ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

CPR Day: మీ కళ్లెదురుగా గుండెపోటుతో ఎవరైనా కుప్పకూలిపోతే గాబరాపడకండి.. ఇలా సీపీఆర్ చేసి బతికించండి..

ABN, First Publish Date - 2023-07-21T11:50:29+05:30

గుండెపోటు గానీ, ఆకస్మాత్తుగా గుండె కొట్టుకోవడం ఆగి పోయిన వ్యక్తులకు గానీ సీపీఆర్‌ చేసి ఫలితం రాబటితే బాధితుడికి పునర్జన్మ ఇచ్చినట్లే అవుతుందని వైద్యులు చూడా చెబుతున్న నేపథ్యంలో సీపీఆర్‌ డేన ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం

July 21

కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన తర్వాత ఇటీవల కాలంలో కార్డియాక్‌ అరెస్ట్‌, గుండె పోటు మరణాలు పెరుగుతున్నాయి. యుక్త వయస్సులో ఉన్న వారు, చిన్నారులు సైతం మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమై గుండె పోటు ఘటనలపై జాగ్రత్తగా ఉండాలని, సీపీఆర్‌ చేసే విధానంపై దృష్టి సారించాలని వైద్య శాఖకు ప్రభుత్వాలు సూచించిన పరిస్థితి. గుండె పోటు వచ్చిన వ్యక్తులకు వైద్యం అందేలోపే సీపీఆర్‌ ప్రక్రియ నిర్వహిస్తే ప్రాణాలు కాపాడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో జూలై 21న సీపీఆర్ డే సందర్భంగా.. గుండెపోటుకు గురైన వ్యక్తులకు వెనువెంటనే సీపీఆర్‌ (కార్డియో పల్మనరీ రీససిటేషన్‌)ను సరైన పద్ధతిలో చేస్తే వారి ప్రాణాలు రక్షించే అవకాశం ఉండే అంశంపై అవగాహనతో ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సీపీఆర్‌ ద్వారా గుండె పోటు మరణాలకు చెక్‌ పెట్టగలమని ఇటీవల చాలా ఘటనలు నిరూపించాయి. గుండెపోటు గానీ, ఆకస్మాత్తుగా గుండె కొట్టుకోవడం ఆగి పోయిన వ్యక్తులకు గానీ సీపీఆర్‌ చేసి ఫలితం రాబటితే బాధితుడికి పునర్జన్మ ఇచ్చినట్లే అవుతుందని వైద్యులు చూడా చెబుతున్న నేపథ్యంలో సీపీఆర్‌పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.

సీపీఆర్‌ ఎలా చేయాలి..?

గుండెపోటుకు గురైన బాధితుడిని బల్ల పరుపు స్థలంలో పడుకోబెట్టాలి. ఎడమ చేయి వేళ్ల మద్య కుడి చేయి వేళ్లు లేదా కుడి చేయి వేళ్ల మద్య ఎడమ చేతి వేళ్లు చొప్పించి బాధితుడి చాతి (గుండెపై కాదు) మద్య భాగంలో నొక్కాలి. క్రమంగా ప్రెస్‌ చేస్తూ ఉండాలి. నొక్కేటప్పుడు మన చేతులు, మోచేతులు బెండ్‌ కాకుండా బాధితుడి చాతి కనీసం 5 సెంటి మీటర్లు లోతుకు వెళ్లేలా నొక్కాలి. ఎముకలు విరిగిపోతాయని భయపడకూడదు. నిమిషానికి వంద సార్లు, అంతకంటే ఎక్కువగా చేయాలి. అలా ఒక్క నిమిషం వరకు చేశాక పల్స్‌ చెక్‌ చేయాలి. పల్స్‌ దొరక కపోతే మళ్లీ ఆ ప్రక్రియ కొనసాగించాలి. ఇలా ఒక్కో సారి 20-30 నిమిషాల వరకు చేస్తూనే ఉండాలి. ఇలా చేస్తున్నప్పుడు గుండె మళ్లీ కొట్టుకు నే అవకాశం ఉంటుంది. హార్ట్‌ ఎటాక్‌ వచ్చిన వెంటనే సీపీఆర్‌ చేస్తే ప్రయోజనం ఉంటుంది. చాలా ఆలస్యంగా చేస్తే లాభం ఉండదు. ఇవి చేస్తూనే 108 వాహనానికి, ఇతర ప్రైవేటు, ప్రభుత్వ ఆసుపత్రుల అంబులె న్స్‌లకు సమాచారం ఇవ్వాలి. వెంటనే వైద్య సహాయం నిమిత్తం ఆసుపత్రికి తరలించాలి.

సీపీఆర్‌ ప్రాధాన్యత ఏంటంటే..

సడెన్‌ కార్డియక్‌ అరెస్ట్‌ స్పందనలో కీలకమైన భాగము. గుండె అకస్మాతుగా కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మెదడు, ఇతర ముఖ్యమైన అవయవాలకు రక్తప్రసరణకు అంతరాయం ఏర్పడినప్పుడు సంభవిస్తుంది. వెంటనే సహాయం అందించకపోతే మెదడు దెబ్బతినడం గానీ నిమిషాల్లో మరణం సంభవించవచ్చు. సీపీఆర్‌ అనేది అత్యవసర వైద్య సేవలు వచ్చే వరకు ముఖ్యమైన అవయవాలకు రక్త ప్రసరణ అందించడం సహాయపడుతుంది. ఛాతిని నొక్కడం, రెస్క్యూ విధానాలను అందించడం ద్వారా శరీరమంతా ఆక్సిజన్‌తో కూడిన రక్తాన్ని అందిస్తుంది. ఇది మెదడు, ఇతర అవయవాలకు ఆక్సిజన్‌ అందించడంలో సహాయ పడుతుంది. నష్ట తీవ్రతను తగ్గిస్తుంది. బతికే అవకాశాలను పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు.

అసలు హార్ట్‌ ఎటాక్‌ ఎందుకొస్తుంది..?

రక్తనాళాల్లో రక్తం ప్రవహిస్తూ ఉంటుంది. ఈ రక్త ప్రవాహంలో మార్పులు వచ్చినప్పుడు సమస్యలు మొదలవుతాయి. అదే హార్ట్‌ ఎటాక్‌ దీన్నే వైద్య పరిభాషలో మయోకార్డియాల్‌ ఇనఫార్‌క్షన్‌ అంటారు. గుండె నొప్పి మందులకు గానీ విశ్రాంతికిగానీ తగ్గదు. పనితో నిమిత్తం లేకుండా, విశ్రాంతిగా ఉన్నప్పుడు, నిద్రలో కూడా గుండె పోటు రావచ్చు. ప్రత్యేకంగా ఉండే లక్షణాల్లోకి వెళ్తే విపరీతంగా చెమటలు కారడం, తల తిరగడం, వికారం, వాంతి, చేతులు కాళ్లు చల్లబడడం, కొన్ని సందర్భాల్లో మల మూత్రలు బట్టల్లో పోవడం జరుగుతుంది. ఈ లక్షణాలు కనిపిస్తే అరగంటలోపు డాక్టర్‌ను సంప్రదించాలి.

ఇది కూడా చదవండి: 30 ఏళ్ల వయసు దాటిందా..? వెంటనే మీరు చేయాల్సిన మొట్టమొదటి పనేంటంటే..!


గుండెపోటు లక్షణాలు కనిపించగానే రోగిని కదలనివ్వవద్దు. మంచంమీద పడుకోబెట్టాలి. అందుబాటులో ఉంటే నొప్పి తగ్గటానికి మార్పిన్‌, ఫెథిడిన్‌ అనే మందును ఇవ్వాలి. గుండెపోటు వచ్చిన వ్యక్తిని కదలనివ్వకుండా చేతుల మీద ఎత్తుకొని వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించాలి.

లక్షణాలు ఇవీ..

* ఇప్పుడు గుండె జబ్బుల సమస్యలు పెరుగుతున్నాయి. ఒకప్పుడు వృద్ధుల్లో మాత్రమే ఈ సమస్య కనిపించేది. పుట్టుకతోనే గుండెనొప్పి మొదలవుతుంది. 25సంవత్సరాలలోపు వారికి కూడా గుండె నొప్పి రావచ్చు. గుండె నొప్పి ఎదురొమ్ము మధ్యలో వస్తుంది. గుండెల మీద బరువు ఎత్తినట్లుగానీ, మంటలాగాగానీ బిగిసినట్లు, పిసికినట్లు నొప్పి రావచ్చు. నొప్పి ఎడమ చెయ్యి లోతట్టుకు, గడ్డంలోకి, మొడలోకి, పొట్టలోకి వెళ్తుంది. నొప్పి పని చేసిన, నడిచిన మెట్లెక్కినా, ఎక్కువగా ఆనందం పొందినా, మహిళతో దాంపత్యంలో ఉన్న సందర్భంలోనూ రావచ్చు.

* పెదాలు, నాలుక నీలంగా ఉంటుంది. చేతి గోళ్లు నీలంగా, ఉబ్బి ఉంటాయి. మాటి మాటికి ఊపిరితిత్తుల్లోకి నిమ్మ చేరుతుంది. ఆయాసంతో పిల్లలు కూర్చుంటారు. ఇతర పిల్లలతో సమానంగా ఎదుగుదల ఉండదు. అప్పడప్పుడు ఎక్కువగా నీలంగా మారుతుంటారు. జ్వరం దగ్గు ఉంటుంది.

చికిత్సలు

* మూడు రకాలుగా వైద్యాన్ని నిర్దేశిస్తారు. పీడీఏ జబ్బుకైతే ఐదు సంవత్సరాలలోపు ఆపరేషన్‌తో సరి చేస్తారు. వీఎస్‌డీ జబ్బుకు ఎడమ కుడి జటరికల మధ్య ఉంటే రంద్రం వయస్సు ముదిరే కొద్ది మూసుకపోయే అవకాశం ఉంది. ఎనిమిది సంవత్సరాల వయస్సుదాక చూసి ఆపరేషన్‌ చేయించాల్సి ఉంటుంది. ఏఎస్‌డీ జబ్బులో ఎడమ, కుడి కర్ణికల మధ్య గల రంధ్రాన్ని ఎనిమిది నుంచి 20సంవత్సరాల మధ్య ఆపరేషన్‌ చేసి మూసి వేయాలి. నీలం రంగుగా మారే జబ్బులున్న వారికి వసతులు ఉన్నట్లయితే త్వరితగతిన ఆపరేషన్‌ చేయించడం మంచిది.

గుండెపోటుకు తరువాత

* గుండెపోటు తరువాత ఆ వ్యక్తి జబ్బు పూర్తిగా తగ్గడానికి కొద్ది నెలలు జాగ్రత్తగా ఉండాలి. తీవ్రమైన మానసిక ఆందోళనను, శ్రమను కలిగించే పనులు చేయకూడదు.

* రోజు కొద్దీ దూరం నడుస్తూ క్రమ క్రమంగా దూరాన్ని పెంచాలి. నొప్పి వచ్చినా, ఆయసం వచ్చినా ఆగాలి. మాటి మాటికి ఆయసం వస్తే డాక్టర్‌ను సంప్రదించాలి.

* గుండె జబ్బు వచ్చిన వారికి దేనికి పనికి రారు అనే భావాన్ని కలిగించవద్దు. మూడు నెలలకోసారి డాక్టర్‌కు చూపించాలి.

పుట్టుకతో వచ్చే గుండె జబ్బులు

* తల్లి గర్భంలో ఉన్న మొదటి మూడు నెలల్లోనే గుండె నిర్మాణం జరుగుతుంది. జబ్బులు కూడా అప్పుడే తయారవుతాయి. కొన్ని రకాల జబ్బులతో పిల్లలు చిన్ని వయస్సులోనే చనిపోతారు. మరికొందరు మధ్యవయస్సులో మరణిస్తారు. ప్రస్తుతం గుండె ఆపరేషన్ల ద్వారా పిల్లలను బతికించుకునే నైపుణ్యం పెరిగింది.

Updated Date - 2023-07-21T12:13:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising