Former Indian cricketer Venkatesh Prasad: పాక్‌లో ఉగ్ర దాడిపై వెంకటేష్ ప్రసాద్ సంచలన ట్వీట్
ABN, First Publish Date - 2023-02-18T09:04:36+05:30
పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ శసంచలన ట్వీట్ చేశారు....
హైదరాబాద్ : పాకిస్థాన్ దేశంలోని కరాచీ పోలీసు చీఫ్ కార్యాలయంపై ఉగ్రవాదులు దాడి చేసిన తర్వాత భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ శనివారం తెల్లవారుజామున సంచలన ట్వీట్ చేశారు.(Former Indian cricketer Venkatesh Prasad) పొరుగు దేశమైన పాకిస్థాన్ లో మరో ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత భారత మాజీ క్రికెటర్ వెంకటేష్ ప్రసాద్ పాకిస్థాన్(Pakistan) ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఇది కూడా చదవండి : Cheetahs: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కార్గో విమానంలో కునో నేషనల్ పార్కుకు వస్తున్న ఆఫ్రికన్ చీతాలు
‘‘మీరు టెర్రరిస్టులను(Terrorist) పెంచినప్పుడు ఉగ్రవాదుల దాడులను ఎలా ఆపుతారని వెంకటేష్ ప్రసాద్ ప్రశ్నించారు. ఉగ్రవాదులు భారీ తుపాకులతో కరాచీ పోలీస్ చీఫ్ కార్యాలయంలోకి ప్రవేశించి కాల్పులు ప్రారంభించారు.(Karachi Terrorist Attack) ఈ కాల్పుల్లో ఐదుగురు ఉగ్రవాదులు, మరో నలుగురు పోలీసులు మరణించారు.ఉగ్రవాదులకు పాక్ భద్రతా బలగాలు ధీటుగా బదులిచ్చాయని కరాచీ పోలీసులు ట్వీట్ చేశారు. కార్యాలయంలో దాదాపు నాలుగు గంటల పాటు ఉగ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్ కొనసాగింది. కరాచీ దాడులపై పాకిస్థానీ జర్నలిస్ట్ చేసిన ట్వీట్‌ను పంచుకుంటూ, ఉగ్రవాదులను పాక్ దేశంలో పెంచడం కొనసాగించినట్లయితే, పాకిస్తాన్ ఎప్పటికీ అలాంటి చర్యల నుంచి తప్పించుకోలేదని భారత మాజీ పేసర్ ప్రసాద్ ట్వీట్ లో పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : Amazon: మే నుంచి వారానికి 3రోజులు వర్క్ ఫ్రం ఆఫీస్...అమెజాన్ ప్రకటన
ఏ విషయంలోనూ నోరు మెదపని పేరున్నవెంకటేష్ ప్రసాద్.. ప్రాణాలు కోల్పోయినవారి పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మీరు ఉగ్రవాదాన్ని పెంచినప్పుడు, ఇది తిరిగి వస్తుంది. దేశం ఉగ్రవాదంపై అసహనంతో ఉండలేక ప్రాణాలు కోల్పోతున్న అమాయకులను చూసి బాధపడండి’’ అని ప్రసాద్ ట్వీట్ చేశారు.
Updated Date - 2023-02-18T09:04:38+05:30 IST