ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Tea: ఈ విషయం తెలియక రోజూ అందరూ చేస్తున్న మిస్టేక్ ఇదే.. టీ తో కలిపి వీటిని అస్సలు తినకండి..!

ABN, First Publish Date - 2023-07-15T10:57:41+05:30

టీని వ్యసనంగా అదే పనిగా తీసుకునేవారూ ఉన్నారు.

Heart attack cases
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వేడి వేడి టీ, లేదా కాఫీ ఉదయాన్నే తాగితే కానీ రోజు మొదలవదని మనలో చాలామంది దీనికి అలవాటు పడిపోయాం. అయితే ఉదయం వేళ సరే మరి మధ్యాహ్నం భోజనం అయ్యాకా తీసుకునే టీలోకి మాత్రం కాసిన్ని బిస్కెట్స్, లేదా కమ్మని రస్కులో టీతోపాటు కలిపి తీసుకోవడం కూడా మనలో చాలామందికి ఉన్న అలవాటే.. ఇలా తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే శరీరానికి, ఆరోగ్యానికి మంచిది కాదట. టీతో బిస్కట్స్, బన్ వంటి వాటిని తీసుకోవడం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని పరిశోధకులు అంటున్నారు. టీతో తీసకునే పదార్థాలతో డయాబెటిక్, హై బీపీ వంటి అనారోగ్య సమస్యలు రావచ్చు.

భారతదేశంలో టీని తాగేవారు ఎక్కువే.. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ఇలా ప్రతి వేళలోనూ టీని తాజాగా ఉంచే పానీయంగా తీసుకుంటూ ఉంటారు. టీని వ్యసనంగా అదే పనిగా తీసుకునేవారూ ఉన్నారు. టీతో మెదడుకు శక్తి, శరీరానికి ఉత్తేజం కలుగుతాయని దీనిని తాగుతూ ఉంటారు. టీని తాగడం వల్ల నిద్ర మత్తు వదులుతుందని, కడుపుని శుభ్రంగా ఉంచుతుందని, భావిస్తారు. అయితే కొన్ని పదార్థాలను టీతో కలిపి తీసుకుంటే ఇబ్బంది తప్పదట. దీనితో అనేక ప్రయోజనాలు ఎలా ఉన్నాయో, టీతో పాటు కలిపి తీసుకునే బిస్కెట్స్, బన్, రస్కులు వంటి మైదా ఆధారిత పదార్థాలతో అన్ని అనారోగ్యా ఇబ్బందులూ ఉన్నాయి. ఇది DNA ను దెబ్బతీస్తుంది.

అధిక రక్తపోటు..

యువతలో గుండెపోటు సమస్య పెరగడానికి టీ, బిస్కెట్లు తినడం వల్ల కూడా ఈ సమస్య పెరుగుతుంది. బిస్కెట్స్‌లో అధికంగా ఉండే సోడియం వల్ల ఇది రక్తపోటును పెంచుతుంది. దీనివల్ల గుండె జబ్బుల ప్రమాదం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

ఇది కూడా చదవండి: రోజూ పొద్దునే చాలా మంది ఎదుర్కొనే సమస్య ఇదే.. రాత్రిళ్లు ఈ గింజలను కనుక ఇలా వాడితే..!


మధుమేహం, మలబద్దకం

బిస్కెట్లను తయారు చేయడానికి చక్కెరను ఉపయోగిస్తారు. వీటిని తీసుకోవడం వల్ల ఇన్సులిన్ శోషణకు ఆటంకం కలుగుతుంది. ఇది మధుమేహం ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. అలాగే శుద్ధి చేసిన మైదా వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. ఇది మలబద్దకానికి కారణం అవుతుంది.

హార్మోన్ హెచ్చుతగ్గులు..

బిస్కెట్లు, బన్స్ తయారీకి ఉపయోగించే మైదా పిండిని ప్రాసెస్ చేయడం వల్ల దీనితో చేసిన ఆహారం DNA ను దెబ్బతీస్తుంది. ఈ ఆహారంలో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కూడా ఉంటుంది కనుక ఇది శరీరంలోని హార్లోన్ల హెచ్చుతగ్గులకు సాయపడుతుంది.

వేయించిన పప్పులు వీటితో తీసుకోండి.

1. టీతో వేయించిన పప్పులను తీసుకోవడం వల్ల అవి ఇన్సులిన్‌ను నియంత్రించడం ద్వారా రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతాయి.

2. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే బి కాంప్లెక్స్ ఉంటుంది.

3. జీర్ణశక్తిని పెంచే పీచు ఉంటుంది.

4. ఎముకలకు బలాన్నిచ్చే కాల్షియం, మెగ్నీషియం లభిస్తాయి.

5. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ కోలిన్‌ని కలిగి ఉంటుంది.

Updated Date - 2023-07-15T10:57:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising