ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Weight Loss: ఒకప్పుడు 263 కిలోల బరువు..రెండేళ్లలోనే ఏకంగా 159 కిలోల బరువు ఎలా తగ్గాడంటే..!

ABN, First Publish Date - 2023-06-06T10:50:16+05:30

అనారోగ్యకరమైన వాటిని తొలగించి, ఆహారంలో ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకున్నాడు.

, home remedies.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బరువు పెరగడం అనేది తెలియకుండానే జరిగిపోయే ప్రక్రియ. ఇది శరీరాన్ని పెంచేయడమే కాకుండా, బరువుతో పాటు మానసికంగా కుంగిబాటును కూడా తెచ్చిపెడుతుంది. మనిషిలో ఆత్మవిశ్వాసం తగ్గించి కుంగిపోయేలా చేస్తుంది. నలుగురిలోనూ కలిసి తిరగడానికి సిగ్గుపడేలా చేస్తుంది. సరైన బట్టలు వేసుకోలేక, చురుగ్గా ఉండలేక ఒక సందర్భంలో తమ పనులు తామే చేసుకోలేని ఇబ్బందిలో పడేస్తుంది. మరి ఈ ఊబకాయాన్ని అధిగమించాలంటే ఏంచేయాలి. దీనికి కఠోరమైన దీక్షా, పట్టుదల అవసరం. అలా ఊబకాయాన్ని అధిగమించి సన్నబడినవారు మరెందరికో ఆదర్శంగా నిలుస్తారు.

ఊబకాయం అనేక ప్రాణాంతక వ్యాధులకు కారణం కావచ్చు. దీనివల్ల మధుమేహం, క్యాన్సర్, గుండెపోటుకు గురవుతారు. బరువు పెరగడం సులభం. కానీ తగ్గించడం కూడా అంతే కష్టం. దీనికోసం జిమ్, డైటింగ్, వంటి నివారణలు ఎన్ని చేసినా ఒక్కోసారి ఫలితం ఉండకపోవచ్చు. వీటితో ఫలితం అంత త్వరగా కనిపించదు. ఎందుకంటే బరువు తగ్గడం సుదీర్ఘ ప్రక్రియ. జర్మనీకి చెందిన 38 ఏళ్ల మైఖేల్ మెహ్లెర్ మూడేళ్లలో చాలా కష్టపడి 159 కిలోల బరువు తగ్గాడు. అతని బరువు తగ్గే ప్రయాణాన్ని తెలుసుకుందాం.

మొదట బేరియాట్రిక్ స్లీవ్ సర్జరీని ఆశ్రయించాడు. 263 కిలోల మైఖేల్ మెహ్లర్ బరువు తగ్గడానికి ముందు, అతని చొక్కా 10XLసైజ్ లో ఉండేది. 74 అంగుళాల సైజు ప్యాంటు వేసుకునేవాడు. అంతేకాదు మూడు అడుగులు కూడా సరిగ్గా నడవలేని పరిస్థితి వచ్చిపడింది. ఈ ఇబ్బందుల్లో మూడు సంవత్సరాల క్రితం, మెహ్లర్ తన బరువు తగ్గించే ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. 2020 సంవత్సరంలో, అతను మొదట బారియాట్రిక్ స్లీవ్ సర్జరీ చేయించుకున్నాడు. ఆ తర్వాత వెంటనే 23 కిలోల బరువు తగ్గించుకున్నాడు. ఈ సర్జరీలో పొట్టలో ఎక్కువ భాగాన్ని శస్త్ర చికిత్స ద్వారా కట్ చేసి తొలగిస్తారు. దీని వల్ల పొట్ట చిన్నదిగా మారి, ఆహారాన్ని ఎక్కువ మోతాదులో తీసుకోవడం అనేది తగ్గిపోతుంది. తక్కువ తినడంతోనే కడుపు నిండుతుంది.

ఇది కూడా చదవండి: రోజూ పొద్దున్నే అందరూ కామన్‌గా చేసే బిగ్ మిస్టేక్ ఇదే.. టూత్‌పేస్ట్‌ను వేసే ముందే బ్రష్‌ను కడిగే అలవాటుందా..?

జిమ్‌లో గంటల తరబడి గడపడంతో..

మైఖేల్ మెహ్లర్ బరువు తగ్గించే ప్రయాణం ప్రారంభమైనప్పుడు వారానికి ఆరుసార్లు రెండు గంటల బరువు శిక్షణ తీసుకునేవాడు. రెండు గంటల కార్డియో శిక్షణ. తరవాత ఆహారం, వ్యాయామం ద్వారా, శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తొలగించడంలో మరింత సహాయపడింది. డైట్ కూడా పూర్తిగా మార్చేశాడు. నుటెల్లా, జర్మన్ కోల్డ్ కట్స్, బ్రెడ్ రోల్స్ వంటి అనారోగ్యకరమైన ఆహారాలను తినే మెహ్లర్ దానిని పూర్తిగా మానేసాడు. తన బరువు తగ్గించే ప్రయాణంలో వ్యాయామానిదే ముఖ్యమైన పాత్రని పూర్తిగా నమ్మాడు.

డైట్ ప్లాన్ అలాంటిది.

మైఖేల్ మెహ్లర్ తన డైట్ చార్ట్‌ను మార్చాడు. అనారోగ్యకరమైన వాటిని తొలగించి, ఆహారంలో ఆరోగ్యకరమైన వాటిని చేర్చుకున్నాడు. అల్పాహారం కోసం వోట్మీల్, బెర్రీలు తీసుకున్నాడు. మధ్యాహ్న భోజనానికి అన్నం, చికెన్, కూరగాయలు, సాల్మన్ వంటి చేపలు, రాత్రికి ఆకుకూరలు, బ్రెడ్ తీసుకునేవాడు.

అయితే బరువు తగ్గడానికి మైఖేల్ మెహ్లర్ కి దాదాపు మూడేళ్ళ సమయం పట్టింది. దానికోసం చాలా కష్టపడ్డాడు. ఫలితాన్ని సంతోషంగా అందుకున్నాడు. బరువు తగ్గడాన్ని దీక్షగా తీసుకోవడమే తన రహస్యమని నవ్వుతూ చెబుతున్నాడు మైఖేల్ మెహ్లర్. ఇంకెందుకాలస్యం మనం కూడా అతనిలానే మంచి ఆహార నియమాలతో పాటు వ్యాయామం కూడా చేద్దాం.

Updated Date - 2023-06-06T10:55:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising