ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Shaktikanta Das: రూ.1000 నోట్లు రాబోతున్నాయా? శక్తికాంత్ దాస్ ఏమన్నారంటే..!

ABN, First Publish Date - 2023-05-22T15:34:28+05:30

న్యూఢిల్లీ: రూ.2,000 నోట్లను మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకోవడంతో కొత్తగా రూ.1000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తిరిగి ప్రవేశపెట్టనుందా? దీనిపై ఆర్బీఐ గవర్నర్ తాజా ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. రూ.1,000 నోట్లు తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టాలనే ఆలోచన ప్రస్తుతానికి ఏదీ తమవద్ద లేదని చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: రూ.2,000 నోట్లను మార్కెట్‌ నుంచి ఉపసంహరించుకోవడంతో కొత్తగా రూ.1000 నోట్లను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) తిరిగి ప్రవేశపెట్టనుందా?

ఈనెల 23తో రూ.2,000 నోట్లు మార్పిడి ప్రారంభమై, సెప్టెంబర్ 30 వరకూ ఈ వెసులుబాటు ఉంటుందని ఆర్బీఐ ప్రకటించింది. ఈ నేపథ్యంలో బ్యాంకుల్లో జమ అయ్యే రూ.2 వేల నోట్లకు సరిపడా ఇతర డిమానిషన్ నోట్లు బ్యాంకులు అందజేయాల్సి ఉంటుంది. ఇందుకు తగినిన్ని నోట్లు అందుబాటులో ఉన్నాయా? లేదా డిమాండ్‌కు అనుగుణంగా రూ.1000 కొత్త నోట్లను మార్కెట్‌లోకి ఆర్బీఐ మళ్లీ తీసుకురానుందా అనే చర్చ జరుగుతోంది. దీనిపై ఆర్బీఐ గవర్నర్ తాజా ఇంటర్వ్యూలో స్పష్టత ఇచ్చారు. రూ.1,000 నోట్లు తిరిగి మార్కెట్లోకి ప్రవేశపెట్టాలనే ఆలోచన ప్రస్తుతానికి ఏదీ తమవద్ద లేదని చెప్పారు.

రూ.2 వేల నోట్ల మార్పిడికి అవసరమైన ఇతర డిమానినేషన్ల నోట్లు తగినన్ని ఉన్నాయని, రూ.500 నోట్లను అవసరాన్ని బట్టి ప్రింట్ చేస్తామని శక్తికాంత దాస్ చెప్పారు. రూ.2 వేల నోట్ల మార్పిడికి అవసరమైన కరెన్సీని అందుబాటులో ఉంచుకోవాలని ఇప్పటికే అన్ని బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చిందని చెప్పారు. కాగా, ప్రస్తుతం రూ.181 కోట్ల విలువైన రూ.2,000 నోట్లు సర్క్యులేషన్‌లో ఉన్నట్టు ఆర్బీఐ చెబుతోంది. నోట్ల మార్పిడి, డిపాజిట్లు చేసుకునేందుకు నాలుగు నెలలు గడువు ఉన్నందున ఎవరూ బ్యాంకుల ముందు పడిగాపులు పడనవసరం లేదని, ప్రజలు దీన్ని సీరియస్‌గా తీసుకుని రూ.2 వేల నోట్లన్నీ వాపస్ చేస్తారనే అనుకుంటున్నట్టు శక్తికాంత దాస్ తెలిపారు. అవసరాన్ని బట్టి సెప్టెంబర్ 30 తర్వాత గడువు పొడిగించే విషయాన్ని పరిశీలిస్తామని చెప్పారు.

Updated Date - 2023-05-22T15:34:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising