Heatwave Side Effects: ఎండ వేడి దెబ్బకు రక్తం మరుగుతుంది.. అలాంటప్పుడు ఏం చేయాలంటే..
ABN, First Publish Date - 2023-04-22T15:31:29+05:30
ఇదే సమయంలో వేడి, చెమట, ఇన్ఫెక్షన్‌లను తట్టుకోవడం గురించి కూడా చెప్పవచ్చు.
దేశంలో వేడిగాలులు ఇప్పటికే అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. వేసవి కాలం అంటేనే వేడి గాలులు, కొబ్బరి బోండాలు, కూలింగ్ డ్రింక్స్, కాటన్ దుస్తులు, మామిడి పండ్లు వంటివి తినే అవకాశాన్ని కల్పిస్తుంది, ఇదే సమయంలో వేడి, చెమట, ఇన్ఫెక్షన్‌లను తట్టుకోవడం గురించి కూడా చెప్పవచ్చు. దీంతో హీట్‌వేవ్ సైడ్ ఎఫెక్ట్స్ కూడా పడక తప్పదు. అయితే మీ మూడ్ కూడా వేడి వల్ల ప్రభావితమవుతుంది.
హీట్‌వేవ్ సైడ్ ఎఫెక్ట్స్, మూడ్ మార్పులు
ఒక అధ్యయనం ప్రకారం, USలో వేసవి నెలల్లో అధిక ఉష్ణోగ్రతలు ఉన్న రోజులు మానసిక రుగ్మతలతో సహా మానసిక ఆరోగ్య సంబంధిత పరిస్థితి కూడా రెట్టింపు అయిందట. ఈ అధిక వేడి ఉష్ణోగ్రతలు బేస్‌లైన్ మూడ్ స్టేట్‌లను మారుస్తాయని, ప్రజలను మరింత చిరాకుగా, కోపంగా కొన్నిసార్లు నిరాశకు గురిచేస్తాయని ఈ అధ్యయనం చెబుతుంది. దీనికి కారణమేమిటో స్పష్టంగా అర్థం కానప్పటికీ, శరీర ఉష్ణోగ్రతలో మార్పులు, నిర్జలీకరణం, సరైన నిద్ర లేకపోవడం, సూర్యరశ్మికి అధికంగా బహిర్గతం కావడం వంటివి మెదడు పనితీరును ప్రభావితం చేస్తాయని తేలింది.
హీట్ వేవ్ సమయంలో
1. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో చికాకుగా ప్రవర్తించకుండా కాస్త కూల్‌గా ఉండేందుకు చూడండి. మానసిక స్థితిలో మార్పులను గమనిస్తే వ్యాయామం చేయండి. ఇది చికాకు నుంచి దూరం చేస్తుంది.
2. అతిగా విసుగు చెందడం వల్ల నియంత్రణలో లేని వాతావరణం సరైపోదు. కాబట్టి సమయాన్ని కాస్త బిజీగా గడిపేలా ఫ్లాన్ చేసుకోవాలి. ఏదో పనిలో బిజీగా గడిపితే తరవాత అంతా సరైపోతుంది.
3. మధ్యాహ్నం ఎండలో పని కోసం డ్రైవింగ్ చేయడం, 40 డిగ్రీల సెల్సియస్‌లో ఉన్నప్పుడు లైన్‌లో నిలబడటం ఇబ్బంది కలిగిస్తుందా? రోజువారీ షెడ్యూల్‌లో మార్పులు చేసి, అటువంటి పనులను ముందుగానే ఫ్లాన్ చేసుకోండి. చికాకు తగ్గాలంటే సాయంత్రం కాగానే కాస్త చల్లని నీటితో స్నానం చేసినా మంచి ఫలితం ఉంటుంది.
ఇది కూడా చదవండి: కండ్లకలక కూడా కరోనా లక్షణమేనట.. ఇదే ఇప్పుడు అందరిలోనూ..!
4. హైడ్రేషన్
కొన్నిసార్లు బిజీ షెడ్యూల్ కారణంగా నీరు తాగడం మర్చిపోవచ్చు, కానీ హైడ్రేటెడ్‌గా ఉండండి. పగటిపూట ఎంత నీరు తాగారో లెక్క తెలిసేలా నీళ్ళ బాటిళ్లను ఉపయోగించండి. మహిళలకు సగటున 2.7 లీటర్ల నీరు అవసరం. వీటితో పాటు ఈ వేసవిలో జ్యూస్‌లు, కూలింగ్ డ్రింక్స్ కూడా తీసుకోవచ్చు.
5. లోతైన శ్వాస, ధ్యానం
కేవలం 15 నిమిషాలు ధ్యానం కోసం వెచ్చించండి. ప్రతి ఉదయం మూడ్ మార్పులు, కోపాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మెరుగైన మానసిక ఆరోగ్యం కోసం ఈ చిట్కాలను పాటించండి. ఈ వేసవిలో ప్రశాంతంగా ఉంటుంది.
Updated Date - 2023-04-22T15:31:29+05:30 IST