ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Yogi Adityanath : రూ.1,400 కోట్ల సామ్రాజ్యాన్ని 50 రోజుల్లో కూల్చేసిన యోగి

ABN, First Publish Date - 2023-04-15T21:09:53+05:30

మాఫియాను మట్టిలో కలిపేస్తానని ఉత్తర ప్రదేశ్ శాసన సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మాటను నిలబెట్టుకుంటున్నారు.

Atiq Ahmed, Yogi Adithyanath, Akhilesh Yadav
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

లక్నో : మాఫియాను మట్టిలో కలిపేస్తానని ఉత్తర ప్రదేశ్ శాసన సభలో ప్రకటించిన ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తన మాటను నిలబెట్టుకుంటున్నారు. మాఫియా డాన్, సమాజ్‌వాదీ పార్టీ మాజీ నేత అతిక్ అహ్మద్ (Atiq Ahmed)కు చెందిన రూ.1,400 కోట్ల ఆర్థిక సామ్రాజ్యాన్ని, అతని ముఠాను 50 రోజుల్లో కుప్పకూల్చారు. ఆయన నేరాలు చేయడం ద్వారా ఈ ఆస్తులను సంపాదించినట్లు ప్రభుత్వ అధికారులు ప్రకటించారు.

అతిక్ కుమారుడు అసద్ అహ్మద్ (Asad Ahmed) పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. దీంతో అతిక్ మాట్లాడుతూ, ‘‘మేం మట్టిలో కలిసిపోయాం’’ అన్నాడు. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, అతిక్, ఆయన సహచరులకు సంబంధించిన రూ.1,400 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. నేరాలకు పాల్పడటం ద్వారా ఈ ఆస్తులను సంపాదించారని పోలీసులు నిర్థరించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కూడా రూ.100 కోట్లకుపైగా ఆస్తులను బయటపెట్టడంతోపాటు అతిక్, ఆయన సహచరులు ఏర్పాటు చేసిన సుమారు 50 బూటకపు కంపెనీలను గుర్తించింది. నల్లధనాన్ని అధికారిక సొమ్ముగా మార్చుకోవడానికి ఈ బూటకపు కంపెనీలను వీరంతా ఉపయోగించుకున్నట్లు గుర్తించింది.

అతిక్ కుటుంబం పరిస్థితిని ఓ అధికారి వివరిస్తూ, అతిక్ అహ్మద్ సామ్రాజ్యం గడచిన 50 రోజుల్లో కుప్పకూలిందన్నారు. ఆయన తన సోదరుడు అష్రఫ్ అహ్మద్‌ను కూడా జైల్లోనే గడిపేలా చేశాడన్నారు. అతని కొడుకులిద్దరు జైల్లోనే ఉన్నారని, మూడో కొడుకు అసద్ పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడని, మరో ఇద్దరు మైనర్ కొడుకులు జువెనైల్ హోమ్‌లో ఉన్నారని చెప్పారు. ఆయన భార్య సయిష్ట పర్వీన్ పరారీలో ఉందన్నారు.

ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అధికారులు 15 బృందాలుగా వెళ్లి అతిక్, ఆయన గ్యాంగ్ ఆస్తులను గుర్తించారు. దాదాపు రూ.1,400 కోట్ల విలువైన సామ్రాజ్యాన్ని జప్తు చేశారు. మనీలాండరింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేశారు. ఓ న్యాయవాది, అకౌంటెంట్, రియల్ ఎస్టేట్ వ్యాపారి, మాజీ బీఎస్పీ ఎమ్మెల్యే, బిల్డర్, కార్ షోరూం యజమాని కూడా అతిక్‌కు సహకరిస్తున్నట్లు తెలుసుకుని, వారిని దర్యాప్తు కోసం పిలిచారు.

అతిక్‌పై 100కుపైగా క్రిమినల్ కేసులు విచారణలో ఉన్నప్పటికీ, 2017కు పూర్వం బెయిలు తెచ్చుకోగలిగేవాడు. స్వేచ్ఛగా తిరిగేవాడు. ఆయనపై మొదటి కేసు 1979లో నమోదైంది. కానీ ఆయన దోషి అని నిరూపణ కాలేదు. సాక్షులు అదృశ్యమవడం కానీ, ప్రతికూలంగా మారడం కానీ జరుగుతూ ఉండేది. అయితే యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఉమేశ్ పాల్ అపహరణ కేసులో బలమైన వాదనలు వినిపించింది. ఫలితంగా గత నెలలో అతిక్‌కు జీవిత ఖైదు శిక్ష పడింది.

ఇవి కూడా చదవండి :

Delhi Excise Policy: కోర్టుల ముందు అబద్దాలు చెబుతున్న దర్యాప్తు సంస్థలు.. సీబీఐ సమన్లపై కేజ్రీవాల్

Kejriwal Vs Rijiju : కేజ్రీవాల్‌‌కు కేంద్ర మంత్రి రిజిజు సూటి ప్రశ్న

Updated Date - 2023-04-15T21:09:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising