Health Tips: నీళ్లు తాగేటప్పుడు అందరూ చేసే 4 మిస్టేక్స్ ఇవే.. 40 ఏళ్ల వయసు వచ్చినా.. 24 ఏళ్ల కుర్రాడిలా కనిపించాలంటే..
ABN, First Publish Date - 2023-07-07T11:30:05+05:30
దాహం వేసింది కదాని ఒకేసారి నీరు త్రాగకూడదు.
శరీరానికి నీరు చాలా అవసరం. ఇది ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాదు. యవ్వనంగా ఉంచడంలోనూ సహాయపడుతుంది. ఒక్క తాగడానికే అని కాదు నీరు చాలా పనులకు ముఖ్యంగా స్నానం చేయడం, శుభ్రం చేయడం, బట్టలు ఉతకడం ఇలా చాలా పనులకు నీరు కావాలి. నీరు లేని మానవ జీవితాన్ని ఊహించడం కూడా కష్టం. రోజులో కావాల్సిన నీటిని శరీరానికి అందిస్తే అది మనల్ని యవ్వనంగా మారుస్తుంది. ఈ నాలుగు నియమాలతో 40 సంవత్సరాల వయస్సులో కూడా, 24 సంవత్సరాల తాజాదనం మన ముఖంలో ఉంటుంది.
1. మొదటి నియమం ఏమిటంటే, ఆహారం తిన్న వెంటనే నీరు త్రాగకూడదు. భోజనం చేసిన అరగంట తర్వాత నీరు త్రాగాలి. ఇది కాకుండా, నిలబడి కూడా నీరు త్రాగకూడదు, ఇది ఆరోగ్యానికి మంచిది కాదు. భోజనం తర్వాత ఏదైనా త్రాగాలనుకుంటే, పాలు, పెరుగు, మజ్జిగ లాంటివి తీసుకోవచ్చు.
2. రెండవ నియమం, దాహం వేసింది కదాని ఒకేసారి నీరు త్రాగకూడదు, నెమ్మదిగా సిప్ చేయాలి. ఇది పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
ఇది కూడా చదవండి: ఈ 9 సీక్రెట్ టిప్స్‌ను పాటించండి చాలు.. ఇంట్లో చేసే బిర్యానీకి కూడా స్టార్ హోటళ్లలో ఉండే టేస్ట్..!
3. అయితే, మూడవ నియమం, చల్లని నీరు త్రాగడానికి దూరంగా ఉండాలి. ఎంత దాహం వేసినా చల్లటి నీళ్లు అస్సలు తాగకూడదు. వేసవిలో మట్టి కుండలోని నీటిని తాగడం మంచిది.
4. ఉదయాన్నే ఫ్రెష్ అయిన తర్వాత, ఒక గ్లాసు గోరువెచ్చని నీరు త్రాగాలి. దీని తర్వాత మాత్రమే అల్పాహారం, టీ లాంటివి త్రాగాలి. ఇలా చేయడం వల్ల శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ మూత్రం సహాయంతో బయటకు వస్తాయి.
Updated Date - 2023-07-07T11:30:05+05:30 IST