ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

High Blood Pressure : ఇలా వరుసగా పండ్ల జ్యూస్ తీసుకోండి చాలు... బిపీ అదుపులో ఉండకపోతే చూడండి.. ఎలా తీసుకోవాలంటే...!

ABN, First Publish Date - 2023-05-12T13:31:44+05:30

దానిమ్మ జ్యూస్‌లో సహజసిద్ధమైన ఏసీఈ ఇన్హిబిటర్స్‌ ఉంటాయి.

more risk
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వయసు పెరుగుతున్న కొద్దీ ఆరోగ్యంలో నేటి కాలంలో ఎన్నో మార్పులు. సరైన ఆరోగ్యంతో, సరైన జీవనశైలితో ఉన్న వ్యక్తులు నేటి ప్రపంచంలో తక్కువనే చెప్పాలి. ముఫ్పై దాటకుండానే జీవన శైలిలో వస్తున్న మార్పులతో శరీరానికి మనసుకు అనేక రోగాలు చుట్టుకుంటున్నాయి. ముఖ్యంగా బిపీతో మొదలైన అనారోగ్య సమస్యలు పెరుగుతూనే ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీపిని కంట్రోల్‌లో ఉంచాలంటే ఏంచేయాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బీపి కంట్రోల్‌‌లో ఉంటుంది. తెలుసుకుందాం.

లో ఫ్యాట్‌మిల్క్‌..

రోజూమూడు గ్లాసుల లో ఫ్యాట్‌ మిల్క్‌ను తీసుకోవడం వల్ల బీపీని ఎదుర్కోవచ్చట. ఎందుకంటే అధికరక్తపోటుకు కాల్షియంకు సంబంధం ఉందని అధ్యయనంలో తేలింది. కాల్షియం లోపంతో బాధపడేవారిలో అధిక రక్తపోటు కనిపిస్తుంది. అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు లో ఫ్యాట్‌ మిల్క్‌ తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి నుంచి బయటపడవచ్చు. హోల్‌ మిల్క్‌తో పోల్చితే లో-ఫ్యాట్‌ మిల్క్‌లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా లో ఫ్యాట్‌లో కచ్చితమైన శాతంలో ఉండే ప్యాట్‌ కాల్షియంను అబ్జార్బ్‌ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

బీట్‌రూట్‌ జ్యూస్‌..

మామూలుగా బీట్ రూట్ తినడానికి అంతగా ఇష్టపడని వారు జ్యూస్ రూపంలో తీసుకోవడం మంచిది. ఇది ఆరోగ్య పరంగా మంచి ఫలితాలను ఇస్తుంది. రక్తపోటును తగ్గించడంలో ఈజ్యూస్‌ బాగా పనిచేస్తుంది. ఈరోజు ఒక గ్లాస్‌ బీట్‌రూట్‌ జ్యూస్‌ తగ్గినా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. బీట్‌రూట్‌లో సహజసిద్ధంగా లభించే నైట్రేట్‌ ఉంటుంది. శరీరం ఈ నైట్రేట్‌ను నైట్రిక్‌ఆక్సైడ్‌గా కన్వర్ట్‌ చేసుకుంటుంది. ఇది రక్తనాళాలను రిలాక్స్‌ చేస్తుంది.

హైబిస్కస్‌ టీ..

ఇందులోఆరోగ్యగుణాలు ఎక్కువే ఉంటాయి. మందార పూలలో సహజసిద్ధమైన ఏసీఈ ఇన్హిబిటర్స్‌ ఉంటాయి. రోజూ ఒకసారి హైబిస్కస్‌ టీ తీసుకుంటే ఒక పాయింట్‌ రక్తపోటు తగ్గుతుంది. రోజూ మూడు సార్లు తీసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి.

ఇది కూడా చదవండి: సబ్బులోని సువాసనలు మిమ్మల్ని దోమలకు మరింత ఆకర్షణీయమైన లక్ష్యంగా చేస్తాయి.

దానిమ్మ జ్యూస్‌..

దానిమ్మ గింజలు తీయగా పిల్లల్ని, పెద్దలకు చక్కని అల్పాహారంగా ఇష్టపడతారు. అధికరక్తపోటు పై యాంజియోటెన్సిన్‌ కన్వర్టింగ్‌ ఎంజైమ్స్‌ ప్రభావం ఉంటుంది. ఏసీఈ ప్రభావం ఎక్కువ ఉంటే రక్తనాళాలపై ఎక్కువ ఒత్తిడి పడిరక్తపోటు పెరుగుతుంది. అయితే దానిమ్మ జ్యూస్‌ తీసుకోవడం వల్ల ఆ ఎంజైమ్స్‌ విడుదల నిరోధింపబడుతుంది. దానిమ్మ జ్యూస్‌లో సహజసిద్ధమైన ఏసీ ఈ ఇన్హిబిటర్స్‌ ఉం టాయి. దానిమ్మ జ్యూస్‌ తీసుకోవడం వల్ల సిస్టోలిక్‌ బ్లడ్‌ప్రెషర్‌ 30 శాతం మేర తగ్గుతుంది.

కాన్‌బెర్రీ జ్యూస్‌..

రక్తనాళాల డ్యామేజ్‌ను అరికట్టడంలో బాగా ఉపయోగపడుతుంది. ఈ జ్యూస్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు రక్తనాళాల్లో రక్తసరఫరాను పెంచడంలో సహాయపడతాయి. రోజూ రెండు కప్పులు కాన్‌బెర్రీజ్యూ్‌స తీసుకుంటే రక్తపోటు రిస్క్‌ దరిచేరకుండా ఉంటుంది. ఇవన్నీ బీపిని కంట్రోల్ చేయడానికి చక్కని ప్రత్యామ్నాయాలు. రోజూ ట్యాబ్లెట్లు మింగడం కన్నా జ్యూస్ లు తీసుకోవడం చక్కని పరిష్కారం.

Updated Date - 2023-05-12T13:35:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising