Savarkar Grandson: క్షమాపణ చెప్పకుంటే రాహుల్‌ గాంధీపై ఎఫ్ఐఆర్..

ABN, First Publish Date - 2023-03-28T15:30:14+05:30

సావర్కర్‌పై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సద్దుమణగ లేదు. తాజాగా వీర్ సావర్కర్ మనుమడు రంజిత్ సావర్కర్ ..

Savarkar Grandson: క్షమాపణ చెప్పకుంటే రాహుల్‌ గాంధీపై ఎఫ్ఐఆర్..
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

న్యూఢిల్లీ: సావర్కర్‌(Savarkar)పై రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా సద్దుమణగ లేదు. తాజాగా వీర్ సావర్కర్ మనుమడు రంజిత్ సావర్కర్ (Ranjit Savarkar) రాహుల్ వ్యాఖ్యలపై కన్నెర్ర చేశారు. సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలకు రాహుల్ క్షమాపణ చెప్పకుంటే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తానని చెప్పారు.

''సావర్కర్‌పై చేసిన ప్రకటనకు రాహుల్ క్షమాపణ చెప్పాలి. లేదంటే ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తాం. వీర్ సావర్కర్‌ను అవమానపరచేలా రాహుల్, కాంగ్రెస్ పార్టీ వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. క్షమాపణ చెప్పడానికి బదులు, రాహుల్ పదేపదే ఈతరహా వ్యాఖ్యలు చేస్తున్నారు'' అని రంజిత్ సావర్కర్ అన్నారు. ఉద్ధవ్ థాకరే మహారాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు సావర్కర్‌పై కాంగ్రెస్ మౌత్‌పీస్ కించపరచే వ్యాఖ్యలు చేసిందని, ఇదే విషయాన్ని ఉద్ధవ్ థాకరే దృష్టికి తీసుకువెళ్లానని, శివసేన భాగస్వామ్య పార్టీ నేత రాహుల్‌ గాంధీ చేత క్షమాపణ చెప్పించాలని కోరానని చెప్పారు. అయితే, ఉద్ధవ్ కూడా చేసిందేమీ లేదని అన్నారు.

దాదర్ పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే తాను రెండు ఫిర్యాదులు నమోదు చేశానని రంజిత్ సావర్కర్ తెలిపారు. ఐదేళ్ల క్రితం వీడీ సావర్కర్‌ను దేశద్రోహి అని ఆయన (రాహుల్) పిలిచారని, దానిపై రాహుల్‌కు నోటీసు పంపాలని పోలీస్ స్టేషన్‌కు కోర్టు ఆదేశాలిచ్చిందని అన్నారు. భారత్ జోడో యాత్రలోనూ సావర్కర్‌పై రాహుల్ చేసిన వ్యాఖ్యలపై మరోసారి తాను ఫిర్యాదు చేశానని చెప్పారు. సావర్కర్ పేరు పదేపదే కించపరచకుండా సమస్యకు పరిష్కారం కావాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. కోర్టుల ద్వారా పరిష్కారం కోరతామన్నారు. బ్రిటిష్ పాలకుల ముందు సావర్కర్ క్షమాపణ చెప్పాడనటానికి ఆధారాలు లేవని రింజిత్ సావర్కర్ వివరించారు.

నాపేరు సావర్కర్ కాదు...

లండన్‌లో చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెబుతారా అని ఈనెల 25న రాహుల్ గాంధీని మీడియా అడిగిన ఓ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ, తాను సావర్కర్‌ను కాదని, తన పేరు గాంధీ అని, ఎవరికీ క్షమాపణ చెప్పేది లేదని అన్నారు. సావర్కర్ పేరును రాహుల్ ప్రస్తావించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.

Updated Date - 2023-03-28T15:30:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising