ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Sugarcane Juice: ఆరోగ్యానికి మంచిది కదా అని చెరకు రసాన్ని అదే పనిగా తాగితే జరిగేది ఇదే.. నష్టాలు కూడా ఉన్నాయని తెలిస్తే..!

ABN, First Publish Date - 2023-06-17T11:32:02+05:30

చెరకు రసం నిలవ ఉండని కారణంగా, అది త్వరగా విషపూరితం అవుతుంది.

stomach problems
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తీపి పదార్థాలంటే అందరికీ మక్కువే. ముఖ్యంగా చక్కెరన్నా, బెల్లంతో చేసిన పదార్థాలన్నా ఇష్టంగా తింటారు. అదే చెరకు విషయానికి వస్తే చెరకు గెడలను తినడానికి, వాటి రసం తాగడానికి చాలా మంది ఇష్టం చూపిస్తారు. వేసవిలో అయితే పానీయాలను ఇష్టంగా తాగేవారికి చెరకు రసం ఇంకా నచ్చుతుంది. ఇందులో సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ ఉంటాయి. ఈ చక్కెర అధికంగా ఉండే పానీయం ప్రతి ఒక్కరినీ హైడ్రేట్‌గా ఉంచుతుంది. మండే ఎండల్లో చెరుకు రసం తాగినప్పుడల్లా శరీరానికి చాలా బలం వస్తుంది.

కానీ ఏదైనా శరీరానికి మంచి చేస్తున్నాసరే.. మితంగానే తీసుకోవాలి. చెరకు రసాన్ని కాస్త మోతాదు మించి తీసుకున్నా అది చాలా దుష్ఫలితాలను కలిగిస్తుంది. అవేంటో ఒక్కసారి తెలుసుకోండి.

చెరకు రసంతో 5 దుష్ప్రభావాలు

1) చెరకు రసంలో చాలా కేలరీలు ఉంటాయి

చెరకు క్యాలరీలతో నిండి ఉంటుంది. 100 గ్రాముల చక్కెరలో దాదాపు 270 కేలరీలు ఉంటాయి. అందుకే రోజుకు ఒక గ్లాసు చెరుకు రసం తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. అయితే వేసవిలో చెరుకు రసం ఎక్కువగా తాగితే ఊబకాయం, షుగర్ రెండూ పెరిగే అవకాశం ఉంటుంది.

2) నిద్రలేమికి గురయ్యే అవకాశం ఉంది.

చెరకు రసంలో పొలికోసనాల్ ఉంటుందని నమ్ముతారు. ఈ సమ్మేళనం శరీరంలో తేలికపాటి ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. దీన్ని అధికంగా తీసుకోవడం వల్ల వెర్టిగో, నిద్రలేమి, లూజ్ మోషన్స్‌కు కారణమవుతుంది.

3) రక్తాన్ని పలుచగా చేస్తుంది

చెరకు రసంలో ఉండే పోలికోసనాల్ రక్తాన్ని పలుచగా చేస్తుంది. అందువల్ల, చెరకు రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది, ఇది శరీరం నుండి అధిక రక్తస్రావానికి దారితీస్తుంది. అందువల్ల, రక్తాన్ని పలచబరిచే ఏదైనా ఔషధం తీసుకుంటే కనక, చెరకు రసం తీసుకోకపోవడం మంచిది.

ఇది కూడా చదవండి: జామ ఆకులను పెద్దగా పట్టించుకోం కానీ.. వాటితో ఇన్ని లాభాలు ఉంటాయని కలలో కూడా ఊహించి ఉండరు..!

4) నిలవ ఉండదు

చెరకు రసం నిలవ ఉండని కారణంగా, అది త్వరగా విషపూరితం అవుతుంది. మామూలుగా చెరకు 20 నిమిషాల కంటే ఎక్కువసేపు నిల్వ ఉంచినప్పుడు ఆక్సీకరణం చెందుతుంది, ఇది శరీరానికి చాలా హానికరం. ఆక్సీకరణ విషంలాగా పనిచేసి కడుపు సమస్యలకు కారణమవుతుంది. అందుకే చెరుకు రసం తాగాలంటే తాజాగా ఉన్నది మాత్రమే తీసుకోవాలి.

5) వ్యాధుల ప్రమాదం

చెరుకు అమ్మేవారు యంత్రాన్ని సరిగా శుభ్రం చేయకపోయినా, రసం తీసి వడగట్టేప్పుడు ఈగలు వంటివి ముసిరినా దీనితో అనేక అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి తగినంత శుభ్రమైన వాతావరణంలోనే చెరకు రసాన్ని తాగేందుకు చూడాలి. అదీ తాజాగా మాత్రమే తీసుకోవాలి.

Updated Date - 2023-06-17T11:32:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising