ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

NRI: బ్రిటన్‌లో భారత సంతతి వ్యక్తి మిస్సింగ్ కేసు విషాదాంతం

ABN, First Publish Date - 2023-01-29T20:49:54+05:30

బ్రిటన్‌లో ఏడాదిగా కనిపించకుండా పోయిన భారత సంతతి వ్యక్తి ఉదంతం చివరకు విషాదాంతమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎన్నారై డెస్క్: బ్రిటన్‌లో(UK) కనిపించకుండా పోయిన భారత సంతతి వ్యక్తి(Indian Origin) ఉదంతం(Missing Case) చివరకు విషాదాంతమైంది. ఇంగ్లండ్‌లోని పశ్చిమ మిడ్‌ల్యాండ్స్‌లో గల అడవుల్లో పోలీసులు అతడి మృతదేహాన్ని గుర్తించారు. గతేడాది అక్టోబర్‌లో హర్‌జిందర్ ఠకర్(Harjinder Thakar) ష్రాప్‌షైర్‌లో టెల్‌ఫోర్డ్‌ ప్రాంతంలో అకస్మాత్తుగా అదృశ్యమయ్యారు. దీంతో.. కేసు నమోదు చేసుకున్న వెస్ట్ మెర్సియా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గాలింపు చర్యల్లో స్థానికుల సాయం కోరగా అనేక మంది పెద్ద ఎత్తున స్పందించారు. ఈ క్రమంలో స్థానికులు, హర్‌జిందర్ స్నేహితులు, బంధువులు ఓ ఫేస్‌బుక్ పేజీ ప్రారంభించారు. ఇందులో చేరిన 8 వేల మంది హర్‌జిందర్ కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. వారి ప్రయత్నాలు చివరకు విషాదాంతమయ్యాయి. హర్‌జిందర్ మృతదేహం లభించినట్టు తాజా పోలీసులు ప్రకటించారు. అయితే.. ఈ ఉదంతంలో అనుమానాస్పదంగా ఏదీ లేదని పోలీసులు పేర్కొన్నారు. గాలింపు చర్యల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న ప్రజలకు డిటెక్టివ్ జో వైట్‌హెడ్ పేర్కొన్నారు.

Updated Date - 2023-01-29T20:53:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising