AIA ఆధ్వర్యంలో శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా శ్రీకర్ రెడ్డికి ఘన స్వాగతం!
ABN, First Publish Date - 2023-08-25T12:29:37+05:30
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ శ్రీకర్ రెడ్డి కొప్పులకి ఘన స్వాగతం లభించింది.
NRI: అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (AIA) ఆధ్వర్యంలో శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ శ్రీకర్ రెడ్డి కొప్పులకి ఘన స్వాగతం లభించింది. ఎంతో సందడిగా ఈ రిసెప్షన్ నిర్వహించారు. బే ఏరియా గళం విజయ ఆసూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 36 స్థానిక భారతీయ ఆర్గనైజేషన్ సభ్యులు విచ్చేసి ‘డాక్టర్ రెడ్డి’ ని అభినందించారు. మిల్ పిటాస్, శాన్ హోసె, ఫ్రీమాంట్ నగరాలకు చెందిన మేయర్లు, ప్రజా ప్రతినిధులు, భారతీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు. వేదమంత్రోచ్ఛారణలతో డాక్టర్ రెడ్డిని, ఆయన సతీమణి ప్రతిమను స్థానికులు ఘనంగా సన్మానించారు.
తన పట్ల ఇంతటి అభిమానం చూపిస్తున్న భారత, తెలుగు ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. అమెరికా, భారత్ మధ్య మరింత మెరుగైన ద్వైపాక్షిక సంబంధాల కోసం పాటు పడతానని డాక్టర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్రముఖ నాయకులు జయరామ్ కోమటి, రాజ్ బానోత్, జీవన్ జుక్షితో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాన్సుల్ అధికారి డాక్టర్ అకున్ సభర్వాల్ కూడా పాల్గొన్నారు. డాక్టర్ రమేష్ కొండ ఈ కార్యక్రమాన్నిసమన్వయ పరిచారు.
నూతన కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ శ్రీకర్ రెడ్డి కొప్పుల బయో ప్రొఫైల్!
ఇండియాలో డిపార్ట్ మెంట్ ఆఫ్ కామర్స్ జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న డాక్టర్ రెడ్డి.. నూతన కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా (CGI), శాన్ ఫ్రాన్సిస్కోగా ఎంపికయ్యారు. కెరీర్ డిప్లొమాట్ అయిన ఆయన 2001లో ఇండియన్ ఫారిన్ సర్వీస్‌లో చేరారు. జర్మనీ, స్విట్జర్లాండ్, వియత్నాంలలోని ఇండియన్ మిషన్‌లు/పోస్ట్‌లలో వివిధ హోదాల్లో సేవలందించారు. ఈ క్రమంలో ఆయన ఆర్థిక, వాణిజ్య దౌత్యంపై ఆయన ఆసక్తిని పెంపొందించుకున్నారు. న్యూ ఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA)లో కూడా పని చేశారు. పాకిస్తాన్, ఈస్ట్ అండ్ సౌత్ ఆఫ్రికా (E&SA)తో భారతదేశ సంబంధాల వ్యవహారాల బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వహించారు. జూలై 2011 నుండి ఆగస్టు 2014 వరకు హైదరాబాద్‌లోని ప్రాంతీయ పాస్‌పోర్ట్ అధికారి (RPO)గా పనిచేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాస్‌పోర్ట్ సేవలలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. పాస్ పోర్టుల డెలివరీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను ఆయన తెచ్చారు. ఉత్తమ పాస్‌పోర్ట్ అధికారిగా సేవలందించిన డాక్టర్ రెడ్డికి జూన్ 2013లో 'పాస్‌పోర్ట్ సేవా పురస్కార్' లభించింది. ఆగస్టు 2014 నుండి అక్టోబర్ 2017 వరకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (WTO) కు భారతదేశ శాశ్వత మిషన్‌లో కౌన్సిలర్‌గా సేవలందించారు. అలాగే అక్టోబర్ 2017 నుండి మార్చి 2020 వరకు వియత్నాంలోని హోచిమిన్ సిటీలో భారత కాన్సుల్ జనరల్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. జూన్ 2020లో భారత ప్రభుత్వంలోని వాణిజ్య శాఖలో జాయింట్ సెక్రటరీగా ఆయన పనిచేశారు. ఆఫ్రికా, మధ్యప్రాచ్య దేశాలతో భారతదేశ వాణిజ్య సంబంధాలను పర్యవేక్షించారు. భారతదేశం-మారిషస్ సమగ్ర ఆర్థిక సహకారం, భాగస్వామ్య ఒప్పందం (CECPA), భారతదేశం-యూఏఈ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (CEPA) కోసం భారతదేశ ప్రధాన సంధానకర్తగా విశిష్ట సేవలందించారు.
01 ఏప్రిల్ 2021 నుంచి CECPA, 01 మే 2022 నుండి CEPA అమల్లోకి వచ్చాయి. భారతదేశం-యుఏఇ CEPA 88 రోజుల రికార్డు సమయంలో ముగిసింది. మే 2022 నుండి జూన్ 2023 వరకు ఇండో-పసిఫిక్ ఎకనమిక్ ఫ్రేమ్ వర్క్ ఫర్ ప్రాస్పరిటీ కోసం (IPEF) కింద యునైటెడ్ స్టేట్స్, ఇండియాతో సహా 14 భాగస్వామ్య దేశాల మధ్య క్లీన్ ఎకానమీ (పిల్లర్-3) పై ఒప్పందం కోసం జరిగిన చర్చలలో భారతదేశానికి ప్రధాన సంధానకర్తగా ఉన్నారు. ఆగస్టు 19, 2023 నుండి శాన్ ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్‌గా ఆయన సేవలందిస్తున్నారు. తెలంగాణలోని వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో మెడిసిన్ (MBBS) చదివారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, జర్మన్ భాషలు ఆయన మాట్లాడగలరు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ప్రతిమ కొప్పులను ఆయన వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు ఉన్నాడు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొన్ని అసోసియేషన్స్..
American Organization for Development of Bihar (AODB)
Asha Jyothi Organization
ATEA - American Tamil Entrepreneurs Association
BATA - Bay Area Telugu Association
BATM - Bay Area Tamil Manram
Bay Malayali, Bihar Association
Dance Karishma
Federation of Malayalee Associations of Americas
Gujarati Cultural Association (GCA)
GOPIO (Global Organization of the People of Indian Origin)
Hindu Temple & Cultural Centre (livermore Shiva Vishnu Temple)
ILP (India Literacy Project)
Indo American Society of Bay Area
IACF - Indo-American Community Federation
KKNC (kannada Koota of Northern California)
KTF Kashmiri Task Force
OSA (California Chapter)
Paatasala (Telugu School)
PCA (Punjabi Cultural Association)
SEF (Sankara Eye Foundation)
Sewa International
Spandana organization
TANA (Telugu Association of North America)
TCA (Telangana Cultural Association)
WETA (Women Empowerment Telugu Association
Updated Date - 2023-08-25T12:29:37+05:30 IST