Hair vs Oil: అందరూ తెలియక చేస్తున్న బిగ్ మిస్టేక్ ఇదే.. తలకు నూనె రాసుకునేటప్పుడు చేస్తున్న ఈ 5 పొరపాట్ల వల్లే..!
ABN, First Publish Date - 2023-08-18T16:34:38+05:30
జుట్టుకు తేలికగా మసాజ్ చేయండి. ఒత్తిడి చేయవద్దు.
తలను శుభ్రంగా ఉంచడానికి తలస్నానం చేస్తాం. అలాగే మంచి కండీషనర్ కూడా అఫ్లయ్ చేస్తాం. కానీ తలకు వారానికి ఎన్నిసార్లు నూనె రాస్తున్నారు. అసలు నూనెను తలకు ఎన్నిసార్లు రాస్తున్నారనే విషయం తీసుకుంటే నూనె రాసే విధానం కూడా చాలా ముఖ్యమట. జుట్టును కాపాడుకోవడానికి వారానికి కనీసం రెండుసార్లు తలస్నానం చేయడం, కండిషనింగ్, జుట్టు రకానికి సరిపోయే జుట్టు ఉత్పత్తులను ఉపయోగించడం, జుట్టుకు నూనె రాయడం వంటివి వెంట్రుకలకు మెరుగైన పోషణను, ఆరోగ్యాన్ని ఇస్తాయి. అలాగే తెలియక చేసే అనేక తప్పుల్లో జుట్టుకు సరైన విధంగా నూనె రాయకపోవడం కూడా ఒకటి. నూనె రాసే విధానంలో తెలియక చేస్తున్న 5 పొరపాట్లు ఏమిటంటే..
1. వేడి నూనెను ఉపయోగించడం
మనం చేసే అత్యంత సాధారణ పొరపాట్లలో ఒకటి గోరువెచ్చని నూనెకు బదులుగా వేడి నూనెను జుట్టుకు మసాజ్ చేయడానికి ఉపయోగించడం. ఇలా తలకు, జుట్టుకు అధిక వేడి నూనెను పూయడం వల్ల చుండ్రు, దురద వస్తుంది.
2. రాత్రిపూట నూనె ఉంచడం
తలకు నూనె రాయడానికి ప్లాన్ చేసినప్పుడు, జుట్టుకు నూనెను రాసి రాత్రంతా ఉంచాల్సిన అవసరం లేదు. దీనివల్ల మొటిమలు, దద్దుర్లు, మంట అలాగే అనేక ఇతర చర్మ సమస్యలకు దారితీస్తుంది. అందువల్ల, రాత్రిపూట నూనెను రాయడం మానుకోవాలి. మామూలుగా షాంపూ చేయడానికి రెండు గంటల ముందు నూనె రాయాలి.
3. తడి జుట్టుకు నూనె రాయడం
ముఖ్యంగా సమయం చాలక చాలామంది చేసే పెద్ద తప్పు.. తడి జుట్టుకు నూనె రాయడం అందులో ఒకటి. తడి జుట్టు మీద హెయిర్ ఆయిల్ రాసుకోవడం మానేయాలి, ఎందుకంటే అవి విరిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నూనెరాసి వెంట్రులకను సున్నితంగా లాగడం వల్ల కూడా జుట్టు విరిగిపోతుంది.
ఇది కూడా చదవండి: బరువు తగ్గేందుకు ప్రయత్నిస్తున్నారా..? అస్సలు చేయకూడని ఈ మిస్టేక్స్ ఏంటో ముందే తెలుసుకోండి..!
4. చాలా ఎక్కువ ఆయిల్ అప్లై చేయడం
జుట్టుకు మసాజ్ చేయడానికి తక్కువ నూనెను ఉపయోగించాలి. మాయిశ్చరైజర్లను అప్లై చేసినట్లే, హెయిర్ ఆయిల్ కూడా కొంత మొత్తంలో కలిపి చేయాల్సి ఉంటుంది. నూనె ఎక్కువగా రాయడం వల్ల మళ్ళీ దానిని కడగడానికి కూడా చాలా సమయం పడుతుంది.
5. జుట్టును చాలా గట్టిగా కట్టుకోవడం
ఆయిల్ మసాజ్ చేసిన తర్వాత జుట్టును రబ్బరు బ్యాండ్‌లో గట్టిగా కట్టుకునే వారైతే, అది మీ తలపై అనవసరమైన ఒత్తిడి కలిగిస్తుంది, ఇది తలనొప్పికి దారితీస్తుంది. కాబట్టి మసాజ్ తర్వాత వదులుగా జడలా కట్టాలి.
1. జుట్టుకు ఎల్లప్పుడూ వెచ్చని నూనెను ఉపయోగించండి.
2. రాత్రిపూట కాకుండా 2 నుంచి 3 గంటలు మాత్రమే నూనె ఉంచండి.
3. తడి జుట్టుకు ఎప్పుడూ నూనె రాయకండి.
4. తక్కువే నూనె సరిపోతుంది.
5. నూనె రాసే ముందు జుట్టును దువ్వండి.
6. జుట్టుకు తేలికగా మసాజ్ చేయండి. ఒత్తిడి చేయవద్దు.
7. మసాజ్ చేసిన తర్వాత జుట్టును వదులుగా జడలా కట్టుకోవాలి.
Updated Date - 2023-08-18T16:34:38+05:30 IST