ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Maharashtra: ఆగస్టు 10 తర్వాత సీఎం మార్పు... ఫడ్నవిస్ ఏమన్నారంటే..?

ABN, First Publish Date - 2023-07-24T21:36:14+05:30

మహారాష్ట్ర ముఖ్యమంత్రి మారబోతున్నారని, ఆగస్టు 10వ తర్వాత ఏ రోజైనా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే స్థానంలో ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ సీఎం కాబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సోమవారంనాడు స్పందించారు. సీఎం మార్పుకు అవకాశం లేదని అన్నారు.

ముంబై: మహారాష్ట్ర (Maharashtra) ముఖ్యమంత్రి మారబోతున్నారని, ఆగస్టు 10వ తర్వాత ఏ రోజైనా ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) స్థానంలో ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ (Ajit Pawar) సీఎం కాబోతున్నారంటూ వస్తున్న ఊహాగానాలపై ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ (Devendra Fadnavis) సోమవారంనాడు స్పందించారు. సీఎం మార్పుపై కాంగ్రెస్ నేత పృధ్వీరాజ్ చవాన్, శివసేన (UBT) చౌహాన్ చేసిన వ్యాఖ్యలను కొట్టివేశారు. ఈమధ్య కాలంలో పలువురు సీనియర్ నేతలు ఏవేవో ఊహాగానాలు చేస్తున్నారని, వాళ్లు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చని అన్నారు. 'మహా యుతి అలయెన్స్' ఏర్పడినప్పుడు మూడు పార్టీలకు చెందిన ముగ్గురు నాయకులు చాలా స్పష్టంగా ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రిగా కొనసాగుతారనే అవగాహనకు వచ్చారని చెప్పారు. ఈ విషయంలో ఎంలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు.


''కూటమిలో పెద్ద పార్టీ నేతగా చాలా స్పష్టంగా ఒక విషయం చెప్పదలచుకున్నాను. నాయకత్వ మార్పు అనేది లేనేలేదు. ఇందులో ఎవరికీ సందేహం అక్కర్లేదు. విపక్షాలు గందరగోళం సృష్టించాలనుకుంటే గాలిపటం ఎగురవేసినట్టే. వాళ్ల గాలిపటం కిందకే వస్తుంది'' అని ఫడ్నవిస్ చెప్పారు.


పృధ్వీరాజ్ చవాన్ ఏమన్నారు?

దీనికి ముందు, మహారాష్ట్ర సీఎంగా అజిత్ పవార్ పగ్గాలు చేపట్టనున్నట్టు కాంగ్రెస్ నేత పృధ్వీరాజ్ చహాన్ ఇంతకు ముందు వ్యాఖ్యానించారు. దీనిపై ఆయనను ప్రశ్నించగా, తనకు ఆ విషయం ఎవరు చెప్పారనేది వెల్లడించలేనని అన్నారు. విశ్లేషణపరమైన సమాచారం ఇదని, ఏక్‌నాథ్ షిండే గ్రూప్‌పై ఉన్న ఫిరాయింపుల వ్యవహారంపై స్పీకర్ 90 రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందన్నారు. షిండే గ్రూప్ రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను ఉల్లంఘించినందున వారిపై వేటు తప్పదని, అప్పుడు సీఎం స్థానం ఖాళీ అవుతుందని చెప్పారు. షిండే తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రధానమంత్రిని కలవడం చూసినప్పుడు కూడా ఇది ఆయన వీడ్కోలు సమావేశమనే అభిప్రాయం కలుగుతుందన్నారు.


సంజయ్ రౌత్‌దీ ఇదేమాట..

కాగా, మహారాష్ట్రకు కొత్త ముఖ్యమంత్రి రాబోతున్నారని శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్ సైతం కొద్దిరోజుల క్రితం మీడియాకు తెలిపారు. అజిత్ పవార్‌ను ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో తీసుకోవడమనేది ఏక్‌నాథ్ షిండే తన సీఎం పదవిని కోల్పోనున్నారనడానికి సంకేతమని చెప్పారు.

Updated Date - 2023-07-24T21:36:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising