Kuwait: ఆరోగ్యశాఖకు ప్రవాసులు ఊహించని షాక్..!
ABN, First Publish Date - 2023-02-17T12:12:54+05:30
కువైత్ ఆరోగ్యశాఖ ప్రవాసులు ఊహించని షాక్ ఇచ్చారు.
కువైత్ సిటీ: కువైత్ ఆరోగ్యశాఖ (Kuwait Health Ministry) ప్రవాసులు ఊహించని షాక్ ఇచ్చారు. వలసదారులకు (Expatriates) మెడిసిన్స్ కోసం అదనపు రుసుము అమలు చేసిన తర్వాత ఆరోగ్య కేంద్రాలను సందర్శించే ప్రవాసుల సంఖ్య 20 నుంచి 25 శాతం తగ్గినట్లు తాజాగా వెలువడిన ప్రాథమిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. డిసెంబర్ 18 నుంచి ఆరోగ్య మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని ఆరోగ్య కేంద్రాలు, ఆస్పత్రులలో ప్రమాద కేసులకు 5 కువైటీ దినార్లు, అదే ప్రవాసుల కోసం ఔట్ పేషెంట్ క్లినిక్‌లకు 10 దినార్లు అదనంగా వసూలు చేస్తున్నారు. దీనిలో భాగంగా 2022 డిసెంబర్ 19 నుంచి ఫిబ్రవరి 2023 ప్రారంభంలో నమోదైన కేసులను పరిశీలిస్తే.. క్లినిక్‌లను సందర్శించిన ప్రవాసుల సంఖ్యలో 25 నుంచి 30 శాతం మేర తగ్గుదల కనిపించింది. దాదాపు 30 నుంచి 40శాతం మంది ప్రవాసులు తమ ప్రిస్క్రిప్షన్‌లను తీసుకుని ప్రైవేట్ ఫార్మసీలకు వెళ్తున్నట్లు అక్కడి నివేదికలు పేర్కొంటున్నాయి.
Updated Date - 2023-02-17T12:15:16+05:30 IST