Google: కోహ్లీ, రోహిత్ కాదు.. ఈ ఏడాది గూగుల్ సెర్చ్‌లో టాప్ భారత సెలబ్రెటీలు వీళ్లే!
ABN, Publish Date - Dec 30 , 2023 | 02:06 PM
2023 సంవత్సరానికి ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలాయి. మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరం 2024 రాబోతుంది. దీంతో 2023 సంవత్సరం మొత్తంలో చోటుచేసుకున్న ఆసక్తికర విషయాలను అందరూ ఒకసారి నెమరువేసుకుంటున్నారు.
2023 సంవత్సరానికి ఇంకొన్ని గంటలు మాత్రమే మిగిలాయి. మరికొన్ని గంటల్లో నూతన సంవత్సరం 2024 రాబోతుంది. దీంతో 2023 సంవత్సరం మొత్తంలో చోటుచేసుకున్న ఆసక్తికర విషయాలను అందరూ ఒకసారి నెమరువేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ కూడా కొన్ని ఆసక్తికర విషయాలను వినియోగదారులతో పంచుకుంది. 2023 సంవత్సరంలో భారతీయుల పరంగా గూగుల్‌లో అత్యధిక మంది సెర్చ్ చేసిన వ్యక్తులు ఎవరనే జాబితాను విడుదల చేసింది. ఆశ్చర్యరంగా ఈ జాబితాలో టాప్ 10లో టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ ఈ జాబితాలో మొదటి స్థానం దక్కించుకుంది. సహచర బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను కియారా ఈ ఏడాది వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి వివాహం గురించి నెటిజన్లు గూగుల్‌లో తెగ ఆరా తీశారు. దీంతో కియారా అద్వానీ మొదటి స్థానాన్ని కైవసం చేసుకుంది.
రెండో స్థానంలో టీమిండియా యువ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కింది. ఈ ఏడాది గిల్ అత్యుత్తమంగా రాణించాడు. మూడో స్థానంలో భారత సంతతికి చెందిన న్యూజిలాండ్ యువ బ్యాటర్ రచిన్ రవీంద్ర ఉన్నాడు. ఈ ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో దుమ్ములేపిన ఈ యువ క్రికెటర్ గురించి తెలుసుకోవడానికి నెటిజన్లు గూగుల్‌లో తెగ వెతికారు. నాలుగో స్థానంలో టీమిండియా సీనియర్ పేస్ బౌలర్ మహ్మద్ షమీ ఉన్నాడు. ఈ ఏడాది భారత్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్‌లో షమీ దుమ్ములేపాడు. ఐదో స్థానంలో ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్‌కు చోటు దక్కకపోవడం గమనార్హం. ఆరో స్థానంలో బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్ర, ఏడో స్థానంలో ఆస్ట్రేలియా క్రికెటర్ గ్లెయిన్ మాక్స్‌వెల్, ఎనిమిదో స్థానంలో మాజీ ఫుట్‌బాల్ ఆటగాడు డేవిడ్ బెక్హాం, తొమ్మిదో స్థానంలో టీమిండియా మిస్టర్ 360 డిగ్రీస్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్, పదో స్థానంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ట్రావిస్ హెడ్ ఉన్నాడు.
Updated Date - Dec 30 , 2023 | 02:26 PM