Afternoon Naps: రోజూ సాయంత్రం కాసేపు కునుకేస్తుంటారా..? ఇంత కంటే ఎక్కువ సేపు పడుకుంటే గుండెకు డేంజరంట..!
ABN, First Publish Date - 2023-05-17T16:19:42+05:30
ఒక వ్యక్తి పగటిపూట నిద్రపోయే సమయాన్ని తగ్గించడం, రాత్రి తగినంత మొత్తంలో నిద్రపోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు.
రోజంతా పనిలో చాలా అలసిపోయిన తర్వాత, మనలో చాలామంది బెడ్‌లపై పడుకుని గాఢమైన నిద్రలోకి వెళ్లాలనుకుంటాం. ప్రత్యేకించి సెలవు దినాల్లో అయితే, మధ్యాహ్న నిద్రలు చాలా ప్రశాంతగా మారతాయి. చాలా వరకూ ఎంతటి శ్రమనైనా మరిచిపోయేది నిద్రలోనే.. ఆకాస్త నిద్రా లేకపోతే చాలామంది రోజంతా అలిసిపోయిన ఫీలింగ్ ని మోసేతూ ఉంటారు. అయితే ఈ నిద్ర మన శరీరాలపై ముఖ్యంగా మన హృదయాలపై చూపే భయంకరమైన దుష్ప్రభావాల గురించి మనకు తెలుసా?
మధ్యాహ్న నిద్రలు అధిక శక్తిని ఇస్తాయి. ఒక వ్యక్తి రోజూ నిద్రపోవచ్చు. అయితే రోజూ ఏదో ఒక సమయంలో నిద్రపోవడం అనేది అలవాటైన వారు నిద్రపోవచ్చు కానీ అవి 30 నుండి 45 నిమిషాల వరకు ఉంటే మాత్రమే ప్రయోజనం ఉంటుంది. రాత్రిపూట తగినంత నిద్ర లేని వ్యక్తుల గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. కానీ 60 నిమిషాల నుండి 180 నిమిషాల మధ్య ఉండే న్యాప్స్ మన గుండె , రక్తపోటు స్థాయిలపై భయంకరమైన ప్రభావాన్ని చూపుతాయని తాజా అధ్యయనాలు తెలిపాయి.
మధ్యాహ్న నిద్ర కొన్ని దుష్ప్రభావాల గురించి
1. అధిక రక్తపోటుకు దారితీస్తుంది.
హైపర్‌టెన్షన్ అని కూడా పిలువబడే అధిక రక్తపోటు నేరుగా పగటిపూట నిద్రపోవడానికి సంబంధించినది. ఈ న్యాప్స్ అధిక రక్తపోటు స్థాయిలు, స్ట్రోక్ , అధిక ప్రమాదాలకు కారణం అవుతాయి. ఇది నేరుగా గుండె దీర్ఘాయువు దాని పంపింగ్ సామర్థ్యాన్ని ప్రభావితం చేస్తుంది.
2. స్ట్రోక్‌కి ప్రధాన కారణం..
ఎక్కువ భాగం మధ్యాహ్నా వేళలలో నిద్రపోయే వ్యక్తులు వారి వృద్ధాప్యంలో స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఎక్కువగా ఉందని అధ్యయనాలు రుజువు చేశాయి.
ఇది కూడా చదవండి: ఎంత తిన్నా ఈ నీరసం ఏంట్రా బాబూ అనిపించేవాళ్లు ఈ ఒక్క జ్యూస్ తాగండి చాలు..!
3. మధుమేహానికి కారణమవుతుంది.
45 నిమిషాల కంటే ఎక్కువ సేపు నిద్రపోయే వారికి మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువ. ఈ నిద్ర మధుమేహం గుండె జబ్బులు వచ్చే ప్రమాదాన్ని రెట్టింపు చేస్తుంది.
ఒక వ్యక్తి పగటిపూట నిద్రపోయే సమయాన్ని తగ్గించడం, రాత్రి తగినంత మొత్తంలో నిద్రపోవడం ద్వారా ఈ సమస్యను పరిష్కరించవచ్చు. ఆరోగ్యకరమైన స్లీపింగ్ రొటీన్ అటువంటి సమస్యల ప్రమాదాన్ని తగ్గిస్తుంది,30 నుండి 40 నిమిషాల వరకు నిద్రపోవడం ఖచ్చితంగా అద్భుతాలు చేస్తుంది. బద్దకంగా, మరీ పనిచేయలేని స్థితిలో ఉన్నప్పుడు, అలసటగా అనిపించినపుడు కూడా చిన్న సమయంలో నిద్రను సెట్ చేసుకుని నిద్రపోవడం వల్ల మానసికంగా ఉల్లాసంగా ఉండేందుకు అవకాశం ఉంది.
Updated Date - 2023-05-17T16:19:42+05:30 IST