ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Tips: నాలుక ఎర్రగా మారిపోయి ఏం తిన్నా మండుతోందా..? ఈ ఒక్క పని చేయండి చాలు.. 2 నిమిషాల్లో రిలీఫ్..!

ABN, First Publish Date - 2023-07-04T13:09:28+05:30

ఇవి కాలిన నాలుకకు ప్రయోజనకరమైన ఔషధంగా పనిచేస్తాయి.

burning tongue
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బాగా కారంగా ఉన్న పదార్థాలను తిన్నప్పుడు నాలుక మంట మొదలవుతుంది. దీంతో భరించలేని మంటతో కళ్ళల్లో నీళ్ళుతిరుగుతాయి. వెంటనే నీళ్ళు తాగితే కాస్త ఉపశమనం అనిపించినా నాలుక మంట కారం వల్లే కలిగింది కాబట్టి కాస్త పంచదారో లేదా తీయ్యగా ఉండే మరేదో నోట్లో వేసుకుని కాస్త నోరు కారం తగ్గేవరకూ ఓపిక పడతాం. కానీ మరీ కారం లేని పదార్థాలు తిన్నా, కాస్త వేడిగా ఉన్న పానీయాలు తాగినా కూడా ఇదే పరిస్థితి ఉంటుంది. ఇలా నాలుక భయంకరంగా మంట పుడుతుంటే మాత్రం భరించడం కష్టం ఇది ఎందుకు మొదలవుతుంది. ఈ మంటను పోగొట్టేందుకు మార్గాలు, చికిత్సలు ఏంటే తెలుసుకుందాం.

వేడివేడిగా కాఫీ, టీ తాగినా, ఏదైనా తిన్నా నాలుక కాలడం సహజం, తర్వాత వేడి పదార్థాలు నాలుకకు తగిలితే చాలు జలదరింపు ఉంటుంది. ఇష్టమైన ఆహారం కనబడినప్పుడు వేడి గురించి మరిచిపోయి ఇలా నోట్లో పెట్టుకుంటారు. దీని వల్ల ఒక్కసారిగా నాలుక కాలి.. చిన్నగా మంటగా అనిపించి పొక్కులు ఏర్పడతాయి. కొంతమందికి రెండు, మూడు రోజులకి పరిస్థితి మామూలుకి వస్తే.. మరికొంతమందికి చాలా సమయం పడుతుంది. నాలుక కాలిపోవడం చాలా నొప్పిగా ఉంటుంది. తరచుగా వేడి, రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. దీనికి ఇంట్లోనే చేసుకునే చిట్కాలున్నాయి. అవేంటంటే..

నాలుక మండినప్పుడు ఐస్ క్రీం తినండి.

నాలుక మండుతుంటే, వెంటనే ఐస్ క్యూబ్‌ను నాలుకపై ఉంచండి. ఐస్‌క్రీమ్‌ను ఫ్రిజ్‌లో ఉంచినట్లయితే, అది కాలిన నాలుకకు తక్షణ ఉపశమనం ఇస్తుంది.

ఇది కూడా చదవండి: ఈ 9 సీక్రెట్ టిప్స్‌ను పాటించండి చాలు.. ఇంట్లో చేసే బిర్యానీకి కూడా స్టార్ హోటళ్లలో ఉండే టేస్ట్..!

చల్లని పానీయాలు తీసుకోండి.

నాలుక కాలిన వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల ఉపశమనం కలుగుతుంది. చల్లని పానీయాలతో రోజంతా హైడ్రేట్ గా ఉండటం కూడా రిలీఫ్ ని ఇస్తుంది.

ఉప్పు నీటితో

ఉప్పు నీటితో పుక్కిలిస్తే కాలిన నాలుకలో ఉపశమనం లభిస్తుంది. ఉప్పు నీటితో నోటిని శుభ్రం చేసుకోండి. ఈ సింపుల్ రెమెడీ అసౌకర్యాన్ని తగ్గించడమే కాకుండా ప్రత్యేక చికిత్స కూడా.

కాలిన నాలుకపై తేనె లేదా చక్కెర

తేనెలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉన్నాయి. కాలిన ప్రదేశంలో తేనె, పంచదారను పూయడం వల్ల ఇన్ఫెక్షన్ రాకుండా, నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు.

చల్లటి ఆహారం తీసుకోవడం

పెరుగు, ఐస్ క్రీం, కేక్ వంటి చల్లని ఆహార పదార్థాలను తినడం వల్ల నాలుకకు ఉపశమనం లభిస్తుంది. అసౌకర్యాన్ని తగ్గించడానికి ఇది చక్కని మార్గం.

Updated Date - 2023-07-04T13:09:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising