ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Moringa Tea: ఉదయం టీ తాగే అలవాటు ఉన్నవారికి ఈ విషయం తెలిస్తే ఫుల్‌ హ్యాపీగా ఫీలవుతారమో..!

ABN, First Publish Date - 2023-03-21T13:25:16+05:30

చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

Moringa tea
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

టీ, కాఫీలనేవి మనలో చాలామందికి ఉదయాన్నే అలవాటుగా ఉన్నాయి. కాఫీనో, టీనో తాగకపోతే ఆరోజు సాఫీగా సాగదు. మరి ఇలాంటి వారు ఇంకాస్త బెనిఫిట్స్ పొందాలంటే మొరింగ టీని అలవాటు చేసుకోవాల్సిందే.. దీనితో అనేక ప్రయోజనాలున్నాయి.

నిజానికి మొరింగ టీ అనేది మోరింగ చెట్టు ఆకుల నుండి తయారు చేయారు చేస్తారు. ఇంతకీ ఈ మొరింగా అంటే ఏంటో తెలుసా..! మన మునగచెట్టు ఆకులతో చేసే టీ.. దీనిని మన సాంప్రదాయ వంటలలోనే కాదు. ఆరోగ్యం కోసం మన వైద్యంలోనూ ఎక్కువగా వాడుతుంటాం. అయితే మునగ ఆకుతో చేసే ఈ టీని మిరాకిల్ టీ అని కూడా అంటారు. దీనితో అనేక ప్రయోజనాలున్నాయి. అవేంటంటే..

బరువు తగ్గడం: శరీరంలోని కొవ్వు, కార్బోహైడ్రేట్ల స్థాయిలను తగ్గించడం ద్వారా మొరింగా టీ బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

రక్తపోటు నియంత్రణ: మొరింగా టీ రక్తపోటు స్థాయిలను నియంత్రించడంలోనూ, సిస్టోలిక్, డయాస్టొలిక్ రక్తపోటు రెండింటిలోనూ గణనీయమైన తగ్గుదలను చూపిస్తుంది.

యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు: మొరింగ టీలో ఫ్లేవనాయిడ్లు, ఫినోలిక్ యాసిడ్‌లతో ఇది గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంతో సహాయపడుతుంది.

రోగనిరోధక వ్యవస్థ మద్దతు: మొరింగ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి, హానికరమైన వ్యాధికారక కారకాల నుండి శరీరాన్ని రక్షించడంలో సహాయపడుతుంది.

ఇది కూడా చదవండి: చదువుకునే పిల్లల స్టడీ టేబుల్ ఈ దిక్కులో ఉంటే ఎలాంటి ఫలితం ఉంటుందంటే.. !

యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్: మొరింగ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి, ఇది చర్మాన్ని యవ్వనంగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

జీర్ణ ఆరోగ్యం: గట్‌లో మంటను తగ్గించడం, ఉబ్బరం, మలబద్ధకం, విరేచనాలు వంటి జీర్ణ సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది.

పోషకాలు ఎక్కువగా ఉంటాయి: విటమిన్ సి, విటమిన్ ఎ, పొటాషియం, కాల్షియంతో సహా విటమిన్లు, ఖనిజాల సమృద్ధిగా మొరింగ టీలో ఉన్నాయి.

Updated Date - 2023-03-21T13:25:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising