Weight Lose: వయసు 21 ఏళ్లే.. బరువు ఏకంగా 156 కేజీలు.. ఏకంగా 100 కిలోల బరువు తగ్గాలని ఈ యువతి చేసిన ఒక్క మిస్టేక్‌తో..!
ABN, First Publish Date - 2023-06-21T15:20:51+05:30
ఇవన్నీ బరువు పెరిగేందుకు కారణం అవుతున్నాయి.
అధిక బరువు పెరగడం అనేది ఒకప్పుడు ఎప్పుడో కానీ కనిపిస్తూ ఉండేది. అయితే నేటి రోజుల్లో భారీగా మారిన ఆకారాలతో, బాన పొట్టతో, పెద్ద నడుములతో ప్రజలు ఊబకాయానికి గురవుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఈమధ్య కాలంలోనే ఎందుకు ఎక్కువగా ఉంది అంటే శరీర కదలికలు ఎక్కువగా లేకపోవడం, శ్రమలేని జీవన శైలి, ఫాస్ట్ ఫుడ్ అతిగా తినడం ఇలా చాలా కారణాలున్నాయి. ఇవన్నీ బరువు పెరిగేందుకు కారణం అవుతున్నాయి.
అయితే ఒక్కసారిగా బరువు తగ్గాలనుకునే ఆలోచన రావడం, దానిని అమలు చేయడం ఇవన్నీ శరీరం మీద చెడు ప్రభావాన్నే చూపుతాయి. నిజానికి బరువును నెమ్మదిగా కోల్పోవాలి. అది తొందరగా చేసేపని కాదు. సమయం తీసుకుంటూ చేయాల్సిన పని, అయితే ఈమధ్యకాలంలో త్వరగా బరువు తగ్గాలని చేస్తున్న ప్రయత్నాలన్నీ వికటించి ప్రాణాలనే కోల్పోతున్నారు. ఈ 21 ఏళ్ల సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్, బరువు తగ్గించే బూట్ క్యాంప్‌లో తన శరీర బరువు (100 కిలోలు) సగానికి పైగా కోల్పోవడానికి ప్రయత్నిస్తూ విషాదకరంగా తన జీవితాన్ని కోల్పోయింది. వివరాల్లోకి వెళితే..
21 ఏళ్ల అమ్మాయి మరణం కేసు..?
21 ఏళ్ల జౌకుయ్హువాతో చైనాలోని వాయువ్య ప్రాంతానికి చెందిన అమ్మాయి, తను ఊబకాయంతో పోరాడుతోంది. ఒక్కసారిగా శరీర బరువును సగానికి పైగా తగ్గించుకోవాలనే సాహసోపేతమైన లక్ష్యాన్ని పెట్టుకుంది. టిక్‌టాక్ మాదిరిగానే ప్రసిద్ధ చైనీస్ ప్లాట్‌ఫారమ్ అయిన డౌయిన్‌లో కుయ్హువా తన 'An inspiring transformation'ను నిరంతరం సోషల్ మీడియాలో పంచుకుంటుంది.
ఆమె బరువు తగ్గడానికి అనేక సవాళ్లు ఎదుర్కుంటూనే 156 కిలోల (344 పౌండ్లు) బరువులో కుయ్హువా 100 కిలోలు కోల్పోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. షాంగ్సీ ప్రావిన్స్‌లో weight loss camp వెళ్ళి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అక్కడి నుంచి తిరిగి వచ్చిన రెండు రోజుల తర్వాత కుయ్హువా మరణించింది.
ఇది కూడా చదవండి: సూపర్ ఛాన్స్.. 2000 నోటును మార్చుకునేందుకు ఇకపై బ్యాంకులకు కూడా వెళ్లక్కర్లేదు.. ఇంట్లో కూర్చునే..!
తీవ్రమైన శిక్షణ గురించి నిపుణులు ఏమి చెబుతారు?
ఒక్కసారిగా బరువు తగ్గాలనుకునే వారిలో ఒక్కొక్కరిలో ఒక్కో శరీర పరిస్థితి ఉంటుంది. అందులో ముఖ్యంగా తీవ్రమైన వ్యాయామ శిక్షణ కోసం పరిధిని నిర్ణయించడం అనేది వ్యక్తి ఫిట్‌నెస్ స్థాయి, మొత్తం ఆరోగ్యం, నిర్దిష్ట లక్ష్యాలపై ఆధారపడి ఉంటుంది.
బరువు తగ్గించే ప్రయాణాన్ని ప్రారంభించిన ఎవరైనా సరే, వారానికి 3 నుంచి 5 సెషన్‌లను లక్ష్యంగా పెట్టుకోండి, ప్రతి సెషన్ సుమారు 30 నుంచి 60 నిమిషాలు ఉంటుంది. చురుకైన నడక, జాగింగ్, సైక్లింగ్, స్విమ్మింగ్ వంటి కార్యకలాపాలతో ప్రారంభించండి. ఫిట్‌నెస్ మెరుగుపడినప్పుడు క్రమంగా తీవ్రత, వ్యవధిని పెంచండి. కండరాల పునరుద్ధరణ కోసం కనీసం ఒక రోజు విశ్రాంతి తీసుకోవాలి.
Updated Date - 2023-06-21T15:20:51+05:30 IST