ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Health Facts: రోజూ మధ్యాహ్నం ఒంటి గంట దాటిన తర్వాతే భోజనం చేస్తున్నారా..? చాలా మందికి తెలియని నిజమేంటంటే..!

ABN, First Publish Date - 2023-08-25T12:29:08+05:30

భోజనం ఆలస్యం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి, ఇది తలనొప్పిని ప్రేరేపిస్తుంది. ఈ తలనొప్పి కారణంగా కొన్నిసార్లు చిరాకు కూడా వస్తుంది.

late lunch

ఆరోగ్యం మీద ఇప్పటి రోజుల్లో కాస్త శ్రద్ధ పెరిగింది. ప్రతి ఒక్కరూ హెల్త్ కాపాడుకునే విషయంలో దినచర్యను కాస్త జాగ్రత్తగానే ఫ్లాన్ చేసుకుంటున్నారు. అయితే ఆహారం తీసుకునే వేళలు కూడా ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపుతాయనేది పూర్వం పెద్దలు చెప్పిన మాటే.. కానీ ఇప్పటి వారు ఎంతవరకూ దీనిని పాటిస్తున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త తీసుకోవాలని నిర్ణయించుకున్నాకా దినచర్యలో కొన్ని చిన్న విషయాలను మరిచిపోతారు. ఇది వారి శరీరంపై దుష్ప్రభావాలను కలిగిస్తుంది. ఆరోగ్యం సరైన దారిలో ఉండాలంటే ఆహారాన్ని సమయానికి తినడం ప్రారంభిస్తే, అనేక కడుపు సంబంధిత సమస్యలను నివారించవచ్చు. ఆలస్యంగా భోజనం చేయడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుందాం.

ఆలస్యంగా భోజనం తీసుకోవడం వల్ల కలిగే నష్టాలు

acidity (ఎసిడిటి)

ఉదయం 11 నుండి మధ్యాహ్నం 1 గంటల మధ్య అంటే సరైన సమయానికి భోజనం చేయకపోతే, కడుపులో ఎసిడిటీ సమస్య రావచ్చు. సమయానికి భోజనం చేయకపోవడం వల్ల అనేక ఇతర జీర్ణ సమస్యలు కూడా వస్తాయి. అటువంటి పరిస్థితిలో, కడుపు వ్యాధులను నివారించాలనుకుంటే, సరైన సమయంలో భోజనం చేయాలి. కడుపులో ఎసిడిటి ఏర్పడినప్పుడు, దానిని వైద్య భాషలో గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ (Gastroesophageal reflux) వ్యాధి లేదా యాసిడ్ రిఫ్లక్స్ వ్యాధి అంటారు.

ఇది కూడా చదవండి: రోజూ పొద్దున్నే మంచినీళ్లు తాగడం మంచిదేనా..? ఈ 6 నిజాలు తెలీకపోయినా చాలా మంది పాటిస్తుంటారు కానీ..!

తలనొప్పి

సమయానికి భోజనం చేయకపోవడం వల్ల తలనొప్పి వస్తుంది, ఆకలి వల్ల ఇది వస్తుంది. భోజనం ఆలస్యం చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి, ఇది తలనొప్పిని ప్రేరేపిస్తుంది. ఈ తలనొప్పి కారణంగా కొన్నిసార్లు చిరాకు కూడా వస్తుంది.

గ్యాస్

మధ్యాహ్నం భోజనం చేయకపోతే కడుపులో గ్యాస్ సమస్య రావచ్చు. కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్, మీథేన్, హైడ్రోజన్, ఆక్సిజన్‌లతో తయారైన వాయువులు కూడా పొత్తికడుపులో నొప్పిని కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో, ఆలస్యంగా భోజనం చేసే అలవాటును మార్చుకుంటే మంచిది.

Updated Date - 2023-08-25T12:29:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising