ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Mayawati: మహిళా ఓటర్లకు గాలం, మరో15 ఏళ్ల తర్వాతే బిల్లు అమలు..!

ABN, First Publish Date - 2023-09-20T16:16:12+05:30

మహిళా రిజర్వేషన్ బిల్లు పై ఓవైపు లోక్‌సభలో చర్చ జరుగుతుండగా, బిల్లు అమలులో విషయంలో జరిగే జాప్యంపై బహుజన్ సమాజ్ పార్టీ అ అధినేత్రి మాయావతి అనుమానాలు వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహిళలను ఆకట్టుకునేందుకే కేంద్రం ఈ బిల్లు తెచ్చినట్టు ఆమె ఆరోపించారు.

లక్నో: మహిళా రిజర్వేషన్ బిల్లు (Women's Resevation Bill)పై ఓవైపు లోక్‌సభలో చర్చ జరుగుతుండగా, బిల్లు అమలులో విషయంలో జరిగే జాప్యంపై బహుజన్ సమాజ్ పార్టీ (BSP) అధ్యక్షురాలు మాయావతి (Mayawati) అనుమానాలు వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో మహిళలను ఆకట్టుకునేందుకే కేంద్రం ఈ బిల్లు తెచ్చినట్టు ఆమె ఆరోపించారు. ఈ బిల్లుకు మహిళలకు రిజర్వేషన్ ఇవ్వాలనే ఉద్దేశం లేదని అన్నారు.


''ఈ బిల్లు ప్రకారం, రాబోయే 15-16 ఏళ్లలో మహిళలకు రిజర్వేషన్ అందదు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత తక్షణమే అది అమల్లోకి రాదు. తొలుత దేశంలో జనగణన జరగాలి. ఆ వెంటనే సీట్ల పునర్విభజన జరగాల్సి ఉంటుంది'' అని బుధవారంనాడిక్కడ మీడియాతో మాట్లాడుతూ ఆమె చెప్పారు. జనగణకు చాలా సమయం పడుతుందన్నారు. ఆ తర్వాత మాత్రమే బిల్లు అమల్లోకి వస్తుందని, ఆ ప్రకారం చూసినప్పుడు మహిళలకు రిజర్వేషన్ కల్పించే ఉద్దేశం బిల్లుకు లేదని తెలుస్తుందని అన్నారు. ఇది కేవలం రాబోయే ఎన్నికల్లో మహిళను ఆకట్టుకునేందుకే ఉద్దేశించినదిగానే చూడాల్సి ఉంటుందని చెప్పారు.


బిల్లుకు మా మద్దతుంటుంది...

కాగా, పార్లమెంటులో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు తమ మద్దతు ఉంటుందని మాయావతి మంగళవారంనాడు ప్రకటించారు. బిల్లులో ఓబీసీలు, ఎస్సీ, ఎస్టీ మహిళలకు వేర్వేరుగా కోటా కల్పించాలని కోరారు. మహిళా రిజర్వేషన్ బిల్లు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నందున పార్లమెంటులో చర్చ అనంతరం బీఎస్‌పీతో పాటు దాదాపు అన్ని పార్టీలు బిల్లుకు అనుకూలంగా ఓటు వేస్తాయని అంచనా వేస్తున్నట్టు చెప్పారు.


50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలి..

దేశంలో మహిళల జనాభాను పరిగణనలోకి తీసుకుని పార్లమెంటులో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ స్థానే 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని బీఎస్‌పీ తరఫున గతంలో తాము డిమాండ్ చేశామని మాయావతి చెప్పారు. దీనిపై ప్రభుత్వం ఆలోచన చేస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపారు. అదేవిధంగా ఓబీసీలు, ఎస్‌సీలు, ఎస్టీలకు వేర్వేరుగా రిజర్వేషన్ కల్పించాలని, లేదంటే ఆ వర్గాలకు అన్యాయం చేసినట్టు అవుతుందని అన్నారు.

Updated Date - 2023-09-20T16:16:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising