ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Tips: పొట్ట తగ్గడం ఇంత ఈజీనా..? ఎన్ని పనులున్నా సరే.. రోజూ ఈ 4 పనులు చేయండి చాలు..!

ABN, First Publish Date - 2023-07-12T12:56:23+05:30

పగటిపూట నడవడానికి సమయం లేకపోతే, సాయంత్రం సమయం తీసుకొని గంటసేపు నడవవచ్చు.

burn fat.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బరువు పెరిగామని గమనించేలోపే పరిస్థితి చేయి దాటిపోతుంది. బరువు పెరగడాన్ని గుర్తించడం అంటే ముఖ్యంగా పొట్ట సైజు పెరిగితే కానీ తెలియకపోవచ్చు. వేసుకునే దుస్తుల విషయంలో ఈ విషయం తెలుస్తున్నా ఒక్కసారే బరువు తగ్గాలనుకోవడం కూడా ఆరోగ్యపరంగా మంచిది కాదు. బరువు తగ్గడం కొన్నిసార్లు గందరగోళంగా అనిపిస్తుంది, ఎందుకంటే ఏ పద్ధతిని ప్రయత్నించాలి, ఏది చేయకూడదు అనేది అర్థం కాదు. కానీ, కొన్నిసార్లు చాలా సులభమైన పద్దతిలో బరువు తగ్గడం మొదలవుతుంది.

దీనికి ప్రధాన కారణం ఈ పనులు రోజూ చేస్తుంటే, అలవాటుగా మారి వెంటనే బరువు తగ్గడం మొదలవుతుంది. శరీరం బరువుగా అనిపించడం, స్థూలకాయం వల్ల ఇబ్బంది పడడం, బెల్లీ ఫ్యాట్ రావడం మొదలైపోయి, నడుముపై జీన్స్ వేసుకోవడంలో ఇబ్బంది ఉన్నవారిలో మీరూ ఒకరైతే, ఇక్కడ పేర్కొన్న మార్నింగ్ రొటీన్ మీ కోసమే. బరువును వేగంగా తగ్గించుకునే ప్రయత్నానికి సపోర్ట్ చేస్తాయి. అంతేకాదు ఈ చిట్కాలు జీవనశైలిని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.

తగినంత నిద్ర

తెల్లవారుజామున నిద్రలేవడం చాలా మంచి అలవాటు, అయితే ఉదయం త్వరగా లేవడానికి రాత్రి త్వరగా నిద్రపోవాలి. అలాగే హాయిగా నిద్రపోవాలని గుర్తుంచుకోండి. రాత్రి ఆలస్యంగా నిద్రపోయి, ఉదయాన్నే లేచినట్లయితే, నిద్ర లేకపోవడం వల్ల బరువు తగ్గడానికి ఆటంకం కలిగిస్తుంది. బరువు తగ్గించడానికి బదులుగా బరువు పెరుగుతుంది. అందుకే నిద్ర విషయంలో పక్కాగా ఫ్లాన్ చేసుకోవాలి.


ఇది కూడా చదవండి: మగాళ్లలో ఈ నాలుగు లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించినా.. భార్యతో గొడవలు జరుగుతున్నాయనే అర్థం..!

నీరు త్రాగండి.

ఉదయం నిద్రలేచిన తర్వాత, ఏదైనా తినడానికి, టీ-కాఫీ తాగడానికి బదులుగా, గోరువెచ్చని నీరు త్రాగాలి. గోరువెచ్చని నీరు కొవ్వును కరిగించడంలో సహాయపడుతుంది. ఈ శరీర కొవ్వును కరిగించడానికి సాధారణ నీటికి బదులుగా ఆకుకూరల నీరు, తేనె, నిమ్మకాయ నీరు అలాగే జీలకర్ర నీటిని తాగడం రోజు క్రమం తప్పకుండా చేయాలి. ఇది మంచి ఫలితాన్ని ఇస్తుంది.

ఆరోగ్యకరమైన అల్పాహారం

ఉదయపూట తీసుకునే అల్పాహారం మీ కడుపుని నింపేలా, మధ్యాహ్నానికి శక్తిని ఇస్తుంది. అలాగే బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది. దీని కోసం, ఫైబర్, ప్రోటీన్లతో అల్పాహారంలో తీసుకోవచ్చు. సాధారణంగా బరువు తగ్గాలంటే ఉదయం పూట పోహా, ఉప్మా, గుడ్డు ఆమ్లెట్, ఓట్స్, స్టఫ్డ్ పరాటా, ఫ్రూట్ సలాడ్, జ్యూస్ వంటివి తీసుకోవడం మంచిది.

తిన్న తర్వాత

పగటిపూట భోజనం చేసినప్పుడల్లా, సుమారు 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటిని త్రాగండి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, తిన్న తర్వాత 20 నిమిషాలు నడవడానికి ప్రయత్నించండి. ఈ రెండు పనులు వేగంగా బరువు తగ్గించడంలో మంచి ప్రభావాన్ని చూపుతాయి. పగటిపూట నడవడానికి సమయం లేకపోతే, సాయంత్రం సమయం తీసుకొని గంటసేపు నడవవచ్చు. ఈ చిట్కాలతో పెద్దగా శ్రమలేకుండానే శరీరంలోని అధిక బరువును తగ్గించుకోవచ్చు.

Updated Date - 2023-07-12T12:56:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising