ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Eggs Consumption : వారానికి రెండు నుంచి మూడు గుడ్లు తింటే ఎందరినో చావుకు దగ్గర చేస్తున్న ఈ అనారోగ్య సమస్య రాదట !

ABN, First Publish Date - 2023-02-17T12:17:02+05:30

గుడ్డు వల్ల ఎంతో కొంత లాభం ఉందనైతే అందరికీ తెలుసు. కానీ ఎంత లాభమనేది మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. కనీసం వారానికి రెండు నుంచి మూడు గుడ్లు తింటే ఎందరినో చావుకు దగ్గర చేస్తున్న ఓ అనారోగ్య సమస్య మన దరి చేరమన్నా కూడా చేరదట

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

Eggs Consumption : గుడ్డు వల్ల ఎంతో కొంత లాభం ఉందనైతే అందరికీ తెలుసు. కానీ ఎంత లాభమనేది మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. కనీసం వారానికి రెండు నుంచి మూడు గుడ్లు తింటే ఎందరినో చావుకు దగ్గర చేస్తున్న ఓ అనారోగ్య సమస్య మన దరి చేరమన్నా కూడా చేరదట. మరి ఏంటా అనారోగ్య సమస్య? గుడ్డు తినడం వల్ల ఆ సమస్య మన దరి చేరకుండా ఎలా ఉంటుంది? అనే దానిపై ఓ లుక్కేద్దాం.

హృదయ సంబంధిత సమస్యలు ఉన్నాయి. దానికి గుడ్డు తినడం వల్ల ఏమైనా నష్టాలున్నాయా? అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే ఒక అధ్యయనంలో తేలిందేంటంటే.. వారానికి మూడు గుడ్లు తినడం వలన హృదయ సంబంధిత సమస్య సగానికంటే ఎక్కువగానే తగ్గుతుందట. ఓ అధ్యయనం ప్రకారం.. వారానికి నాలుగు నుంచి ఏడు గుడ్లు తింటున్న వారిలో 75 శాతం మందికి హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంది. అయితే జీవనశైలి, క్లినికల్ ఫ్యాక్టర్స్ తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత వారానికి ఒకటి నుంచి మూడు గుడ్లు తీసుకోవడం వల్ల మరింత మేలు జరుగుతుందని కనుగొనడం జరిగింది.

గుడ్డు వినియోగంపై భిన్నాభిప్రాయాలు..

గుడ్డు వినియోగం, గుండె ఆరోగ్యం మధ్య పరస్పర సంబంధంపై అధ్యయనాలు మిశ్రమ ఫలితాలను అందించాయి. గుండె ఆరోగ్యానికి గుడ్లు మంచివా లేదా చెడ్డవా అనే చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఆరోగ్యకరమైన వ్యక్తులు మితంగా గుడ్డును వినియోగిస్తే గుండె జబ్బుల ప్రమాదం పెద్దగా ఉండదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే కొన్ని అధ్యయనాలు మాత్రం.. ముఖ్యంగా మధుమేహం లేదా గుండె జబ్బుల హిస్టరీ ఉన్నవారిలో అధిక గుడ్డు వినియోగం ప్రమాదకరమని వెల్లడించాయి.

ఇక గుడ్డులోని పచ్చ సొన తినడం ఆరోగ్యానికి మంచిదేనా?

ఈ డౌట్ ఎంతోకాలంగా చాలా మందిని వేధిస్తోంది. గుడ్డులోని పచ్చసొన తినడం గుండెకు మంచిది కాదని కొందరు.. ఏం పర్వాలేదు.. చక్కగా తినొచ్చని మరికొందరు చెబుతుంటారు. కానీ వీటిలో ఏది కరెక్ట్ అనేది తెలియక సతమతమవుతూ ఉంటాం. నిపుణులు చెబుతున్నదేంటంటే.. వారానికి మూడు ఎగ్ యోక్స్‌ను తీసుకోవడం అనేది మధుమేహం, హృదయ సంబంధ వ్యాధులు వంటివి పరిగణలోకి తీసుకుంటే సురక్షితమే. వారానికి రోజు విడిచి రోజు గుడ్డులోని పచ్చసొన తీసుకోవడం ఉత్తమమని 2018లో వరల్డ్ హెల్త్ ఆర్గనైనజేషన్ (WHO) తెలిపింది. ఈ ఎగ్ యోక్‌లో విటమిన్ డి, ఇతర న్యూట్రియంట్స్ ఐరన్ ఉంటాయి. ఇవి మనం గుడ్డులోని తెల్ల పొరను మాత్రమే తీసుకుంటే ఇవన్నీ మిస్ అవుతాం.

Updated Date - 2023-02-17T12:17:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising