ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Republic Day: మలేషియాలో ఘనంగా 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

ABN, First Publish Date - 2023-01-27T07:51:48+05:30

మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌలాలంపూర్‌: మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో 74వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ఇండియన్ హై కమిషనర్ ఆఫ్ మలేషియా బిఎన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మొదట రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగాన్ని చదివి వినిపించారు. అనంతరం మలేషియా, భారత స్నేహ పూర్వ సంబంధాల గురించి ఆయన మాట్లాడారు. అలాగే మలేషియాలో నివసిస్తున్న భారతీయుల కోసం ప్రత్యేకంగా కంప్లైంట్ బాక్స్‌లను వీసా, బీఎల్ఎస్ కాన్సులర్ సెంటర్స్‌లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇవి కాకుండా భారతీయులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి తెలుసుకోవడానికి ప్రతి నెల ఒక రోజు ఓపెన్ డే నిర్వహిస్తున్నట్లు చెప్పారు. దీనికి ఎలాంటి అపాంయింట్‌మెంట్ అవసరం లేదని పేర్కొన్నారు. ఈ సంవత్సరం యునైటెడ్ నేషన్స్ 'ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్'గా డిక్లేర్ చేసిన సందర్భంగా మిల్లెట్స్ చిరుధాన్యాలను ప్రమోట్ చేయడంలో భాగంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు వారి డాన్స్, దేశ భక్తి పాటలతో ప్రేక్షకులను అలరించారు.

Updated Date - 2023-01-27T07:51:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising