fake loan apps : గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫేక్ లోన్ యాప్స్ తొలగింపు
ABN , First Publish Date - 2023-12-09T03:34:18+05:30 IST
గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫేక్ లోన్ యాప్‌లను గూగుల్ తొలగించింది. సైబర్ సెక్యూరిటీ ఈఎస్‌ఈటి పరిశోధకులు మొత్తం 18 యాప్‌లను ఫేక్‌గా గుర్తించారు. కాగా తొలగించిన

గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫేక్ లోన్ యాప్‌లను గూగుల్ తొలగించింది. సైబర్ సెక్యూరిటీ ఈఎస్‌ఈటి పరిశోధకులు మొత్తం 18 యాప్‌లను ఫేక్‌గా గుర్తించారు. కాగా తొలగించిన వాటిలో 17 యాప్స్‌కు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా 12 మిలియన్లకు మించి డౌన్‌లోడ్ జరిగాయి. మోసపూరిత లోన్ యాప్స్ సంఖ్య చాలా ఎక్కువ స్థాయిలో పెరిగిందని సదరు పరిశోధకులు వెల్లడించడం గమనార్హం. అత్యధిక వడ్డీకి రుణాలను ఇవి ఆఫర్ చేస్తున్నాయి. ఆ క్రమంలో బాధితుల ఆర్థిక సమాచారాన్ని సేకరించడం తదుపరి వారిని బ్లాక్‌మెయిల్ చేయడం సర్వసాధారణంగా మారింది. రుణాలకు తోడు ఈ యాప్స్ ఉద్యోగాలను కూడా ఆఫర్ చేస్తున్నాయని తేలింది. ఈ నేపథ్యంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన యాప్‌ల పేర్లను ‘ఫోన్ ఎరీనా’ తెలిపింది. AA Kredit, Amor Cash, Guayaba Cash, Easy Credit, Cashwow, CrediBus, FlashLoan, PréstamosCrédito, Préstamos De Crédito-YumiCash, Go Crédito, Instantáneo Préstamo, Cartera grande, Rápido Crédito, Finupp Lending, 4S Cash, TrueNaira, EasyCash తొలగించారు.