Health Tips: నోరు ఎప్పుడూ ఇలాగే ఉంటోందా..? అయితే ఈ 5 వ్యాధులే అసలు కారణం కావచ్చు..!
ABN, First Publish Date - 2023-06-17T16:57:06+05:30
నోటి దుర్వాసన, దంత క్షయాన్ని ఎప్పటికప్పుడు నివారించాలి.
ఏ వ్యాధి అయినా శరీరంలో లక్షణాల ద్వారానే బయటపడుతుంది. మరీ కొన్ని అయితే లాలాజలం ద్వారా లేదా నోటి ఆరోగ్యం ద్వారా తెలుస్తాయి. నోరు పొడిబారడం అనేక వ్యాధులకు సంకేతం. ఇది ముందుగానే గుర్తించడం ముఖ్యం. చాలామంది నోరు పొడిబారడాన్ని ఒక సాధారణ లక్షణంగా భావిస్తారు.
కానీ అది ఈ ఐదు తీవ్రమైన వ్యాధులకు హెచ్చరిక కావచ్చు. దీనిపై ఓ బ్రిటీష్ డెంటిస్ట్ తెలిపిన వివరాల ప్రకారం.. నోరు నిరంతరం పొడిబారడం అనేది శరీరంలో మరెక్కడైనా లోపం ఉన్నట్లు సంకేతం అని ఆయన చెప్పారు. పొడిగా ఉన్న నోరు, అంటుకునే నోరు, గొంతు నొప్పి, నమలడం లేదా మింగడం కష్టంగా ఉండటం, నోటి దుర్వాసన వంటి లక్షణాలతో కనిపించవచ్చు.
నోరు పొడిబారడం ఈ ఐదు వ్యాధుల లక్షణం కావచ్చు.
స్ట్రోక్, మధుమేహం, అల్జీమర్స్, HIV, స్జోగ్రెన్ సిండ్రోమ్ కు కారణం కావచ్చు.
ఇది కూడా చదవండి: అవునా..? గుడ్డును రోజూ తినడం వల్ల కూడా నష్టాలున్నాయా..? ఎవరెవరు ఇలా చేయకూడదంటే..!
మన లాలాజల గ్రంథులు నోటిని తేమగా ఉంచడానికి తగినంత లాలాజలాన్ని ఉత్పత్తి చేయడం కావడాన్ని జిరోస్టోమియా అంటారు. నోటి ఆరోగ్యం మన శరీరానికి చాలా ముఖ్యం నోటి దుర్వాసన, దంత క్షయాన్ని ఎప్పటికప్పుడు నివారించాలి. ఇది జీర్ణ క్రియపై ప్రభావం చూపకుండా చూడాలి.
ప్రతి ఆరునెలలకోసారి తప్పనిసరిగా దంతవైద్యుడిని సందర్శించాలి. తద్వారా నోటి ఆరోగ్యంతో పాటు శరీరంలోని ఇతర సమస్యలను కూడా గుర్తించవచ్చు. ఫ్లోరైడ్ టూత్‌పేస్ట్‌తో రోజుకు రెండుసార్లు రెండు నిమిషాల పాటు దంతాలను బ్రష్ చేయండి, అలాగే క్రమం తప్పకుండా gargle (పుక్కిలించు) చేయడం , మౌత్ వాష్ ఉపయోగించడం చేయాలి.
Updated Date - 2023-06-17T16:57:06+05:30 IST