మీర్‌లో జరిపిన ఉగ్రదాడిలో మృతిచెందిన సీఆర్‌పీఎఫ్ జవాన్ భార్య తపసి రాయ్ ఇక్కడ బీజేపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ మద్దతుగా ఎన్నికల బరిలోకి దిగిన సీపీఎం అభ్యర్థి ఐశ్వర్ చంద్ర రాయ్ మూడో స్థానంలో నిలిచారు.


విద్వేష రాజకీయాలపై విజయం: అభిషేక్ బెనర్జీ

ధూప్‌గురి అసెంబ్లీ నియోజకవర్గంలో టీఎంసీ గెలుపుపై ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ హర్షం వ్యక్తం చేశారు. విద్వేష, వివక్ష రాజకీయలపై అభివృద్ధి రాజకీయాలనే గెలుపు వరించిందన్నారు. ప్రజలతో మమేకపై అవిశ్రాంతంగా పనిచేసిన ఏఐటీసీ కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ధూప్‌గురి సర్వతోముఖాభివృద్ధికి అన్నివిధాలా తాము పనిచేస్తామని చెప్పారు.


బీజేపీ ఎమ్మెల్యే బిష్ణు పద రాయ్ గత జూలై 25న కన్నుమూయడంతో ధూప్‌గురి నియోజకవర్గానికి సెప్టెంబర్ 5న ఎన్నిక జరిగింది. 78 శాతం ఓటింగ్ నమోదైంది. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య నార్త్ బెంగాల్ యూనివర్శిటీ జల్‌పాయ్‌గురి-2 క్యాంపస్‌లో శుక్రవారం ఓట్ల లెక్కింపు జరిగింది.

Updated Date - 2023-09-08T16:11:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising