ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Parliament deadlock: ప్రధాని ఎందుకు ముఖం చాటేస్తున్నారు..?

ABN, First Publish Date - 2023-07-24T18:39:34+05:30

మణిపూర్ హింసాకాండపై చర్చ విషయంలో తలెత్తిన ప్రతిష్ఠంభన కొనసాగడంపై కాంగ్రెస్ పార్టీ ఘాటు విమర్శలు గుప్పించింది. ఈ అంశంపై ప్రధానమంత్రి ప్రకటన చేయాలన్న విపక్షాల డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పకోకపోవడం లేదని తెలిపింది. ప్రధాని ముఖం చాటేస్తున్నారని ఆరోపించింది.

న్యూఢిల్లీ: మణిపూర్ (Manipur) హింసాకాండపై చర్చ విషయంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల మధ్య తలెత్త ప్రతిష్ఠంభన మూడోరోజైన సోమవారం కూడా కొనసాగడంపై కాంగ్రెస్ (Congress) పార్టీ ఘాటు విమర్శలు గుప్పించింది. ఈ అంశంపై ప్రధానమంత్రి ప్రకటన చేయాలన్న విపక్షాల డిమాండ్‌కు ప్రభుత్వం ఒప్పకోకపోవడం వల్లే ఈ ప్రతిష్ఠంభన కొనసాగుతోందని తెలిపింది. మణిపూర్ ప్రజలు, దేశ ప్రజల మనోభావాలను ప్రతిపక్షాలు ప్రతిబింబిస్తున్నాయని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ అన్నారు.


"మణిపూర్‌లో మే 3వ తేదీ తరువాత పరిస్థితిపై సభలో ప్రధాన మంత్రి సమగ్ర ప్రకటన చేయాలని విపక్షాల (INDIA parties) డిమాండ్‌గా ఉంది. అయితే ఇందుకు ప్రభుత్వం నిరాకరిస్తోంది. ప్రజల మనోభావాలకు అద్దం పట్టేందుకు మాత్రమే విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. సభలో మాట్లాడేందుకు ప్రధాని ఎందుకు ముఖం చాటేస్తున్నారు?'' అని జైరామ్ రమేష్ ప్రశ్నించారు. సోమవారం పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందు కూడా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి తన బాధ్యతల నుంచి తప్పించుకోజాలరని అన్నారు. ప్రధాని చర్యను యావద్దేశం నిశితంగా గమనిస్తోందన్నారు. మణిపూర్ ఘటనపై ఎంపీలు తమ ఆవేదనను వ్యక్తం చేసి, బాధితులకు స్వాంతన కలిగించాలని కోరేందుకు చర్చ ఉపకరిస్తుందని, చర్చ అనంతరం మణిపూర్ పరిస్థితులపై ప్రధాని సమగ్ర ప్రకటన చేయాలని మాత్రమే INDIA పార్టీలు కోరుతున్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బాధ్యత నుంచి తప్పించుకునేందుకు మోదీ 5D (డినైస్, డిస్టార్ట్స్, డైవర్ట్స్, డిఫ్లెక్ట్స్, డీఫేమ్స్) డ్రామాలు సరికాదని జైరామ్ రమేష్ ఒక ట్వీట్‌లో పేర్కొన్నారు.


మణిపూర్ అంశంపై స్వల్ప కాలిక చర్చకు ప్రభుత్వం సుముఖంగా ఉండగా, విపక్ష పార్టీలు మాత్రం సభా కార్యక్రమాలను రద్దు చేసి పూర్తి స్థాయి చర్చ జరపాలని, ప్రధాని సభకు హాజరై చర్చ అనంతరం సమగ్ర ప్రకటన చేయాలని పట్టుబడుతున్నాయి. ఇందుకు ప్రభుత్వం నిరాకరిస్తోంది. విపక్షాలు ఏదో సాకుతో చర్చ జరగనీయకుండా చేస్తున్నాయని అధికార పక్షం వాదిస్తుండగా, ప్రభుత్వం తన బాధ్యత నుంచి తప్పించుకునేందుకు, అసల విషయాన్ని పక్కదారి పట్టించేందుకు కంకణం కట్టుకుందని విపక్షాలు ఆక్షేపిస్తున్నాయి.


ప్రధాని ఎందుకు ఇలా చేస్తున్నారో?: ఖర్గే

మణిపూర్ హింసాకాండపై చర్చ కోరిన ఆప్ నేత సంజయ్ సింగ్‌పై సస్పెన్షన్ వేటు వేయడం, నిబంధనల ప్రకారం చర్చకు ప్రభుత్వం ఎందుకు అనుమతించడం లేదో అర్ధం కావడం లేదని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే అన్నారు. ''వివిధ అంశాలపై పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలపడం ఇదేమీ మొదటిసారి కాదు. ప్రజాప్రతినిధులు తరచు ఆ పని చేస్తుంటారు. ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్ర్యం అంటే ఇదే. కానీ ప్రభుత్వ ఉద్దేశం మాత్రం ఏదో ఒకరూపంలో ప్రశ్నించే గొంతులను అణిచివేయాలనుకుంటోంది. సభానిబంధనల ప్రకారం మేము చర్చను కోరుతున్నాం. ప్రభుత్వం ఒప్పుకోవడం లేదు. మణిపూర్ అంశం చాలా కీలకమైన విషయం. చిన్న విషయం ఏమీ కాదు. దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో ప్రధాని చెప్పాలి. ఆయన ఎందుకు ఆ పని చేయడం లేదో అర్ధం కావడం లేదు'' అని ఖర్గే అన్నారు.

Updated Date - 2023-07-24T19:24:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising