ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indian Students: రూటు మార్చిన భారత విద్యార్థులు.. అమెరికాను కాదని ఏ దేశానికి క్యూ కడుతున్నారంటే..

ABN, First Publish Date - 2023-02-22T11:07:09+05:30

గతంలో భారతీయులకు (Indians) ఉన్నత విద్య అంటే ముందుగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా గుర్తు వచ్చేవి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: గతంలో భారతీయులకు (Indians) ఉన్నత విద్య అంటే ముందుగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా గుర్తు వచ్చేవి. ఇప్పుడు మాత్రం కెనడాకు (Canada) క్యూ కడుతున్నారు. మెరుగైన అవకాశాల నేపథ్యంలో భారతీయ విద్యార్థులు (Indian Students) అగ్రరాజ్యం అమెరికాను సైతం కాదని కెనడాకు తొలి ప్రాధాన్యమిస్తున్నారు. ఇమ్మిగ్రేషన్, రెఫ్యూజీస్ అండ్ సిటిజన్‌షిప్ కెనడా (IRCC) విడుదల చేసిన తాజా డేటా ప్రకారం.. గతేడాది 2,26,450 మంది భారతీయ విద్యార్థులు కెనడాకు వెళ్లారు. దీంతో 2022లో ఆ దేశానికి వెళ్లిన అంతర్జాతీయ విద్యార్థుల కేటగిరీలో ఇండియా మొదటి స్థానంలో నిలిచింది. 2022లో కెనడాకు 184 దేశాల నుంచి మొత్తంగా 5,51,405 మంది ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ (International Students) వెళ్లారు. ఇందులో సగం మంది మనోళ్లే ఉండడం గమనార్హం. ఆ తర్వాతి స్థానాల్లో చైనా(52,165), ఫిలిప్పీన్స్(23,380) ఉన్నాయి.

అదే 2021లో 4,44,260 మందికి కెనడాలో చదువుకోవడానికి అనుమతులు వచ్చాయి. ఇది 2019లో 4,00,600 కంటే ఎక్కువ. అయితే, కరోనా కారణంగా 2020లో ఈ సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఇక 2022 డిసెంబర్ 31 నాటికి 3,19,130 మంది విద్యార్థులతో కెనడాలో చదువుతున్న, ఇప్పటికే నివసిస్తున్న విద్యార్థులతో భారత్ (India) టాప్-10లో ఉంది. కాగా, 2022లో ఆల్‌టైమ్ రికార్డు స్థాయిలో ఏకంగా 4.8 మిలియన్ల వీసా దరఖాస్తులను కెనడా ప్రాసెస్ చేసింది. ఇక నివేదికల ప్రకారం.. విదేశీ విద్యార్థుల ద్వారా కెనడా ఆర్థిక వ్యవస్థకు ఏడాదికి 15.3 బిలియన్లకు పైగా ఆదాయం సమకూరుతుంది.

ఇది కూడా చదవండి: ఎమిరేట్ ఐడీ కార్డు పోగొట్టుకున్న ప్రవాసులు.. ఇలా చేస్తే 24 గంటల్లో తిరిగి పొందవచ్చు..

ఇదిలాఉంటే.. భారతీయులు భారీ సంఖ్యలో స్థిరపడిన దేశాల్లో యూఎస్ తర్వాతి స్థానంలో ఉన్న కెనడాలో ఇప్పుడు ఇండో-కెనడియన్ల ప్రాబల్యం అంతకంతకూ పెరుగుతోంది. సరళమైన ఇమ్మిగ్రేషన్ విధానం, త్వరితగతిన శాశ్వత నివాస హోదా లభిస్తుండటంతో భారతీయులు అమెరికాను పక్కనబెట్టి మరీ కెనడాకు పరుగులు పెడుతున్నారు. ఇటీవలి కాలంలో ఎన్నో సర్వేలు సైతం ఇదే విషయాన్ని ధృవీకరించాయి కూడా.

ఇది కూడా చదవండి: ఓరి బుడ్డోడా.. నీకు ధైర్యం కూసింత ఎక్కువేరోయ్.. నెటిజన్లను స్టన్ చేస్తున్న వీడియో..!

Updated Date - 2023-02-22T11:07:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising