ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Watermelon: పుచ్చకాయ తియ్యగా ఉంటుందో.. లేదో.. ఈ సింపుల్ ట్రిక్స్‌తో ఈజీగా తేల్చేయండి..!

ABN, First Publish Date - 2023-06-03T12:52:13+05:30

పుచ్చకాయ సరిగ్గా పండితే పైతొక్కను వేళ్లతో నొక్కినప్పుడు మెత్తబడినట్లు అనిపిస్తే అది బాగా పండినది అని తెలుసుకోవాలి.

sweet melon.
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పుచ్చకాయలు అన్ని కాలాల్లోనూ దాదాపుగా దొరుకుతాయి. వీటిని తినడానికి పెద్ద ప్రోసెస్ కూడా ఉండదు. పైగా చక్కెర ఇతర పదార్థాలు కలపాల్సిన పనిలేదు కాబట్టి పుచ్చకాయ తినడానికి చిన్నా, పెద్దా అంతా ఉత్సాహం చూపిస్తారు. అంతే కాదు పుచ్చాకాయలో ఎన్నో పోషకాలున్నాయి. సరిగ్గా ఈ వేసవిలో అయితే పుచ్చకాయ చేసే మేలు అంతా ఇంతా కాదు. అయితే ఎన్నిసార్లు కొన్నా కూడా తీయగా ఉండే పుచ్చకాయను ఎంచుకోవడం మాత్రం సరిగా తెలీదు మనలో చాలామందికి. కొట్టువాడినే పిల్లలకి మంచి తీయగా ఉండే పుచ్చకాయను ఇమ్మంటే అతగాడు కాస్త అటూ ఇటూ వెతికి ఏదో ఇస్తాడు. ఒక్కోసారి తీయగా ఉన్నా చాలాసార్లు చప్పగా, రుచీ పచీ లేకుండా ఉంటాయి. అసలు తీయగా ఉంటే పుచ్చకాయను ఎంచుకోవడం ఎలా?

సరైన పుచ్చకాయను ఎంచుకోవడానికి ఈ లక్షణాల ఆధారంగా ఎంపిక చేసుకోవాలి. రంగు, విత్తనాలు లేకపోవడం, పరిమాణం, వాసన, పక్వత ఇవన్నీ కాయ తీయగా ఉండేదీ లేనిది చెబుతాయి.

పండిన పుచ్చకాయను ఎలా ఎంచుకోవచ్చు?

సాధారణంగా, పుచ్చకాయ తీపిని వాటి బ్రిక్స్ కౌంట్ ద్వారా కొలుస్తారు, ఇది తీపిని కొలవడానికి ఒక మార్గం. టెక్సాస్ A&M కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్సెస్‌లో ప్రొఫెసర్ అయిన జువాన్ అన్సిసో, Ph.D. చెప్పిన ప్రకారం,..తీయని పుచ్చకాయలను ఇలా ఎంచుకోవచ్చట.

1. ఏకరీతి పరిమాణంలో ఉండే అంటే ఓవల్ లేదా గుండ్రంగా ఉన్న పుచ్చకాయను తీసుకోండి.

2. ఆకారంలో భారీగా ఉండే పుచ్చకాయను తీసుకోవాలనుకుంటే సాధారణంగా ఇది తియ్యగా ఉంటుంది. ఎక్కువ నీరు కలిగి ఉంటుంది.

3. నారింజ క్రీము ఫీల్డ్ స్పాట్ ఉన్నాయేమో చూడండి.

4. ముదురు పసుపు ఫీల్డ్ స్పాట్ అంటే సాధారణంగా అది తీగపై ఎక్కువసేపు ఉంటుంది. ఇది రుచిలో బావుంటుంది.

5. ఫీల్డ్ స్పాట్ తెల్లగా ఉంటే, అది పుచ్చకాయ పూర్తిగా పండలేదని సంకేతం.

ఇది కూడా చదవండి: బ్రెడ్ బాగుందా..? పాడైపోయిందా..? గుర్తించేందుకు 4 సింపుల్ ట్రిక్స్‌.. గడువు పూర్తయిన బ్రెడ్‌లను తింటే..!

1. బరువు చూసి తీసుకోవాలి.

పుచ్చకాయ పండిందా లేదా అని చెక్ చేయాలంటే బరువు చెక్ చేయడమే దారి.. ఒకే సైజులో ఉన్న రెండు పుచ్చకాయలను మీ చేతుల్లోకి తీసుకొని బరువు చెక్ చేస్తే కచ్చితంగా బరువు ఉన్నది తీయగా ఉంటుంది. ఇది నీటితో కలిపి ఉండి తీయగా ఉండేందుకు అవకాశం ఉంది.

2. పుచ్చకాయను కొట్టి చూస్తే..

కాయమీద గట్టిగా తట్టినట్లు చేస్తే అది చిన్నగా శబ్దం వస్తుంది. ఈ కాయ బాగా పండినట్టు లెక్క. అదే పెద్దగా శబ్దం చేస్తే ఆ కాయ సరిగా పండనిదిగా గుర్తించాలి.

3. పుచ్చకాయ వాసన చూస్తే..

పుచ్చకాయ వాసనను గమనిస్తే.. పుచ్చకాయ తియ్యటి వాసన వేస్తుంది. కాయ వాసన సరిగా రాకపోతే అది తక్కువగా పండిందని అర్థం. పుచ్చకాయ సువాసన ఎక్కువగా ఉంటే అది బాగా పండిందని అర్థం.

4. పుచ్చకాయ ఆకృతిని బట్టి ఎంచుకోవాలి.

పుచ్చకాయ సరిగ్గా పండితే పైతొక్కను వేళ్లతో నొక్కినప్పుడు మెత్తబడినట్లు అనిపిస్తే అది బాగా పండినది అని తెలుసుకోవాలి.

5. రంగు కూడా ముఖ్యమే..

ముదురు ఆకుపచ్చ, లేత ఆకుపచ్చగా ఉంటే బాగా పండింది అని అర్థం. పసుపు పచ్చ కలర్‌లో ఉంటే అవి పండించిన స్థలంలోనే పక్వానికి వచ్చినట్లు.. కలర్ తెలుపురంగులో ఉంటే అది ఇంకా పక్వానికి రాలేదని గమనించాలి.

Updated Date - 2023-06-03T12:52:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising