Weight Loss: ఏకంగా 90 కిలోల బరువు తగ్గిన 21 ఏళ్ల యువతి.. కానీ కొద్ది రోజులకే సడన్‌గా మృతి.. అసలేం జరిగిందంటే..!
ABN, First Publish Date - 2023-06-16T12:59:18+05:30
బరువు తగ్గే సమయంలో, ప్రోటీన్, పిండి పదార్థాలు, కొవ్వును సమతుల్యంగా తీసుకోవాలి.
బరువు పెరగడం తెలియకుండా జరిగినా, తగ్గడం అనే ప్రక్రియ చాలా కష్టంతో కూడుకున్న పని. దీనికి చాలా శ్రమ, కఠోర దీక్షా కావాలి. అయితే బరువు తగ్గడం అనేది ఒక్క రాత్రిలో సాధ్యం కాని పని, దానికి చాలా సమయం కావాలి. నెమ్మదిగా సమయం తీసుకుని మాత్రమే బరువు తగ్గాలి. అధిక బరువుతో వచ్చే అనేక వ్యాధులను ఎదుర్కోవాలంటే బరువు తగ్గడం ఒక్కటే మార్గం. అయితే ఎలాంటి జాగ్రత్తలతో తగ్గాలి అనే విషయంలో అవగాహన అవసరం. 21 ఏళ్ళ కుయ్హూవా మాత్రం 90 కిలోల బరువు తగ్గింది. దీనికి ఆమె మొదటి రెండు నెలల్లో దాదాపు 25 కిలోలు బరువు తగ్గింది. తరవాత కొంత కొంతగా బరువు తగ్గుతూ వచ్చింది, ఇంత తక్కువ కాలంలో బరువు తగ్గడం అంటే మరణం వరకూ తీసుకువెళ్ళింది. అసలు బరువు ఎలా, ఎంత సమయంలో తగ్గాలి.
బరువు తగ్గడం వల్ల మరణం..
ప్రాణాంతక వ్యాధులను నివారించడానికి, ఊబకాయం నుండి బయటపడటం అవసరం. కానీ బరువు తగ్గడానికి తప్పుడు పద్ధతిని మొదలు పెట్టడం కూడా హానికరమే.
90 కిలోల బరువు అంత తక్కువ సమయంలో..
21 ఏళ్ల కుయ్హువా 90 కిలోల బరువు తగ్గింది. అందులో ఆమె కేవలం 2 నెలల్లోనే 25 కిలోలకు తగ్గింది. దీనికి ఆమె శరీరం సహకరించిందనే అనుకున్నారు కానీ దీని తరువాత, కుయ్హువా పని చేస్తూ మరణించింది. నివేదికల ప్రకారం, బరువు తగ్గడానికి తప్పుడు పద్ధతులకు దూరంగా ఉండాలి కానీ కుయ్హువా అలాగే ప్రయత్నించి మరణించింది.
ఇది కూడా చదవండి: మిగిలిపోయిన కూల్‌డ్రింక్స్.. పాడయిపోయిందని మర్నాడు పారబోస్తున్నారా..? దాంతో ఇన్ని లాభాలున్నాయని తెలిస్తే..!
భారీ వ్యాయామాలు, ఆహార నియంత్రణ
ఒక్కసారిగా బరువు తగ్గాలనే పిచ్చితో అధిక బరువులను ఎత్తేయడం, కఠినమైన వ్యాయామం చేయడం, ఆహారాన్ని నియంత్రించి సరిగా తీసుకోకపోవడం ఇవన్నీ శరీరంపైన తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
ఎంత బరువు తగ్గడం సరైనది?
నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒక నెలలో 2 నుండి 4 కిలోల వరకు తగ్గవచ్చు. కానీ దీన్ని నిపుణుల పర్యవేక్షణలోనే చేయాలి.
తగినంత ప్రోటీన్, పిండి పదార్థాలు, కొవ్వు తీసుకోండి.
బరువు తగ్గే సమయంలో, ప్రోటీన్, పిండి పదార్థాలు, కొవ్వును సమతుల్యంగా తీసుకోవాలి.
వ్యాయామాలు చేయండి.
బరువు తగ్గడానికి కార్డియో, యోగా అవసరం. శిక్షకుడిని సంప్రదించడం ద్వారానే బరువు తగ్గడం అన్ని విధాలా మంచిది. అధిక బరువును కోల్పోవాలి కానీ ఆరోగ్యవంతంగా తగ్గడమే సరైన పద్దతి.
Updated Date - 2023-06-16T12:59:18+05:30 IST