ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

India's Richest 100: భారత సంపన్నుల జాబితాలో ఆరుగురు యూఏఈ నివాసితులు

ABN, First Publish Date - 2023-10-14T07:03:37+05:30

ఫోర్బ్స్ ఇటీవల విడుదల చేసిన వంద మంది భారత సంపన్నుల జాబితా (Forbes' 'India's 100 Richest List') లో ఆరుగురు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో ఉండే భారత ప్రవాసులకు చోటు దక్కింది. వీరిలో ఏకంగా ఐదుగురు కేరళ రాష్ట్రానికి చెందినవారు కావడం గమనార్హం.

India's Richest 100: ఫోర్బ్స్ ఇటీవల విడుదల చేసిన వంద మంది భారత సంపన్నుల జాబితా (Forbes' 'India's 100 Richest List') లో ఆరుగురు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (United Arab Emirates) లో ఉండే భారత ప్రవాసులకు చోటు దక్కింది. వీరిలో ఏకంగా ఐదుగురు కేరళ రాష్ట్రానికి చెందినవారు కావడం గమనార్హం. ఇక ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఆరుగురు యూఏఈ ఎన్నారైలలో ఎంఏ యూసఫ్ అలీ (లులూ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్), రేణుక జగత్యానీ (ల్యాండ్‌మార్క్ గ్రూప్ ఛైర్‌వుమెన్), జాయ్ అలుక్కాస్ (జాయ్ అలుక్కాస్ గ్రూప్ ఛైర్మన్), డా. షంషీర్ వయలీల్ (బుర్జీల్ హోల్డింగ్స్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్), రవి పిళ్లై (ఆర్‌పీ గ్రూప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్), సన్నీ వార్కీ (జెమ్స్ గ్రూప్ వ్యవస్థాపకుడు) ఉన్నారు. హైపర్‌ మార్కెట్-సూపర్ మార్కెట్ నెట్‌వర్కింగ్‌లో అంతర్జాతీయంగా అతి వేగంగా అభివృద్ధి పథంలోకి దూసుకెళ్తున్న లులూ గ్రూప్ అధినేత 7.1 బిలియన్ డాలర్ల సంపదతో ఈ ఆరుగురిలో మొదటి స్థానంలో నిలిచారు. మొత్తంగా ఆయన 100 మంది జాబితాలో 27వ స్థానం దక్కించుకోవడం విశేషం. గతేడాది యూఫ్ అలీ 5.4 బిలియన్ డాలర్లతో 35 స్థానంలో ఉన్నారు. ఈ ఏడాది 8 స్థానాలు ఎగబాకి 27వ ర్యాంకు దక్కించుకున్నారు.

అలీ తర్వాత ల్యాండ్‌మార్క్ గ్రూప్ ఛైర్‌వుమెన్ రేణుక జగత్యానీ 4.8 బిలియర్ డాలర్ల సంపదతో 44వ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత వరుసగా జాయ్ అలుక్కాస్ 4.4 బిలియన్ డాలర్లతో 50వ స్థానంలో, డా. షంషీర్ 3.7 బిలియన్ డాలర్లతో 57వ స్థానం, రవి పిళ్లై 3.2 బిలియన్ డాలర్ల సంపదతో 69వ స్థానం, 2.93 బిలియన్ డాలర్లతో సన్నీ వార్కీ 78వ స్థానం దక్కించుకున్నారు. కాగా, ఈ జాబితాలో రిలయల్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేష్ అంబానీ 92 బిలియన్ డాలర్ల సంపదతో మొదటి స్థానంలో నిలిస్తే.. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ 68 బిలియన్ డాలర్ల సంపదతో రెండో స్థానం దక్కించుకున్నారు.

Air India: యూరోప్‌లోని ఆ ఐదు నగరాలకు వెళ్లే వారికి ఎయిరిండియా బంపరాఫర్.. భారీ తగ్గింపు ధరలతో విమాన టికెట్లు!


Updated Date - 2023-10-14T07:05:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising