ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Yogi Guidelines : రోడ్లపై అడ్డంకులు సృష్టిస్తే ఖబడ్దార్.. పండుగలకు యూపీ ప్రభుత్వం మార్గదర్శకాలు..

ABN, First Publish Date - 2023-06-28T09:28:12+05:30

పండుగల సమయాల్లో భక్తులు, విశ్వాసులు అనుసరించవలసిన నిబంధనలను ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. శ్రావణి శివరాత్రి, నాగ పంచమి, రక్షాబంధనం, బక్రీద్, మొహరం పండుగలను చేసుకునేవారు ప్రజాప్రయోజనాల రీత్యా వ్యవహరించవలసిన పద్ధతులను తెలిపింది. భక్తులకు అందజేయవలసిన సదుపాయాలు, భద్రతా చర్యలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమీక్షించారు.

Yogi Adithyanath
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో : పండుగల సమయాల్లో భక్తులు, విశ్వాసులు అనుసరించవలసిన నిబంధనలను ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. శ్రావణి శివరాత్రి, నాగ పంచమి, రక్షాబంధనం, బక్రీద్, మొహరం పండుగలను చేసుకునేవారు ప్రజాప్రయోజనాల రీత్యా వ్యవహరించవలసిన పద్ధతులను తెలిపింది. భక్తులకు అందజేయవలసిన సదుపాయాలు, భద్రతా చర్యలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Uttar Pradesh Chief Minister Yogi Adityanath) సమీక్షించారు. శాంతిభద్రతలను కాపాడేవిధంగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు.

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో తెలిపిన వివరాల ప్రకారం, శ్రావణి శివరాత్రి, నాగ పంచమి, రక్షాబంధనం, బక్రీద్, మొహరం, కన్వర్ యాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సమీక్ష జరిపారు. శాంతిభద్రతలను కాపాడేవిధంగా ఈ పండుగలను జరుపుకోవాలని ప్రజలకు సూచించారు. బక్రీద్, మొహరం పండుగల సందర్భంగా రోడ్డు భద్రత నిబంధనలను అమలు చేయడం గురించి మత పెద్దలు, విద్యావేత్తలతో స్థానిక ప్రభుత్వ అధికారులు చర్చించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివాదాస్పద స్థలాల్లో బక్రీద్ సందర్భంగా బలులు ఇవ్వడాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. బలి ఇచ్చే ప్రదేశాన్ని ముందుగానే నిర్ణయించాలని ఆదేశించారు. ముందుగా నిర్ణయించిన చోట్ల మినహా ఇతర చోట్ల బలి ఇవ్వరాదని ఆదేశించారు. నిషేధం పరిధిలో ఉన్న జంతువులు, పశువులను బలి ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతి జిల్లాలోనూ బలి ఇచ్చిన తర్వాత, వ్యర్థాలను పద్ధతి ప్రకారం తరలించే ఏర్పాట్లు చేయాలన్నారు. వీటిని పద్ధతి ప్రకారం తరలించకపోతే వ్యాధులు ప్రబలే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.

అన్ని పండుగలను శాంతి, సామరస్యాలతో జరుపుకోవడానికి అవసరమైన కార్యక్రమాలు చేసుకోవచ్చునని ప్రజలకు తెలిపారు. కన్వర్ యాత్ర సంప్రదాయబద్ధంగా, సురక్షితంగా జరగడానికి సూచనలు చేశారు. గత అనుభవాలనుబట్టి డైవర్స్‌ను మోహరించాలని, సీసీటీవీలను ఏర్పాటు చేయాలని తెలిపారు. ఈ యాత్ర జరిగే మార్గాల్లో మాంసం, మాంసపు ఉత్పత్తుల అమ్మకాలు, కొనుగోళ్లపై నిషేధం విధించారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ ఈ ఆదేశాలను జారీ చేశారు. ప్రజల రవాణా, ప్రయాణ సదుపాయాలకు ఎటువంటి అడ్డంకులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.

మతపరమైన సంప్రదాయాలు, విశ్వాసాలను గౌరవించాలని, అదే సమయంలో సంప్రదాయాలకు విరుద్ధంగా జరిగే కార్యక్రమాలను అనుమతించరాదని స్పష్టం చేశారు. సాధారణ ప్రజానీకానికి అవసరమైన సదుపాయాలను కల్పించాలని ఆదేశించారు. కార్యక్రమాలను నిర్వహించేందుకు నిర్వాహకులకు అనుమతి ఇవ్వాలని, అయితే ప్రతి ఒక్కరూ నిబంధనలను పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్తు సరఫరా సజావుగా జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. అనవసరంగా విద్యుత్తు సరఫరాను నిలిపేసినట్లు ఫిర్యాదులు రావడానికి వీల్లేదని చెప్పారు.

పవిత్ర శ్రావణ మాసం జూలై 4 నుంచి ప్రారంభమవుతుంది. ఈ ఏడాది శ్రావణ మాసం అధిక మాసం వస్తుండటంతో ఇది రెండు నెలలపాటు ఉంటుంది. శ్రావణి శివరాత్రి, నాగ పంచమి, రక్షా బంధనం వంటి పండుగలను భక్తులు భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. కన్వర్ యాత్ర కూడా ఈ నెలలోనే జరుగుతుంది. జూన్ 29న బక్రీద్ జరుపుకుంటారు.

ఇవి కూడా చదవండి :

Rajya Sabha polls : మూడు రాష్ట్రాల్లో రాజ్యసభ ఎన్నికలు జూలైలో

Amarnath Yatra : అమర్‌నాథ్ యాత్ర భద్రతకు కేంద్రం సంచలన నిర్ణయం

Updated Date - 2023-06-28T10:00:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising