Head Bath: పీరియడ్స్‌లో ఉన్నప్పుడు తలస్నానం చేయకూడదని ఎందుకంటారు..? చేస్తే అసలు ఏమవుతుందంటే..!
ABN, First Publish Date - 2023-06-06T12:33:38+05:30
రక్తస్రావం మధ్యలో ఆగినప్పుడు రక్తం గడ్డల రూపంలో ఉంటుంది.
ప్రతి స్త్రీకీ పిరియడ్స్ సమయం తప్పనిసరి. ఈ సమయంలో శరీరకంగా, మానసికంగా చాలా రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. పూర్వకాసం నుంచి పిరియడ్స్ అనగానే చాలా రకాల పద్దతులు, ఆచారాలు మన కుటుంబాలలో పాతుకుపోయి ఉన్నాయి. పిరియడ్స్ అని తెలియగానే తలకు స్నానం చేసి ఎవరినీ, దేనినీ ముట్టుకోకుండా మూడురోజులు పాటు దూరంగా ఉంచే పద్దతులు మనలో చాలా కుటుంబాల్లో ఇంకా నడుస్తూనే ఉన్నాయి. కొందరు పిరియడ్స్ విషయం తెలియగానే తలకు స్నానం చేస్తారు. ఇలా చేయకపోతే అరిష్టమని, మంచిది కాదని పెద్దలు తిడుతూ ఉంటారు. మరి కొందరైతే పిరియడ్స్ సమయంలో తలకు స్నానం మంచిది కాదని వాదిస్తారు. అసలు ఆ టైంలో తలకు ఎందుకు స్నానం చేయకూడదో తెలుసా..!
పీరియడ్స్ సమయంలో వెంట్రుకలు కడుక్కోకూడదని అమ్మ, అమ్మమ్మ, చెప్పి ఉంటారు. ఇది విన్న తర్వాత మీకు కోపం వచ్చి ఏది నమ్మాలో ఏది నమ్మకూడదో తెలియక కాస్త గందరగోళంగా అనిపిస్తుంది. అయితే పీరియడ్స్ సమయంలో జుట్టును కడగకూడదు. దీని వెనుక శాస్త్రీయ కారణం కూడా ఉంది. పీరియడ్స్ సమయంలో జుట్టు కడగకపోవడానికి కారణం మతపరమైనది కాదు కానీ ఆరోగ్యానికి సంబంధించినది. చాలా కొద్ది మంది అమ్మాయిలకు ఈ విషయం తెలియకపోవచ్చు. అదేమిటంటే..
పీరియడ్స్ సమయంలో శరీర ఉష్ణోగ్రత వెచ్చగా ఉండాలి
పీరియడ్స్‌లో మూడు రోజులు జుట్టు కడగడం నిషేధించబడింది. నిజానికి, ఋతుస్రావం సమయంలో శరీరం వెచ్చగా ఉండటం అవసరం. తద్వారా రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. కొందరికి మూడు రోజులు పీరియడ్స్, కొందరికి ఐదు రోజులు బ్లీడింగ్ లేదా కొందరికి ఏడు రోజులూ బ్లీడింగ్ ఉంటుంది. ఆ సమయంలో తలకు స్నానం చేస్తే శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. దీని వల్ల పీరియడ్స్ రక్తస్రావం అవడం ఆగిపోతుంది. దీనితో రకరకాల అనారోగ్య ఇబ్బందులు వచ్చిపడతాయి. అవేమిటంటే.. ముఖ్యంగా..
ఇదికూడా చదవండి: ఒకప్పుడు 263 కిలోల బరువు..రెండేళ్లలోనే ఏకంగా 159 కిలోల బరువు ఎలా తగ్గాడంటే..!
గర్భాశయంలో గడ్డ ఏర్పడవచ్చు..
రక్తస్రావం మధ్యలో ఆగినప్పుడు రక్తం గడ్డల రూపంలో ఉంటుంది. చాలా సార్లు ఈ గడ్డలు పెద్దగా మారి బయటకు రాలేవు. దీని కోసం శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వస్తుంది. రెండవది, కడుపు నొప్పి, ఇన్ఫెక్షన్ సమస్య కనిపించడం ప్రారంభమవుతుంది.
మూడు రోజుల తర్వాత తలస్నానం చేయడం బెటర్..
పీరియడ్స్ సమయంలో కాకుండా అది ముగిసిన తర్వాత తలకు స్నానం చేయడం మంచిది. లేదంటే మూడు రోజుల తర్వాత గోరువెచ్చని నీటితో చేయాలి. ఇలా చేస్తే కడుపు నొప్పి నుండి ఉపశమనం అందించడంతో పాటు, శరీర ఉష్ణోగ్రత కూడా వెచ్చగా ఉంటుంది.
తలస్నానం
అమ్మమ్మలు, అమ్మలు జుట్టును ముందుకు వేసి వేలాడుతూ కడగడం చూసి ఉంటారు. అయితే ఇప్పటివారు జుట్టును వెనుకకు వేసి కడుతున్నారు. కానీ వైద్యుల అభిప్రాయం ప్రకారం, జుట్టును ముందుకు వేసుకుని తలకు స్నానం చేయడం అనేది సరైన పద్దతి. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడమే కాదు, శరీరంలో రక్త ప్రసరణ కూడా సరిగ్గా జరిగేట్టు చేస్తుంది. మెదడులో ఆక్సిజన్ ప్రవాహాన్ని కూడా పెంచుతుంది.
ఒత్తిడి, మైగ్రేన్‌తో సహా అనేక నొప్పులు దూరమవుతాయి.
తలను ముందుకు వంచి తలస్నానం సమయంలో జుట్టును శుభ్రం చేసుకోవడం వల్ల రక్త ప్రసరణకు సహాయపడుతుంది. దానివల్ల మానసిక ఆరోగ్యం బావుంటుంది. ఒత్తిడి, మైగ్రేన్‌తో సహా మెడ నొప్పి కూడా నయమవుతుంది. అందుకే ప్రతిరోజూ కనీసం 4 నిమిషాలు తల ముందుకు వంచి కూర్చోవాలి.
Updated Date - 2023-06-06T12:33:38+05:30 IST