ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Fizzy Drink: రోజూ డ్రింక్స్ వరసబెట్టి తాగేస్తున్నారా? అయితే ప్రమాదం అంచున ఉన్నట్టే..? వీటిలో వాడే ప్రోసెస్ చక్కెర ఎంత ప్రమాదమో తెలుసా?

ABN, First Publish Date - 2023-04-18T16:39:18+05:30

చక్కెరకన్నా సహజంగా లభించే పండ్లను తీసుకోవడం ద్వారా వేసవి వేడిని, దాహాన్ని తగ్గించుకోవచ్చు.

Health Issues
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేసవి వచ్చిందంటే చాలు కూల్ డ్రింక్స్ లేనిదే రోజు గడవదు. సహజంగా దొరికే పండ్లతో జ్యూస్‌ల కన్నా, డ్రింక్ తాగేసి దాహాన్ని తీర్చుకోవాలనుకుంటాం. కానీ అందులో కలిపే ప్రోసెస్ చేసిన చక్కెర వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదం ఉన్నదని అధ్యయనాలు చెబుతున్నాయి. ఫిజీ డ్రింక్స్ (కార్బోనేటేడ్ పానీయాలు) నివారించేందుకు కనీసం 45 మంచి కారణాలు ఉన్నాయని తాజా అధ్యయనం తెలిపింది. చక్కెర నియంత్రణపై చైనా, యునైటెడ్ స్టేట్స్ నుండి పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు.

ఫిజీ డ్రింక్స్‌లో సాధారణంగా చక్కెర ఎక్కువగా ఉంటుంది, ఇవి ఆరోగ్యానికి మేలు చేసే దానికంటే ఎక్కువ హానికరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ప్రాసెస్ చేయబడిన, ప్యాక్ చేయబడిన ఆహారం, టేబుల్ షుగర్, ఇతర స్వీటెనింగ్ ఏజెంట్లలో కలిపిన చక్కెరపై జరిగిన అధ్యయనంలో ఈ చక్కెర అధిక వినియోగం 45 ప్రతికూల ఆరోగ్య ఫలితాలతో ముడిపడి ఉందని సూచించింది. వీటిలో అధిక బ్లడ్ షుగర్, అధిక రక్తపోటు, ఊబకాయం, బరువు పెరుగుట, దంత క్షయం, శ్వాసకోశ సమస్యలు, డిప్రెషన్ వంటివి వచ్చే ప్రమాదం ఉందని తేల్చింది.

శీతల పానీయాన్ని పూర్తిగా వదులుకోవాలా?

రోజుకు 25 గ్రా కంటే తక్కువకు తగ్గించడం, చక్కెర పానీయాల వినియోగాన్ని వారానికి ఒకటి కంటే తక్కువ తీసుకోవడం(సుమారుగా వారానికి 200-355 ml) పరిమితం చేయడం మంచిదని తేల్చింది.

ఇది కూడా చదవండి: కడుపు ఉబ్బరంతో ఇబ్బంది పడుతున్నారా..? అయితే వీటిని తినడం తగ్గించండి.. లేకపోతే గ్యాస్ ప్రాబ్లం పక్కా..!

చక్కెర అనేది కార్బోహైడ్రేట్ రూపం, దీనిని తీసుకోవడం వల్ల మన శరీరం గ్లూకోజ్‌గా మారుస్తుంది, శక్తి కోసం ఉపయోగిస్తుంది. అయితే, ఇదంతా తీసుకునే చక్కెర విధానాన్ని బట్టి ఉంటుంది.

చక్కెర అనేది సుక్రోజ్ ఇది అన్ని ఆకుపచ్చ మొక్కలలో సహజంగా ఉంటుంది. అందుకే దీనిని సహజ చక్కెర అని కూడా పిలుస్తారు, ఇది పండ్లు, కూరగాయలు, పాల ఉత్పత్తులలో విస్తృతంగా కనిపిస్తుంది. అయితే టేబుల్ షుగర్ లేదా జంక్ ఫుడ్‌లో ఉపయోగించే రకంగా మారడానికి ప్రాసెసింగ్‌లో చేసినప్పుడు మాత్రం ప్రాణాంతకంగా మారుతుంది.

Updated Date - 2023-04-18T16:46:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising