ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Hair Loss: ఇప్పటి యూత్ సమస్య ఇదే.. బట్టతల ఖాయమే అని తెలిసినా.. జుట్టు రాలిపోవడాన్ని ఎలా తగ్గించొచ్చంటే..!

ABN, First Publish Date - 2023-09-20T14:42:59+05:30

ఆడవారు బిగుతుగా ఉండే విధంగా జుట్టుపై ఎక్కువ ఒత్తిడిని కలిగించే ఇతర హెయిర్‌స్టైల్ చేయడం మానుకోవాలి.

Hair Care Tips

కాలుష్యం కారణంగా వెంట్రుకలు విపరీతంగా రాలిపోవడం అనేది చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఈ సమస్య అన్ని వయసుల వారిలోనూ కనిపిస్తుంది. దీని వెనుక ముఖ్య కారణాలలో కాలుష్యం, విషపూరిత రసాయనాల వాడకం, UV కిరణాలకు గురికావడం వంటి అనేక బాహ్య కారకాల వల్ల బట్టతల ఏర్పడుతుంది. కానీ అలాంటి సందర్భాలలో, సరైన చికిత్స, రసాయనాలు, కాలుష్య కారకాలకు గురికాకుండా ఉండటం ద్వారా జుట్టు రాలడాన్ని నియంత్రించవచ్చు.

వారసత్వం వల్ల వచ్చే బట్టతల

నేషనల్ సెంటర్ ఫర్ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, జుట్టు రాలడం అనేది తల్లిదండ్రులకు రెండు వైపుల నుండి వారసత్వంగా వస్తుంది. జుట్టు రాలడం నమూనా కూడా వారసత్వంగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి, కొంతమంది వ్యక్తులు వారి తల మధ్యలో సరిగ్గా బట్టతల రావడం, సాధారణంగా, జుట్టు పెరుగుదల తగ్గుముఖం పట్టడం వంటి లక్షణాలతో మొదలవుతుంది.

ఇది కూడా చదవండి: 20 ఏళ్ల వయసులో ఏం తినాలి..? 40 ఏళ్ల వయసులో ఏమేం తినొచ్చు.. అసలు రోగాలే రాకుండా ఉండాలంటే..!

బట్టతల ఆలస్యం

వంశపారంపర్యంగా వెంట్రుకలు రాలిపోవడం మామూలుగా జరిగే విషయమే.. అయితే, చేయగలిగేది జీవనశైలిలో కొన్ని విషయాలను పాటిస్తూ, బట్టతల ప్రక్రియను ఆలస్యం చేయడం లేదా నెమ్మది చేయడం. హెయిర్ స్ట్రాండ్స్ ప్రొటీన్‌తో తయారవుతాయి కాబట్టి డైట్‌లో ప్రొటీన్ లోపిస్తే, జుట్టు రాలడానికి వంశపారంపర్య కారణం అవుతుంది. బట్టతల తగ్గడానికి, తప్పనిసరిగా నట్స్, చీజ్, చేపలు, గుడ్లు, మాంసం, చికెన్ వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్‌ను తీసుకోవాలి.

ఈ ఆహారాలు బట్టతలని తగ్గించడమే కాకుండా జుట్టును బలంగా, మృదువుగా చేస్తాయి. అంతే కాకుండా జుట్టును రోజూ సున్నితంగా దువ్వుకువాలి. ఆడవారు బిగుతుగా ఉండే విధంగా జుట్టుపై ఎక్కువ ఒత్తిడిని కలిగించే ఇతర హెయిర్‌స్టైల్ చేయడం మానుకోవాలి. బదులుగా, తలకు రెగ్యులర్ మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. బట్టతల ఆలస్యం అవుతుంది. అన్ని జాగ్రత్తలు, చర్యలు తీసుకున్నప్పటికీ జుట్టు రాలడం తగ్గకపోతే, వైద్య సలహా తీసుకోవడం మంచిది.

Updated Date - 2023-09-20T14:43:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising